మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్)కు భారీ షాక్ తగిలింది. జీ సంస్థ భారీ మొత్తంలో నిధుల మళ్లించినట్లు మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ గుర్తించింది. ఫలితంగా ఆ సంస్థ షేర్లు పతనమవుతున్నాయి.
జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్) తాజాగా సోనీ గ్రూప్ తో వీలిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గత నెలలో రండు సంస్థల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన విలీన ప్రతిపాదన రద్దయిన నేపరథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే ఈ తరుణంలో జీ వ్యవస్థాపకులపై సెబీ జరిపిన విచారణలో కంపెనీ నుండి సుమారు 20 బిలియన్ల ($241 మిలియన్లు) మొత్తాన్ని మళ్లించినట్లు తేలింది. నిధుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. జీలో నిధులు మళ్లించడం సెబీ ఊహించిన దానికంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఉందని సమాచారం.
సెబీ రివ్యూ
భారీ మొత్తంలో నిధులు మాయమవ్వడంపై జీ ఇచ్చే సమాధానాలపై సెబీ రివ్వ్యూ జరపనుంది. రివ్యూ జరిపేందుకు రెగ్యులేటరీ జీ ఫౌండర్ సుభాష్ చంద్ర, అతని కుమారుడు పునిత్ గోయాంక్తో పాటు ఇతర బోర్డ్ సభ్యులు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే రివ్యూ అనంతరం పైన పేర్కొన్నట్లుగా జీలో నిధులు మళ్లీంపు, లేదంటే దుర్వినియోగం జరిగిందా అనే అంశంపై స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment