Criminal defamation case
-
2017 పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
ముంబై: ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థకు(ఆర్ఎస్ఎస్కు) సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబే హైకోర్టు తలుపు తట్టారు. గౌరీ లంకేశ్ హత్య నేపథ్యంలో 2017లో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ మేరకు 2019లో బోరివరి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు తనను తప్పుగా ఈ కేసులో నిందితుడిగా చేర్చారని తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా గౌరీ లంకేష్ హత్య తర్వాత సీతారాం ఏచూరి వేరే చోట, వేరే సమయంలో ప్రకటన చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. కాగా, గౌరీ లంకేష్ 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ముందే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మతపరమైన విమర్శలు చేస్తున్నారనే భావనతో గౌరీ లంకేష్‌ను హిందూ అతివాద భావజాలం ఉన్న కొందరు కాల్చి చంపారు. ఈ హత్యలు జరిగిన 24 గంటల్లోనే రాహుల్ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారెవరిపై ఒత్తిడి చేస్తారని, దాడులు జరిపి చంపేస్తారని ఆరోపించారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులే జర్నలిస్టును హత్య చేశారని ఏచూరి ఆరోపించారు. గౌరీ లంకేష్ హత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముడిపెట్టారని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది ధృతిమాన్ జోషి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీతారాం ఏచూరిపై ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ప్రజల దృష్టిలో ఆర్ఎస్ఎస్ పరువును తగ్గించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2019 ఫిబ్రవరి 18న మజ్గావ్ జిల్లా కోర్టు గాంధీతోపాటు ఏచూరికి సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ 2019 జూలై 4న కోర్టుకు హాజరై బెయిల్ కోసం ప్రయత్నించారు. మరుసటి రోజే సీతారాం ఏచూరి వేర్వేరు ప్రదేశాలు, సమయాల్లో చేసిన వ్యాఖ్యలని చెబుతూ, దీనిపైఉమ్మడి విచారణ జరగడం సరికాదని అన్నారు. తనపై నమోదైన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నవంబర్ 23, 2019న మేజిస్ట్రేట్ రాహుల్, ఏచూరీ పిటిషన్లను తోసిపుచ్చింది. వ్యక్తులు వేరైనా చేసిన ప్రకటనలు ఒకటేనని, నిందితుల ఉద్ధేశం ఆర్ఎస్ఎస్ను కించపరడమేనని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూనే నేడు కాంగ్రెస్ నేత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్
సాక్షి, విజయవాడ: వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. వలంటీర్ పిటీషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. పవన్ కేసు ఫైల్ చేసిన వలంటీర్ స్టేట్మెంట్ను శుక్రవారం.. జడ్జి రికార్డు చేశారు. వలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైయానని, న్యాయం చేయాలని మహిళా వలంటీర్ కోర్టుని ఆశ్రయించారు. వలంటీర్ తరఫున లాయర్లు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. చదవండి: అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ -
పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంలో కీలక మలుపు
-
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
సంచలన ఎంపీపై పరువునష్టం దావా
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన తొలి ప్రసంగంతోనే యావత దేశం దృష్టిని ఆకర్షించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయ్‌త్రా చిక్కుల్లో పడ్డారు. లోక్‌సభలో తన ప్రసంగంలో సందర్భంగా జీన్యూస్ ఛానల్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆ ఛానల్ చీఫ్ సుధీర్ చౌదరీ ఆమెపై పరువునష్టం దావా కేసు వేశారు. సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తమ సంస్థను ప్రస్తావిస్తూ.. దొంగ (చోర్), పెయిడ్ న్యూస్ ఛానల్ (అమ్ముడుపోయిన వార్త సంస్థ) అన్నారని జీ న్యూస్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ మేరకు పటియాలా హౌస్ కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేశారు. దీనిపై సంస్థ తరఫున న్యాయవాది విజయ్ అగర్వాల్ మాట్లాడతూ... జీ న్యూస్ సంస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై క్రిమిల్ పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించారు. తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా సంస్థ యజమానిని దొంగ అన్నారని, దీంతో మహువా మొయ్‌త్రాపై కేసు వేసినట్లు తెలిపారు. కాగా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన మొయ్‌త్రా.. మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. -
#మీటూ: 97మంది లాయర్లా..!
