Murshidabad district
-
శోభాయాత్రపై రాళ్ల దాడి.. సీఎం మమతపై బీజేపీ ఆగ్రహం!
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్‌లోని శక్తిపూర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కొందరు గాయపడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారని, రెజీనగర్‌లో ఒక వర్గాన్ని టార్గెట్ చేశారని బీజేపీ ఆరోపించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం శక్తిపూర్‌లో శ్రీరామనవమి ఊరేగింపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ గాయపడింది. బాధితురాలిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Mamata Banerjee is a blot on West Bengal. She, once again, failed to protect Ramanavami Shobha Yatras. Hindu devotees targeted in Rejinagar, Murshidabad. Hindus are a minority in this area. Just pointing it out, so that she doesn’t blame the Hindus for the attack on themselves… pic.twitter.com/pzvJt0aZ4x — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 17, 2024 శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి ఊరేగింపునకు రక్షణ కల్పించడంలో సీఎం మమతా బెనర్జీ మరోసారి విఫలమయ్యారని ఆరోపించారు. శోభా యాత్రపై దాడికి మమతా బెనర్జీ మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో అల్లర్ల అనంతరం మేదినిపూర్‌లోని ఎగ్రాలో ఒక వర్గంపై దాడి జరిగింది. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎగ్రా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఈ ఘటనలకు బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. -
TMC MP: టీఎంసీ ఎంపీ కారు ఢీకొని ఏడేళ్ల బాలుడు..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. టీఎంసీ ఎంపీ అబు తాహెర్ ఖాన్ కారు ఢీకొట్టి ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ముర్షీదాబాద్ జిల్లాలో జరిగింది. ఘటన సమయంలో టీఎంసీ ఎంపీ కారులోనే ఉన్నారు. బాలుడు తన తల్లితో కలిసి సమీపంలోని బ్యాంకుకు వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో కారు ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు ఎంపీ బాలుడ్ని వెంటనే తన కారులోనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తలకు తీవ్రగాయాలు కావడం వల్ల బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అబు తాహెర్ ఖాన్ టీఎంసీ తరఫున ముర్షీదాబాద్ నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది.. -
పిల్లలపై ఒమిక్రాన్ పడగ; 7 ఏళ్ల బాలుడికి పాజిటివ్
7 Year Old Boy Tested Omicron Positive: భారత్‌లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పిల్లలు సైతం కొత్త వేరియంట్ కాటుకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణయింది. ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అబుదాబి నుంచి డిసెంబర్ 10న హైదరాబాద్ మీదుగా బెంగాల్‌కు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఓమిక్రాన్ వేరియంట్‌ను చూపించింది. బాలుడి తల్లిదండ్రులకు ఒమిక్రాన్ సోకలేదని, వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వారికి సమాచారం అందించారు. దీంతో బాలుడిని ముర్షిదాబాద్ జిల్లాలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 40 దాటాయని వార్తలు వస్తున్నాయి. (చదవండి: చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు) -
మమతకు జై కొట్టిన ‘కాంగ్రెస్’ జిల్లాలు
కోల్‌కతా: కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా బెనర్జీ అద్వితీయ విజయం సాధ్యమైంది. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్‌లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్‌లో– 14) నెగ్గింది. 2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది. 2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. మార్పునకు కారణమేంటి? ఈ రెండు ముస్లిం ఆధిపత్య జిల్లాలు. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్‌లో 66% జనాభా ముస్లింలే. చాన్నాళ్లుగా వీరు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లింలు అత్యంత వ్యూహాత్మకంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్ కూటమిల త్రిముఖ పోరులో, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే, అది అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని వారు గుర్తించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖ పోరు వల్ల బీజేపీ లాభపడిన విషయాన్ని వారు మర్చిపోలేదు. దాంతో, కీలకమైన ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని, తృణమూల్, కాంగ్రెస్‌ల మధ్య తమ ఓట్లు చీలకూడదని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా తృణమూల్‌కు మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత, వివాదాస్పద ఎన్నార్సీ, సీఏఏలను మమత గట్టిగా వ్యతిరేకించడం ముస్లింలకు ఆమెపై విశ్వాసం పెరగడానికి కారణమైంది. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తారన్న భయం కూడా ముస్లింలను మమతకు దగ్గర చేసింది. బీజేపీ గెలుపును అడ్డుకునేలా, ఈ రెండు జిల్లాల్లో ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్ సరళి తృణమూల్ ఘనవిజయానికి బాటలు వేసింది. -
ఫత్వా: టీవీ చూసినా, పాటలు విన్నా శిక్ష
కోల్‌కతా: ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు టెలివిజన్ చూడటం, క్యారమ్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ఈ కమిటీ సూచించిన శిక్షల జాబితా: టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా క్యారమ్ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా మద్యం సేవించడం: రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది. యువ తరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా ఆపడానికి వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది. చదవండి: కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు -
‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’
ముర్షిదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను అలనాటి బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురితో పోల్చారు. మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి క్యారెక్టర్ మొగాంబోగా వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో 'ఖుష్ హోగయా' అనే డైలాగ్‌ను సంతోషం వ్యక్తం చేస్తూ అమ్రిష్ పురి వాడుతుంటాడు. అదే తరహాలో ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు భారత ప్రభుత్వం నానా అవస్థలు పడుతుందని అధీర్ రంజన్ ఎద్దేవా చేశారు. (వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్) ట్రంప్‌ను సంతోషం పెట్టేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ? మురికి వాడల్లో నివసిస్తున్న పేదవారిని అంతగా దాచిపెట్టాల్సిన పని ఏంటని? మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఓ నమూనాగా గుజరాత్‌ను డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ... అక్కడ పేదలను మాత్రం దోపిడీకి గురి చేస్తుందని మండిపడ్డారు. మొగాంబోను సంతోషం పెట్టడానికి మేం ఏదైనా చేస్తామన్న రీతిలో కేంద్రం ప్రవర్తించడం సిగ్గుచేటరన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా తాము నిరసనకు దిగుతామన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 న డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేస్తున్న విందు కోసం రాష్ట్రపతి భవన్ చేసిన ఆహ్వానాన్ని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు. 'ట్రంప్ భారత్‌కు వస్తున్నారు. భారతదేశం ఆయన కోసం గ్రాండ్ డిన్నర్ నిర్వహించనున్నప్పటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించలేదు. సోనియా గాంధీని ట్రంప్‌తో విందుకు ఆహ్వానం లేదు. 'హౌడీ మోడీ' కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ వేదికను పంచుకున్నారు. అయితే ఇక్కడ మోదీ మాత్రమే ట్రంప్‌తో ఉంటారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ' అని చౌదరి కేంద్ర సర్కార్‌ను నిలదీశారు. తాను వ్యక్తిగతంగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, నిజంగా ట్రంప్ భారతదేశానికి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్‌ను మేము మనస్పూర్తిగానే స్వాగతిస్తున్నమని తెలిపారు.అయితే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటుందని, వాటి లక్షణాలను గౌరవించాల్సిందేనని చౌదరి పేర్కొన్నారు. (అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్) -
బెంగాల్ లో బాంబుల మోత:ముగ్గురి మృతి
ముర్షిదాబాద్: మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్ లో హింస చెలరేగింది. అయితే నిత్యం చోటుచేసుకునే తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంల సంఘర్షణలా కాకుండా ఈసారి ఒకే పార్టీకి చెందిన రెండు గ్రూపులు నాటు బాంబులు విసురుకున్నాయి. ముర్షిదాబాద్ జిల్లా భరత్ పూర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఒక వర్గం లక్ష్యంగా మరొక వర్గం విసిరిన నాటుబాంబులు పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో విపక్ష పార్టీ సీపీఎం సభ్యులతో తన్నులాటలకు దిగుతోన్న తృణమూల్ కాంగ్రెస్.. స్వపక్షంలో గ్రూపు తగాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పార్టీ ఆందోళనలో పడింది.