సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన తొలి ప్రసంగంతోనే యావత దేశం దృష్టిని ఆకర్షించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయ్‌త్రా చిక్కుల్లో పడ్డారు. లోక్‌సభలో తన ప్రసంగంలో సందర్భంగా జీన్యూస్ ఛానల్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆ ఛానల్ చీఫ్ సుధీర్ చౌదరీ ఆమెపై పరువునష్టం దావా కేసు వేశారు. సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తమ సంస్థను ప్రస్తావిస్తూ.. దొంగ (చోర్), పెయిడ్ న్యూస్ ఛానల్ (అమ్ముడుపోయిన వార్త సంస్థ) అన్నారని జీ న్యూస్ యాజమాన్యం ఆరోపిస్తోంది.
ఈ మేరకు పటియాలా హౌస్ కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేశారు. దీనిపై సంస్థ తరఫున న్యాయవాది విజయ్ అగర్వాల్ మాట్లాడతూ... జీ న్యూస్ సంస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై క్రిమిల్ పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించారు. తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా సంస్థ యజమానిని దొంగ అన్నారని, దీంతో మహువా మొయ్‌త్రాపై కేసు వేసినట్లు తెలిపారు. కాగా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన మొయ్‌త్రా.. మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
Comments
Please login to add a commentAdd a comment