Sukhendu Sekhar Roy
-
బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్
కోల్‌కతా: బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్. బెంగాల్‌ను చేజిక్కించుకునేందుకు విభజించు పాలించు విధానాన్ని కమలం పార్టీ రెండింతలు అవలంబిస్తోందని మండిపడ్డారు. తమ రాష్ట్రాన్ని విభజించి ఆర్థికంగా ఆంక్షలు విధించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ ప్రజలను వీటిని గమనిస్తున్నారని శేఖర్ రాయ్ పేర్కొన్నారు. 1905-10 మధ్యకాలంలో రాష్ట్రాన్ని విడదీయాలని చూసిన బ్రిటిషర్లకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇప్పుడు బీజేపీని కూడా ప్రజలు అలాగే అడ్డుకుంటారని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బెంగాల్‌ను ఎలగైనా హస్తగతం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని చెప్పారు రాయ్. అందుకు ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు ఎత్తులు వేస్తొందని ఆరోపించారు. బిహార్‌లోని పూర్ణియా, సహర్సా, కిషన్‌గంజ్, కతిహార్ ప్రాంతాలను బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్, జల్పాయ్గుడి, అలిపూర్‌దౌర్‌లతో తో కలిపి కొత్తగా కేంద్రపాలిత ప్రంతాన్ని ఏర్పాటు చేయాలని చూస్తొందని రాయ్ ఆరోపించారు. ఈ తర్వాత అక్కడ ఆర్థిక ఆంక్షలు విధించి, కేంద్ర పథకాల్లో కోత విధించాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాదు దేశంలో కొత్తగా మరో 20 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లను మరిన్ని రాష్ట్రాలుగా మార్చాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: బీజేపీతో సంబంధాలపై నితీశ్‌కు పీకే ఛాలెంజ్ -
తృణమూల్‌కే డిప్యూటీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో విపక్షాలు ఐక్యతకు పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగా డిప్యూటీ చైర్మన్‌గా తృణమూల్ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీకి కాంగ్రెస్ తెలియజేసినట్లు సమాచారం. మమత ఎవరిని బరిలో నిలిపినా తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 13 మంది సభ్యులున్న తృణమూల్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ బీజేపీ వ్యతిరేక అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తోందని సమాచారం. ఎగువసభలో పార్టీ ఉపనేత, రెండోసారి ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్‌ని పోటీలో ఉంచే అవకాశం కనబడుతోంది. కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటోంది? 245 మంది సభ్యులున్న ఎగువ సభలో కాంగ్రెస్‌కు 51మంది ఎంపీలున్నారు. సహజంగానే విపక్ష పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థే బరిలో ఉండాలి. కానీ ఎన్డీఏయేతర పక్షాల అభ్యర్థి గెలవాలంటే యూపీఏయేతర పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం తక్కువే. బిజూ జనతాదళ్ (9), టీఆర్ఎస్ (6) వంటి పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ పార్టీలూ టీఎంసీ అభ్యర్థి బరిలో ఉంటే మద్దతిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంటున్న ఏఐఏడీఎంకే (13) చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని కాంగ్రెస్ నేతలంటున్నారు. 123 ఎంపీల మద్దతుంటేనే విజయం దక్కే ఈ ఎన్నికలో బీజేపీ, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది ఎంపీలుండగా.. 5–10 ఎంపీలున్న పార్టీలు కనీసం 8 వరకున్నాయి. మిగిలిన పార్టీలకు ఇద్దరు, ముగ్గురు సభ్యుల బలముంది. బీజేపీలో తర్జన భర్జన ఈ ఎన్నికలపై 69 మంది సభ్యులున్న బీజేపీ మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అధికార పార్టీ చెబుతోంది. జూన్ 15న ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన భేటీలో టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావును బరిలో దించడంపై చర్చించినట్లు వార్తలొచ్చాయి -
ప్రతిపక్షాల అభ్యర్థి తృణమూల్ నాయకుడు
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ప్రతిపక్షాలు, అధికార పక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ పీజే కురియన్ 2012లో డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైయ్యారు. కురియన్ పదవీ కాలం జులై 2తో ముగియనున్న విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మిత్రపక్షాల నుంచి అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖెండు శేఖర్ రాయ్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 51 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీకి లేకపోవడంతో ప్రతిపక్షాలను ఏకం చేసి వారికి విజయం దక్కకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, బీజు జనతా దళ్(బీజేడీ) పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కేశవరావు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇరవై ఆరేళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. చివరిసారిగా 1992లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నజ్మా హెప్తుల్లా(ప్రస్తుతం బీజేపీ), టీడీపీ అభ్యర్ధి రేణుకా చౌదరిపై పోటీ చేసి విజయం సాధించారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న వర్ష కాల సమావేశంలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. -
ఏం మాట్లాడుతున్నారు.. షటప్!
-
ఏం మాట్లాడుతున్నారు.. షటప్!
పెద్దల సభలో గందరగోళం చెలరేగింది. పశ్చిమబెంగాల్లో సైన్యం మోహరింపు విషయమై మొదలైన వివాదం చివరకు సభ్యులు తీవ్ర పదజాలం ఉపయోగించేవరకు వెళ్లింది. టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ దీనిపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్నప్పుడు.. అధికార పక్షం నుంచి వ్యాఖ్యలు వినిపించడంతో ఆయన ఆవేశం పట్టలేకపోయారు. ''వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్.. షటప్, షటప్'' అంటూ అధికారపక్షం మీద తీవ్రంగా మండిపడ్డారు. ఇదేమైనా జాతీయ అత్యవసర పరిస్థితా అని ప్రశ్నించిన రాయ్.. మంత్రి సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా తీవ్రంగానే స్పందించారు. సైన్యం ఇలా వెళ్లడం ఇదేమీ మొదటిసారి కాదని, గత సంవత్సరం కూడా ఇదే సమయంలో అదే రాష్ట్రానికి వెళ్లిందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో కూడా ఇలాగే జరుగుతోందని అన్నారు. అంతకుముందు కూడా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తనను కూడా మాట్లాడనివ్వకపోవడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆగ్రహానికి గురయ్యారు.. 'మీకే కాదు, నాకు కూడా కోపం వస్తుంది. మీరు నన్నే మాట్లాడనివ్వనంత సాహసం చేస్తారా, సీనియర్ సభ్యులైనా కూడా ఇలా చేస్తే నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది' అని గట్టిగా చెప్పారు. -
రాజ్యసభ నుంచి ఎంపీని బయటకు పొమ్మన్నారు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పై రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అగస్టా- వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చకు శేఖర్ ఇచ్చిన నోటీసును అన్సారి తిరస్కరించారు. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. రక్షణ మంత్రి మనోహర్ పరికర్ వెంటనే ప్రకటన చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పదేపదే సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. చైర్మన్ ఎన్నిసార్లు వారించినా ఆయన వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అన్సారి సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా శేఖర్ రాయ్ ను ఆదేశించారు. ఈ రోజు సభలో అడుగుపెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. చైర్మన్ ఆదేశాలకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రోజు సభకు హాజరు కాబోమని ప్రకటించారు. అగస్టా- వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై పెద్దల సభ ఈ రోజు కూడా దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనతో పలుమార్లు వాయిదా పడింది.