Zee news
-
సోనీతో విలీనానికి మళ్లీ రెడీ.. అంతలోనే ‘జీ’కి భారీ షాక్..
మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్)కు భారీ షాక్ తగిలింది. జీ సంస్థ భారీ మొత్తంలో నిధుల మళ్లించినట్లు మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ గుర్తించింది. ఫలితంగా ఆ సంస్థ షేర్లు పతనమవుతున్నాయి. జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్) తాజాగా సోనీ గ్రూప్ తో వీలిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గత నెలలో రండు సంస్థల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన విలీన ప్రతిపాదన రద్దయిన నేపరథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ తరుణంలో జీ వ్యవస్థాపకులపై సెబీ జరిపిన విచారణలో కంపెనీ నుండి సుమారు 20 బిలియన్ల ($241 మిలియన్లు) మొత్తాన్ని మళ్లించినట్లు తేలింది. నిధుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. జీలో నిధులు మళ్లించడం సెబీ ఊహించిన దానికంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఉందని సమాచారం. సెబీ రివ్యూ భారీ మొత్తంలో నిధులు మాయమవ్వడంపై జీ ఇచ్చే సమాధానాలపై సెబీ రివ్వ్యూ జరపనుంది. రివ్యూ జరిపేందుకు రెగ్యులేటరీ జీ ఫౌండర్ సుభాష్ చంద్ర, అతని కుమారుడు పునిత్ గోయాంక్తో పాటు ఇతర బోర్డ్ సభ్యులు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే రివ్యూ అనంతరం పైన పేర్కొన్నట్లుగా జీలో నిధులు మళ్లీంపు, లేదంటే దుర్వినియోగం జరిగిందా అనే అంశంపై స్పష్టత రానుంది. -
కరోనాతో ‘జీ టీవీ’ ఎడిటర్ కన్నుమూత
కోల్‌కత: మాయదారి కరోనా జర్నలిస్టులపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పెద్ద ఎత్తున జర్నలిస్టులు కూడా కరోనాకు బలవుతున్నారు. తాజాగా టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు. దీంతో బెంగాల్ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్లో ప్రముఖ టీవీ యాంకర్లలో అంజన్ బందోపాధ్యాయ్ ఒకరు. ఆయన జీ 24 గంట బెంగాల్ టీవీ ఛానల్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాంకర్‌గా కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంజన్ కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. కొన్ని రోజులకు మళ్లీ కరోనా తిరగబెట్టింది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మృతిచెందారు. అంజన్ బందోపాధ్యాయ్ జర్నలిజంలో 33 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అంతకుముందు ఆనంద్‌బజార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. చదవండి: కరోనాతో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
జీ మీడియాకు పునీత్ గోయెంకా రాజీనామా
సాక్షి, ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) సీఎండీ పునిత్ గోయెంకా జీ మీడియా నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ డైరెక్టర్ పదవికి గోయెంకా రాజీనామా చేశారని, తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని జీ మీడియా ఎక్స్ఛేంజ్ సమాచారంలో బుధవారం తెలిపింది. 2010 జనవరి నుంచి జీల్ ఎండీ గా ఉన్న గోయెంకా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పెద్ద కుమారుడు. గోయెంకా జనవరి 1, 2010 నుండి జీ ఎంటర్టైన్మెట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు జీ మీడియా కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 11.14 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ 86.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం 18.42 శాతం తగ్గి 138.15 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 169.35 కోట్లుగా ఉంది. మల్టీ బిలియన్ డాలర్ల ఎస్సెల్ గ్రూపులో జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో జీ న్యూస్ లిమిటెడ్) ఒకభాగం. -
సంచలన ఎంపీపై పరువునష్టం దావా
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన తొలి ప్రసంగంతోనే యావత దేశం దృష్టిని ఆకర్షించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయ్‌త్రా చిక్కుల్లో పడ్డారు. లోక్‌సభలో తన ప్రసంగంలో సందర్భంగా జీన్యూస్ ఛానల్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆ ఛానల్ చీఫ్ సుధీర్ చౌదరీ ఆమెపై పరువునష్టం దావా కేసు వేశారు. సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తమ సంస్థను ప్రస్తావిస్తూ.. దొంగ (చోర్), పెయిడ్ న్యూస్ ఛానల్ (అమ్ముడుపోయిన వార్త సంస్థ) అన్నారని జీ న్యూస్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ మేరకు పటియాలా హౌస్ కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేశారు. దీనిపై సంస్థ తరఫున న్యాయవాది విజయ్ అగర్వాల్ మాట్లాడతూ... జీ న్యూస్ సంస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై క్రిమిల్ పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించారు. తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా సంస్థ యజమానిని దొంగ అన్నారని, దీంతో మహువా మొయ్‌త్రాపై కేసు వేసినట్లు తెలిపారు. కాగా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన మొయ్‌త్రా.. మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. -
మళ్లీ బుల్లితెరపైకి ఆశుతోష్
న్యూఢిల్లీ: అద్భుతమైన విలనీతో ప్రేక్షకులను మెప్పించే ఆశుతోష్ రాణా మళ్లీ బుల్లితెరవైపు వెళ్తున్నాడు. అయితే ఈసారి మనోడి గాలి రాజకీయాలవైపునకు మళ్లింది. ‘భారత్ భత్య విధాత: లోక్తంత్ర కా మేకోవర్’ పేరుతో నిర్వహించే రాజకీయ చర్చాకార్యక్రమానికి రాణా అతిథేయిగా వ్యవహరిస్తాడు. నిరుద్యోగం, మహిళల భద్రత, అవినీతి అంశాలపై ఇందులో చర్చలు ఉంటాయి. ఎంతో జనాదరణ పొందిన టీవీ సీరియల్ స్వాభిమాన్ ద్వారా రాణా బుల్లితెరకు పరిచయమయ్యాడు. నాలుగేళ్ల తరువాత తిరిగి టీవీతెరపై దర్శనమివ్వనున్నాడు. జీన్యూస్ ఈ నెల 16 నుంచి ప్రసారం చేస్తున్న ‘నిషాన్ పే’ షోను కూడా ఈ 45 ఏళ్ల నటుడు నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో రాణా సామాన్యుడిగా గొంతుకను వినిపిస్తాడు. ‘మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఇందులో ప్రస్తావిస్తాం. ఈ కార్యక్రమం 13 భాగాలుగా ప్రసారమవుతుంది. ప్రజలు లేవనెత్తే ప్రశ్నలకు జవాబులివ్వడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరవుతారు’ అని రాణా వివరించాడు. బుల్లితెరపై మంచి కార్యక్రమాలు రావడం, బాలీవుడ్ తారలు కూడా వీటివైపు మొగ్గు చూపడం మంచి పరిణామమని రాణా అన్నాడు. గోవింద్ నిహ్లానీ సంశోధన్ సినిమా ద్వారా పరిచయమైన ఇతడు.. తదనంతరం దుష్మన్, సంఘర్ష్, హాసిల్లో విలన్‌గా అదరగొట్టాడు. ఇటీవల విడుదలైన కిస్మత్ లవ్ పైసా దిల్లీ రాణా చివరి చిత్రం. ‘స్క్రిప్టుల ఆధారంగానే నేను సినిమాలకు ఒప్పుకుంటాను. కిస్మత్.. సినిమా స్క్రిప్టు నచ్చబట్టే అందులో నటించాను. దురదృష్టవశాత్తూ అది ప్రేక్షకులకు నచ్చలేదు. నేను తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాను’ అని వివరించిన రాణా పవ న్ క ళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారంలోనూ విలన్‌గా కనిపించాడు. రామ్‌గోపాల్ వర్మ అబ్తక్ చప్పన్-2, డర్టీ పాలిటిక్స్ రాణా తదుపరి సినిమాలు.