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలుఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ న్యాయపోరాటంలో న్యాయవాదుల సంఖ్య తెలిస్తే నోరు వెళ్లబెట్టక తప్పదు. ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా 97మంది న్యాయవాదులు ఈ జాబితాలో ఉన్నారు. జర్నలిస్టు ప్రియా రమణి లైంగిక ఆరోపణల నేపపధ్యంలో ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావాను 97మంది న్యాయవాదులు వాదించనున్నారు. ప్రముఖ సంస్థ కరంజావాలాకు చెందిన లాయర్లు ప్రియా రమణికి వ్యతిరేకంగా వాదించనున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై నేరపూరిత ఆరోపణ కేసును సోమవారం నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
#మీటూ : జర్నలిస్టుపై పరువునష్టం కేసు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ లో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తదుపరి చర్యలకుపక్రమించారు. ఆరోపణలు అన్నీ అవాస్తవమని కొట్టి పారేసిన ఆయన తాజాగా జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారని చేశారంటూ క్రిమినల్ డిఫమేషన్ నమోదు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సోమవారం ఆయన ఈ కేసు దాఖలు చేశారు. సుదీర్ఘమైన, విలువైన తన కరియర్‌ను నాశనం చేసేందుకే ప్రియా రమణి తనపై తప్పుడు, హానికరమైన ఆరోపణలు చేశారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. విదేశీ పర్యటనముగించుకొని స్వదేశానికి చేరుకున్న కేంద్రమంత్రి తనపై వచ్చిన ఆరోపణలపై ఆదివారం స్పందించారు. జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఈయన తోసిపుచ్చారు. రాజకీయ కారణాలతో తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేస్తున్నవారు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ ఆయన చేశారు. లేదంటే తనపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు విప్పకపోవడంపై మండిపడుతోంది. కాగా ఎంజే అక్బర్ ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ లాంటి ప్రముఖ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. సంపాదకుడుగా ఉన్నప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ విదేశీ మహిళా జర్నలిస్టులతో సహా పలువురు మహిళా పాత్రికేయులు 'మి టూ' ఉద్యమంలో భాగంగా ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా జర్నలిస్టు ప్రియా రమణి తొలిసారిగా ట్విటర్ వేదికగా ఎంజే అక్బర్‌పై ఆరోపణలు చేసిన సంగతి విషయం తెలిసిందే. ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన 14మంది : ప్రియ రమణి, షుమా రాహా, ప్రేరణ సింగ్, కనికా గెహ్లాట్, సుపర్ణ శర్మ, హరీందర్ బవేజ, సబా నక్వి, షుతప పాల్, గజలా వహాబ్, అంజు భారతి, కాదంబరి వాడే, రూత్ డేవిడ్, మాలిని భూప్తా , మాజైల్ డి పే కంప్. -
కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఊరట కలిగింది. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు లభించింది. ఆయన తరుపున న్యాయవాది హాజరయ్యేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. 2013లో ఓ పత్రికా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నాటి టెలికం మంత్రి కపిల్ సిబల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సిబల్ కుమారుడు అమిత్ సిబల్ నేర పూరిత పరువు నష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించి ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉందని కింది స్థాయి కోర్టు ఆదేశించగా తాను ముఖ్యమంత్రిగా పలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని, తన తరుపున వేరేవారి హాజరుకు అనుమతిస్తూ తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు కేజ్రీవాల్ అభ్యర్థనను ఆమోదించింది. అయితే, కేజ్రీవాల్ హాజరుకాకుంటే కేసు ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే మాత్రం హాజరుకావాలంటూ ఆదేశించే హక్కు మాత్రం కింది కోర్టుకు ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట కలిగింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఆయనకు ఢిల్లీ కిందిస్థాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురు ఆప్ నేతలకు కూడా గురువారం బెయిలిచ్చింది. తన పరువుకు నష్టం కలిగేలా అవాస్తవాలతో కూడిన ప్రకటనలను సీఎం కేజ్రీవాల్ ఆయన పార్టీ నేతలు విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్పేయ్లపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి వారిని ఈ రోజు(ఏప్రిల్ 7న) కోర్టుకు హాజరుకావాల్సిందిగా కిందిస్థాయి కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే వారికి బెయిల్ మంజూరు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌కు పార్టీ సలహాదారు,ఎమ్మెల్యే గోపాల్ మోహన్ జామీనుగా ఉండగా ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ అశుతోష్‌కు నరేశ్ బాల్యాన్ సంజయ్ సింగ్ కు, నితిన్ త్యాగి కుమార్ విశ్వాస్‌కు జామీన్లుఆ ఉన్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల పూచికత్తు కోర్టుకు సమర్పించారు. ఈ కేసు విచారణ సందర్బంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా కోర్టుకు హాజరయ్యారు. -
పరువు నష్టం కేసుల్లో కేజ్రీవాల్‌కు ఊరట
- సమాధానం ఇవ్వాల్సిందిగా - కేంద్ర న్యాయశాఖకు నోటీసు - జారీ చేసిన సుప్రీం - అంతవరకూ రెండు కేసులపై - విచారణ నిలిపేయాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయనపై ఢిల్లీలోని ట్రయల్ కోర్టుల్లో దాఖలైన రెండు క్రిమినల్ పరువు నష్టం కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే పరువు నష్టాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్ట్టాల రాజ్యాంగ బద్దతను సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖకు నోటీసు జారీ చేసింది. సమాధానం వచ్చేంతవరకూ కేజ్రీవాల్‌పై దిగువ న్యాయస్థానంలో దాఖలైన రెండు నేరపూర్వక పరువు నష్టం కేసులపై విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్‌కు తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ పరువు నష్టం కేసులపై తదుపరి విచారణ జులై 8న జరుగనుంది. కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌ను, ఇదే విషయమై బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పెండింగ్ పిటిషన్ విచారణతో జోడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కే జ్రీవాల్పై దాఖలైన పరువు నష్టం కేసుల్లో ఒకటి గడ్కరీ కేసిన పరువు నష్టం పిటిషన్ కాగా మరొకటి సురేందర్‌కుమార్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్. గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాలా హౌజ్ కోర్టు విచారణ జరుపుతోంది. తనను అత్యంత అవినీతిపరుడైన నేతగా ఆరోపణలు చేయడాన్ని సవాలుచేస్తూ గడ్కరీ కేజ్రీవాల్‌పైనా, ఆయన సహచరులపైనా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని ఆశ చూపి ఆ తరువాత తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాక అవినీతిపరుడినంటూ తనపై అభాండాలు మోపారని ఆరోపిస్తూ న్యాయవాది సురేందర్ శర్మ సీఎం కేజ్రీవాల్‌పైనా, ఆప్ నేతలపైనా పరువు నష్టం దావా వేశారు. అ కేసు కడ్కడూమా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది.