ఈడీ అధికారిపై తృణమూల్ కార్యకర్తల దాడి | ED officer probing Saradha case allegedly beaten up in Hooghly | Sakshi
Sakshi News home page

ఈడీ అధికారిపై తృణమూల్ కార్యకర్తల దాడి

Published Mon, Dec 15 2014 10:44 PM | Last Updated on Thu, Sep 27 2018 5:09 PM

ED officer probing Saradha case allegedly beaten up in Hooghly

కోల్కతా: శారదా ఛిట్ ఫండ్ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. హుగ్లీలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ స్థాయి అధికారిపై 8 నుంచి 9 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. హుగ్లీ మార్కెట్ లో సరుకులు కొనేందుకు వెళ్లిన అధికారిపై ఈ దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనను ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై కోల్కతాలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించింది. తమ అధికారిపై దాడి గురించి మంగళవారం పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఈడీ ఫిర్యాదు చేయనుంది. బాధిత అధికారికి రక్షణ కల్పించాలని కోరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement