కోల్‌కతా: బెంగాల్‌లో మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది టీఎంసీ. ఆయనకు బహుశా మెంటల్ అయి ఉండవచ్చని మండిపడింది. టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఈమేరకు స్పందించారు.
'మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారని విన్నాము. బహుశా ఆయనకు శారీరక సమస్య కాదు మానసిక సమస్య అయి ఉంటుంది. ఆయన చెప్పే మాటలను బెంగాల్లో ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అదే సమస్య' అని శాంతను సేన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
#WATCH | I heard that Mithun Chakraborty was admitted to a hospital a few days back. I think he was mentally ill & not physically... The problem is that he does not know politics: TMC MP Santanu Sen on Mithun Chakraborty's remarks pic.twitter.com/5FUKkM7RIQ
— ANI (@ANI) July 27, 2022
అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మిథున్ చక్రవర్తి. మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత టీఎంసీలో తుఫాన్ మొదలైందని, ఆ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. బెంగాల్‌లో కూడా మహారాష్ట్ర పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు.
చదవండి: మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు!
Comments
Please login to add a commentAdd a comment