divide and rule policy
-
బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్
కోల్‌కతా: బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్. బెంగాల్‌ను చేజిక్కించుకునేందుకు విభజించు పాలించు విధానాన్ని కమలం పార్టీ రెండింతలు అవలంబిస్తోందని మండిపడ్డారు. తమ రాష్ట్రాన్ని విభజించి ఆర్థికంగా ఆంక్షలు విధించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ ప్రజలను వీటిని గమనిస్తున్నారని శేఖర్ రాయ్ పేర్కొన్నారు. 1905-10 మధ్యకాలంలో రాష్ట్రాన్ని విడదీయాలని చూసిన బ్రిటిషర్లకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇప్పుడు బీజేపీని కూడా ప్రజలు అలాగే అడ్డుకుంటారని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బెంగాల్‌ను ఎలగైనా హస్తగతం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని చెప్పారు రాయ్. అందుకు ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు ఎత్తులు వేస్తొందని ఆరోపించారు. బిహార్‌లోని పూర్ణియా, సహర్సా, కిషన్‌గంజ్, కతిహార్ ప్రాంతాలను బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్, జల్పాయ్గుడి, అలిపూర్‌దౌర్‌లతో తో కలిపి కొత్తగా కేంద్రపాలిత ప్రంతాన్ని ఏర్పాటు చేయాలని చూస్తొందని రాయ్ ఆరోపించారు. ఈ తర్వాత అక్కడ ఆర్థిక ఆంక్షలు విధించి, కేంద్ర పథకాల్లో కోత విధించాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాదు దేశంలో కొత్తగా మరో 20 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లను మరిన్ని రాష్ట్రాలుగా మార్చాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: బీజేపీతో సంబంధాలపై నితీశ్‌కు పీకే ఛాలెంజ్ -
విభజించి పాలిస్తున్న బీజేపీ
సాక్షి, నెల్లూరు రూరల్: ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ.. విభజించు..పాలించు విధానంలో పాలన సాగిస్తోందని ఆలిండియా డీవైఎఫ్ఐ (డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మాజీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ఎంపీ మహ్మద్ సలీం ఆరోపించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం నెల్లూరులో ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లూరు నగరంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్తకి సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, 16 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లలో వేస్తామనే హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. మూడున్నరేళ్లు అయినా ఇప్పటికీ ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. నిరుద్యోగం పెరగడానికి బీజేపీ అవలంబిస్తోన్న ఆర్థిక విధానాలే కారణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మోసం చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్.. సంఘ్‌పరివార్‌కు త్రిశూలాలు, కరవాలాలు అందజేసి భయానక వాతావరణం కల్పిస్తోందని చెప్పారు. వామపక్షవాదులుగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఈ సభలో డీవైఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు పాల్గొన్నారు. -
‘నాగా’తో శాంతి ఒప్పందం
నాగా తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న భారత ప్రభుత్వం * ప్రధాని సమక్షంలో ఇరుపక్షాల సంతకాలు న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో దశాబ్దాల అంతర్యుద్ధానికి అంతం పలికే దిశగా కేంద్రం చరిత్రాత్మక ముందడుగు వేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న ‘నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- ఇసాక్, మ్యువా(ఎన్ఎస్సీఎన్- ఐఎం)’ సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని మోదీ సమక్షంలో సోమవారం ప్రభుత్వ ప్రతినిధి ఆర్ఎన్ రవి, ఎన్ఎస్సీఎన్- ఐఎం నేత టీ మ్యువా(79) ఆ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. నాగాలాండ్‌లో శాంతి నెలకొనే దిశగా వేసిన చరిత్రాత్మక అడుగుగా ఈ ఒప్పందాన్ని మోదీ అభివర్ణించారు. 16 ఏళ్లుగా దాదాపు 80 రౌండ్ల పాటు సాగిన చర్చల ఫలితంగా ఈ శాంతి ఒప్పందం రూపొందింది. అంతకుముందు 1997లో ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో నాగా ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలను ఏకం చేయాలన్న ఎన్ఎస్సీఎన్- ఐఎం డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందా? లేదా? అన్న విషయం వెల్లడి కాలేదు. ఒప్పందం వివరాలను త్వరలో విడుదల చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. నాగా తీవ్రవాద సంస్థల్లో అతి పెద్దదైన ‘ఎన్ఎస్సీఎన్- ఐఎం’.. కేంద్రంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తుండగా, ఖప్లాంగ్ నాయకత్వంలోని ‘ఎన్ఎస్సీఎన్ - కే’ హింసామార్గంలో ఉంది. ప్రత్యేక నాగాలాండ్ కోసం సాగిన పోరాటంలో 3 వేల మందికి పైగా చనిపోయారు. మొదట స్వతంత్ర నాగాలాండ్ కావాలని డిమాండ్ చేసిన తిరుగుబాటు దారులు.. తరువాత నాగా ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలనన్నింటినీ ఏకం చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఖప్లాంగ్ సంస్థతో కూడా 2001లో భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ సంస్థ తరచుగా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ముఖ్యంగా నాగాలాండ్, మణిపూర్లలో దాడులు, అవినీతి, అక్రమంగా పన్నుల సేకరణ, బలవంతంగా డబ్బుల వసూళ్లకు దిగుతూ సామాన్యులను ఇక్కట్లపాలు చేస్తున్నాయి. వలస పాలన అందించిన విషాద వారసత్వం.. మోదీ: శాంతి ఒప్పందంపై సంతకాల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఒక సమస్యకు అంతం పలకడమే కాదు.. నూతన భవిష్యత్తు దిశగా ముందడుగు వేస్తున్నాం’ అన్నారు. నాగా ప్రజలనుద్దేశించి.. ‘గాయాలు మాన్పే, సమస్యలను పరిష్కరించే విషయాల్లోనే కాదు.. మీ గౌరవప్రతిష్టలను నిలుపుకునే మీ ప్రయత్నాల్లో కూడా భాగస్వాములవుతాం’ అని హామీ ఇచ్చారు. ఆరు దశాబ్దాల ఈ సంక్షోభం వలస పాలన అందించిన వారసత్వ విషాదమని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్ఎస్సీఎన్ - ఐఎం నేతలు టీ మ్యువా, ఇసాక్ స్వులను ప్రశంసిస్తూ.. వారు చూపిన దార్శనికత, ధైర్య సాహసాల వల్లనే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైందన్నారు. ‘నాగా ప్రజల ధైర్య సాహసాలు, పట్టుదల అనితర సాధ్యం.’ అని కొనియాడారు. భారత ప్రభుత్వం, నాగా ప్రజల సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్న టీ మ్యువా.. మరిన్ని సమస్యలు ముందున్నాయని హెచ్చరించారు. ఈశాన్యరాష్ట్రాల్లో శాంతి నెలకొనడం, ఆ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయటం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. ఇతర పార్టీల నేతలతో సమాలోచనలు.. ఈ ఒప్పందంపై సంతకాలు జరిపే ముందు.. పలు పార్టీల నేతలతో మోదీ మాట్లాడారు. వారిలో మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ నేత ఖర్గే, ములాయం, మాయావతి, శరద్ పవార్, సీతారాం యేచూరి తదితరులున్నారు. మమత బెనర్జీ, జయలలిత, డీఎంకే నేత కరుణానిధి, జేడీఎస్ నేత దేవేగౌడ, నాగాలాండ్ గవర్నర్, రాష్ట్ర సీఎంతోనూ మాట్లాడారు. తిరుగుబాటు సంస్థలు... నాగా నేషనల్ కౌన్సిల్: 1940-1950కాలంలో రాజకీయరంగంలో ఉంది. నాగా నేషనల్ కౌన్సిల్(అడినో): తొలి నాగా రాజకీయ సంస్థ. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఇసాక్-ముయివా): 1980 జనవరి 31న ఏర్పాటైంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఖప్లాంగ్): మయన్మార్, భారత్‌లోని కొన్ని ప్రాంతాలను కలపాలటూ 1988లో ఏర్పాటైంది. నాగా ఫెడరల్ గవర్నమెంట్: 1970లలో సాగిన వేర్పాటువాద ఉద్యమం నాగా ఫెడరల్ ఆర్మీ: 1970లలో పనిచేసిన వేర్పాటువాద గెరిల్లా సంస్థ. -
విభజించి పాలించడం వల్లే ఈ సమస్య: మోదీ
-
విభజించి పాలించడం వల్లే ఈ సమస్య: మోదీ
బ్రిటిష్ పాలకులు అవలంబించిన 'విభజించి పాలించు' అనే విధానమే నాగాలాండ్‌లో సమస్యకు ప్రధాన కారణంగా నిలిచిందని, ఈశాన్యా రాష్ట్రాల శాంతిభద్రతలు, అక్కడి అభివృద్ధి తన ఎజెండాలో అత్యంత ప్రధానమని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నాగాలతో అత్యంత కీలకమైన శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన తన అధికారిక నివాసమైన నెం.7 రేస్‌కోర్సు రోడ్డులో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఈ చారిత్రక సందర్భంలో వచ్చినవారందరికీ అభినందనలు అనారోగ్యం కారణంగా ఐసెక్ స్వు ఈ కార్యక్రమానికి రాలేకపోవడం దురదృష్టకరం నాగా రాజకీయ సమస్య దాదాపు 6 దశాబ్దాల పాటు ఇబ్బందిపెట్టింది దీంతో కొన్ని తరాల ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు ఐసెక్ సు, ముయివా లాంటివాళ్లు సహకరించడం వల్లే ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది ఎన్ఎస్సీఎన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించింది. అందుకు కృతజ్ఞతలు నేను నాగాలాండ్‌కు చాలాసార్లు వెళ్లాను. వాళ్లు చాలా అద్భుతమైన మానవత్వం చూపించారు బ్రిటిష్ పాలకుల కారణంగానే నాగా ప్రజలు ఇన్నాళ్లుగా దేశానికి దూరంగా ఉన్నారు వాళ్లు కావాలనే నాగాల గురించి భారతదేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లకు చెడుగా చెప్పారు వాళ్ల విభజించి పాలించే లక్షణమే ఇలా చేసింది మహాత్మా గాంధీ లాంటి చాలామంది నాగాలను ప్రేమించారు, వాళ్ల సెంటిమెంట్లను గౌరవించారు ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి చాలాకాలం పాటు అసలు జరగలేదు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి నా ప్రాధాన్యాల్లో ముందున్నాయి నాగా నాయకులతో చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాను వాళ్ల ఆలోచనలు, సెంటిమెంట్లను గౌరవిస్తూ.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా ముందుంటామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా.