
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టీఎంసీ ఎంపీ అబు తాహెర్ ఖాన్ కారు ఢీకొట్టి ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ముర్షీదాబాద్ జిల్లాలో జరిగింది.
ఘటన సమయంలో టీఎంసీ ఎంపీ కారులోనే ఉన్నారు. బాలుడు తన తల్లితో కలిసి సమీపంలోని బ్యాంకుకు వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో కారు ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు ఎంపీ బాలుడ్ని వెంటనే తన కారులోనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తలకు తీవ్రగాయాలు కావడం వల్ల బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
అబు తాహెర్ ఖాన్ టీఎంసీ తరఫున ముర్షీదాబాద్ నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..
Comments
Please login to add a commentAdd a comment