
మాల్ధా : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీపై నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. మాల్దా ఎయిర్‌పోర్ట్ హెలిప్యాడ్‌లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ తృణమూల్ సర్కార్‌పై విరుచుకుపడింది. షా విమానం ల్యాండయ్యేందుకు ఇక్కడి గోల్డెన్ పార్క్ హోటల్‌తో పాటు మాల్ధా జిల్లాలో బీఎస్‌ఎఫ్ ఉపయోగించే హెలిప్యాడ్‌లో అనుమతించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.
హెలిప్యాడ్ సమస్య పరిష్కారం కావడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకుంటే తాజాగా ర్యాలీ నేపథ్యంలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం కొత్త తలనొప్పిగా మారింది. తమ పార్టీ చీఫ్ రాకను పురస్కరించుకుని తాము ఏర్పాటు చేసిన కటౌట్లు, హోర్డింగ్‌లు, పోస్టర్‌లను పలు చోట్ల తృణమూల్ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారని బీజేపీ బెంగాల్ రాష్ట్ర శాఖ చీఫ్ దిలీప్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ర్యాలీకి హాజరయ్యేందుకు వాహనాల్లో వస్తున్న పార్టీ కార్యకర్తలను తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. తృణమూల్ ఆగడాలను ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీకి హాజరవుతున్నారని ఘోష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment