Trinamoool Congress
-
మిథున్ చక్రవర్తికి మెంటల్.. టీఎంసీ కౌంటర్..
కోల్‌కతా: బెంగాల్లో మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది టీఎంసీ. ఆయనకు బహుశా మెంటల్ అయి ఉండవచ్చని మండిపడింది. టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఈమేరకు స్పందించారు. 'మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారని విన్నాము. బహుశా ఆయనకు శారీరక సమస్య కాదు మానసిక సమస్య అయి ఉంటుంది. ఆయన చెప్పే మాటలను బెంగాల్లో ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అదే సమస్య' అని శాంతను సేన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. #WATCH | I heard that Mithun Chakraborty was admitted to a hospital a few days back. I think he was mentally ill & not physically... The problem is that he does not know politics: TMC MP Santanu Sen on Mithun Chakraborty's remarks pic.twitter.com/5FUKkM7RIQ — ANI (@ANI) July 27, 2022 అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మిథున్ చక్రవర్తి. మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత టీఎంసీలో తుఫాన్ మొదలైందని, ఆ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. బెంగాల్లో కూడా మహారాష్ట్ర పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. చదవండి: మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు! -
అమిత్ షా ర్యాలీపై ఆగని రగడ
మాల్ధా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీపై నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. మాల్దా ఎయిర్పోర్ట్ హెలిప్యాడ్‌లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ తృణమూల్ సర్కార్‌పై విరుచుకుపడింది. షా విమానం ల్యాండయ్యేందుకు ఇక్కడి గోల్డెన్ పార్క్ హోటల్‌తో పాటు మాల్ధా జిల్లాలో బీఎస్ఎఫ్ ఉపయోగించే హెలిప్యాడ్‌లో అనుమతించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. హెలిప్యాడ్ సమస్య పరిష్కారం కావడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకుంటే తాజాగా ర్యాలీ నేపథ్యంలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం కొత్త తలనొప్పిగా మారింది. తమ పార్టీ చీఫ్ రాకను పురస్కరించుకుని తాము ఏర్పాటు చేసిన కటౌట్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లను పలు చోట్ల తృణమూల్ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారని బీజేపీ బెంగాల్ రాష్ట్ర శాఖ చీఫ్ దిలీప్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీకి హాజరయ్యేందుకు వాహనాల్లో వస్తున్న పార్టీ కార్యకర్తలను తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. తృణమూల్ ఆగడాలను ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీకి హాజరవుతున్నారని ఘోష్ చెప్పారు. -
ఈడీ అధికారిపై తృణమూల్ కార్యకర్తల దాడి
కోల్‌కతా: శారదా ఛిట్ ఫండ్ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. హుగ్లీలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ స్థాయి అధికారిపై 8 నుంచి 9 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. హుగ్లీ మార్కెట్ లో సరుకులు కొనేందుకు వెళ్లిన అధికారిపై ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై కోల్‌కతాలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించింది. తమ అధికారిపై దాడి గురించి మంగళవారం పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఈడీ ఫిర్యాదు చేయనుంది. బాధిత అధికారికి రక్షణ కల్పించాలని కోరనుంది.