కోల్‌కతా: బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్. బెంగాల్‌ను చేజిక్కించుకునేందుకు విభజించు పాలించు విధానాన్ని కమలం పార్టీ రెండింతలు అవలంబిస్తోందని మండిపడ్డారు. తమ రాష్ట్రాన్ని విభజించి ఆర్థికంగా ఆంక్షలు విధించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
బెంగాల్ ప్రజలను వీటిని గమనిస్తున్నారని శేఖర్ రాయ్ పేర్కొన్నారు. 1905-10 మధ్యకాలంలో రాష్ట్రాన్ని విడదీయాలని చూసిన బ్రిటిషర్లకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇప్పుడు బీజేపీని కూడా ప్రజలు అలాగే అడ్డుకుంటారని పేర్కొన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బెంగాల్‌ను ఎలగైనా హస్తగతం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని చెప్పారు రాయ్. అందుకు ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు ఎత్తులు వేస్తొందని ఆరోపించారు. బిహార్‌లోని పూర్ణియా, సహర్సా, కిషన్‌గంజ్, కతిహార్ ప్రాంతాలను బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్, జల్‌పాయ్‍గుడి, అలిపూర్‌దౌర్‌లతో తో కలిపి కొత్తగా కేంద్రపాలిత ప్రంతాన్ని ఏర్పాటు చేయాలని చూస్తొందని రాయ్ ఆరోపించారు. ఈ తర్వాత అక్కడ ఆర్థిక ఆంక్షలు విధించి, కేంద్ర పథకాల్లో కోత విధించాలని చూస్తున్నారని విమర్శించారు.
అంతేకాదు దేశంలో కొత్తగా మరో 20 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లను మరిన్ని రాష్ట్రాలుగా మార్చాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
చదవండి: బీజేపీతో సంబంధాలపై నితీశ్‌కు పీకే ఛాలెంజ్
Comments
Please login to add a commentAdd a comment