patiyala house court
-
నిర్భయ దోషులను ఎప్పుడో చంపేశారు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్ న్యాయ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను మార్చి 20న ఉరితీయాలంటూ పటియాల హౌస్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డెత్వారెంట్ల జారీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దోషులకు నాలుగు సార్లు డెత్వారెంట్ల జారీచేసి, వారిని నాలుగు సార్లు చంపేశారు. వారేమీ ఉగ్రవాదులు కాదు. భయంకరమైన నేరస్తులుగా చిత్రీకరించి మీడియా వారిని ఎప్పూడో చంపేసింది’ అని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను న్యాయవ్యవస్థ చేసిన హత్యగా ఆయన వర్ణించారు. కాగా ఢిల్లీ నడిబొడ్డున ఘోరమైన ఘటనకు పాల్పడిన నలుగురు దోషులను ఉరిశిక్ష నుంచి కాపాడుతున్న దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పేరు ఇటీవల సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. (వారి చావును చూడాలనుంది) నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా అన్నారు.కాగా దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అంశాలు దాదాపు మూసుకుపోయాయి. నలుగురు దోషుల రివ్యూ పిటిషన్లతో పాటు క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా దాఖలు చేయడం, తిరస్కరించడం వంటిని పూర్తి అయ్యాయి. దీంతో మార్చి 20న ఖచ్చితంగా శిక్ష అమలై తీరుతుందని నిర్భయ తరఫు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు) -
వారి చావును చూడాలనుంది : ఆశాదేవి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార దోషులకు పటియాల హౌస్‌కోర్టు తాజాగా డెత్‌వారెంట్లు జారీచేయడంపై ఆమె తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషుల ఉరితీతపై గురువారం విచారణ సందర్భంగా కోర్టు వద్దకు చేరుకున్న ఆమె.. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్‌వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు. ‘నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ఆసన్నమైంది. నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. అదే మాకు పెద్ద విజయం. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. అవకాశం ఉంటే.. వారి చావును నాకు చూడాలని ఉంది’ అని అన్నారు. (నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ) నిజానికి ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉరితీత మూడోసారి వాయిదాపడింది. తాజాగా ట్రయల్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేస్తూ మార్చి 20న ఉరితీయాలని ఆదేశించింది. అయితే దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ
-
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఢిల్లీ పటియాల హౌస్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. తీహార్ జైల్లో దోషులను ఉరితీయానున్నారు. కాగా ఈ విధంగా డెత్‌వారెంట్లు జారీచేయడం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు దోషులను కోర్టులను ఆశ్రయించడంతో ఉరితీత వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో శిక్షను నిలిపివేశారు. -
ఉరి మూడోసారీ?
న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలు మూడోసారి కూడా వాయిదాపడింది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. క్షమాభిక్ష ఒక ముఖ్యమైన రాజ్యాంగబద్ధ అవకాశం అని కోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ నేటి(మార్చి 3) ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. తాజా, ఆదేశాలతో ఆ ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండగా మరణ శిక్ష విధించడం సరికాదని అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రానా స్పష్టం చేశారు. బాధితుల వైపునుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్ప టికీ.. ఏ దోషి అయినా తనకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలనూ వినియోగించుకోకుండా ఆపకూడదని ఆయన పేర్కొన్నారు. క్షమాభిక్ష పిటిషన్ ఒక ముఖ్యమైన చట్టబద్ధ అవకాశం అనీ, అందుకే ఉరిని వాయిదా వేయడానికి తాను సంకోచించడం లేదన్నారు. మరణ శిక్షపై స్టే విధించాలన్న పవన్ గుప్తా చేసుకున్న విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వులో ఉంచిన కోర్టు.. క్యూరేటివ్, మెర్సీ పిటిషన్లను ఆలస్యంగా దాఖలు చేయడంపై దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. జాగ్రత్త’ అని ఆయనపై మండిపడింది. ఎవరైనా తప్పు చేస్తే పరిణామాలెలా ఉంటాయోమీకు తెలుసనే అనుకుంటున్నామని హెచ్చరించింది. విచారణ మంగళవారం కొనసాగుతుందని తెలిపింది. (నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?) కాగా, పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌ని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరణ శిక్షపై స్టే విధించాలని కోరుతూ అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలు దాఖలుచేసుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్ల క్షమాభిక్ష పిటిషన్లను ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరణను సవాల్ చేస్తూ ముకేశ్, వినయ్ కుమార్‌లు విడివిడిగా దాఖలు చేసుకున్న పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు గతంలో కోర్టు తోసిపుచ్చింది. అయితే అక్షయ్ కుమార్ మాత్రం తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకి వెళ్లలేదు. వ్యవస్థ వైఫల్యం: నిర్భయ తల్లి నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష మరోమారు వాయిదాపడడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోందనీ, ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోందనీ ఆమె వ్యాఖ్యానించారు. రోజు రోజుకీ విశ్వాసాన్ని కోల్పోతున్నాననీ, అయినా గట్టిగా నిలబడతాననీ, ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. అయితే కోర్టులు మాత్రం చోద్యం చూస్తూ కూర్చుంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. (నిర్భయ కేసు : మరో కీలక పరిణామం) ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోంది. ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందే. – నిర్భయ తల్లి ఆశాదేవి ఎవరీ ఏపీ సింగ్? నిర్భయ హత్యాచారం కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పదే పదే ఉరిశిక్ష అమలు వాయిదా పడుతుండటంపై ఆప్ నేత మనీశ్ సిసోడియా ‘వ్యవస్థని నవ్వుల పాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. -
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
-
నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. డెత్‌వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాల హౌస్‌కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దోషులను ఉరి తీయవద్దంటూ తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఉరి నిలుపుదల చేయాలని పేర్కొంది. మార్చి 3న (మంగళవారం) నలుగురు దోషులను ఉరితీయాలంటూ ఇదివరకే కోర్టు డెత్‌వారెంట్లు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా శిక్ష అమలుపై స్టే ఇవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. (క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి) గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి3 ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై పటియాల కోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మార్చి 3న దోషులను ఉరి తీయడం దాదాపు ఖరారే అనుకున్నారంతా. ఈ క్రమంలోనే ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. -
నిర్భయ కేసు: డెత్ వారెంట్లు జారీ చేయలేం !
న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేయాలన్న తీహార్ జైలు అధికారుల అభ్యర్థనను ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టు తిరస్కరించింది. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నందుకు డెత్ వారెంట్లు జారీ చేయలేమని తెలిపింది. ప్రతిపాదనల ఆధారంగా డెత్ వారెంట్లు జారీచేయలేమని స్పష్టంచేసింది. (చదవండి : నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి) కాగా, నిర్భయ దోషులు నలుగురూ న్యాయ పరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. దోషులను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 5న ఈ మేరకు తీర్పు వెలువరించింది. (చదవండి : వాళ్లను త్వరలోనే ఉరి తీస్తారు: నిర్భయ తల్లి) -
అందుకే నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే: జడ్జి
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిర్భయ తల్లి, కేంద్రం ప్రభుత్వం సహా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజా పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగానే నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలకు ఉరిశిక్షపై స్టే విధించినట్లు పేర్కొంది. ఈ మేరకు 10 పేజీలతో కూడిన ఆర్డర్ జారీ చేసింది.(నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా) ఒక్కడినే ఎలా ఉరితీస్తారు? నిర్భయ దోషుల ఉరిశిక్ష నిలుపుదల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ధర్మేంద్ర రానా... ‘‘ఈ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేష్(క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను సైతం కొట్టివేసింది)కు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే మిగతా ముగ్గురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మన దేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు. మరణ శిక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ముఖేష్ ఒక్కడినే ఉరి తీయడం సాధ్యం కాదు. జైలు మ్యానువల్‌లోని రూల్ 836 ప్రకారం... ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు దోషులుగా తేలినపుడు... ముఖ్యంగా మరణశిక్ష ఎదుర్కొంటున్నపుడు... ఒక దోషి లేదా ఆ కేసులో మిగిలిన దోషులంతా నేరుగా గానీ.. వారి తరఫున మరెవరైనా గానీ పిటిషన్ దాఖలు చేసినట్లయితే.. ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలు అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజానికి హాల్‌మార్క్ వంటిదని అభివర్ణించారు. (దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి) కాగా 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తా సహా రామ్‌సింగ్(జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు), మరో మైనర్(విడుదలయ్యాడు).. పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. బాధితురాలి వాంగ్మూలం మేరకు వారిని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టగా.. అనేక వాయిదాల అనంతరం సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో నలుగురు దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసింది. అయితే ముఖేష్ సింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను క్షమాభిక్ష కోరడం.. ఆయన దానిని తిరస్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలంటూ మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి దోషులు ఒక్కొక్కరుగా క్యూరేటివ్ పిటిషన్లు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో మరోసారి ఉరిశిక్ష వాయిదా పడింది. (నిర్భయ దోషుల ఉరిపై స్టే.. కేంద్రం ఆగ్రహం..!) -
దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి
-
నిర్భయ దోషుల ఉరిపై స్టే.. కేంద్రం ఆగ్రహం..!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదాపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాన్ని అపహాస్యం చేసేలా దోషులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేసింది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చట్టంలోని లొసుగులకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ మేరకు దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు స్టే విధించడంపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భారత చట్టాలపై పార్లమెంట్ వేదికగా సుదీర్ఘమైన చర్చజరగాలని, దేశ అత్యున్నత న్యాయస్థానం దోషులుగా తేల్చినా.. శిక్ష అమలులో ఇంత ఆలస్యం జరగమేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. (నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా) శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా దోషులు ఉరిశిక్షను ఆలస్యం చేస్తూ.. చట్టాలను అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. శిక్ష పడిన వెంటనే దానిని అమలు చేసేలా సుప్రీంకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని కిషన్ రెడ్డి కోరారు. కాగా కాలంచెల్లిన సీఆర్పీసీ, ఐపీసీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కాలానికి అనుగుణంగా మార్పులు చేయాలని ఇప్పటికే ఆయన పలుమార్లు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృషి సారిస్తోందని, పార్లమెంట్ సాక్షిగా ఆయా చట్టాలపై చర్చ జరగాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు నోటీసులు పంపింది. మరోసారి డెత్‌వారెంట్లు జారీచేసే వరకు ఉరి శిక్షను వాయిదా వేయాలని కోరింది. -
దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లకు శనివారం అమలు జరగాల్సిన మరణ శిక్షను నిలుపుదల చేస్తూ పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో... కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని తనను సవాలు చేశాడని పేర్కొన్నాడు. అయితే తాను మాత్రం తన కూతురికి న్యాయం జరిగేంత వరకు.. దోషులను ఉరి తీసేంత వరకు పోరాటం ఆపబోనని స్పష్టం చేశానని తెలిపారు.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..) ఎందుకు ఆశలు కల్పించారు? కోర్టు ప్రాంగణంలో ఆశాదేవి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం.. ప్రతీ ఒక్కరూ వినండి. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు నేరస్తుల ముందు తలవంచుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే వేచి చూస్తున్నాను. ఒకవేళ న్యాయస్థానం వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తే మమ్మల్ని ఇన్ని గంటలు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టినట్లు? మాకు ఎందుకు ఆశలు కల్పించినట్లు. మమ్మల్ని అప్పుడే ఇంటికి పంపివేయాల్సింది కదా. ఏడేళ్లుగా మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏదేమైనా నా పోరాటం ఆగదు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. (నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా) ఇక నిర్భయ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో వినయ్ శర్మ మినహా మిగతా ముగ్గురిని శనివారం ఉరితీస్తామని భావించామని.. అయితే కోర్టు ఆదేశాలతో మరోసారి నిరాశకు గురయ్యామన్నారు. దోషులకు శిక్ష అమలయ్యేంత వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. దోషుల హక్కుల గురించి మాట్లాడుతున్న వారు.. బాధితుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.(నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్) ఒకేసారి కాదు.. ఒక్కొక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని ఆరోజే నా కూతురికి న్యాయం.. -
'నిర్భయ దోషికి స్లో పాయిజన్ ఇస్తున్నారు'
న్యూఢిల్లీ: ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా వినయ్ శర్మకు జైలు అధికారులు స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆయన తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. తన క్లయింటును ఆసుపత్రిలో చేర్పించారని ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. పైగా వినయ్ శర్మకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందజేయడం లేదన్నారు. శనివారం ఆయన ఈ మేరకు కోర్టుకు దరఖాస్తును అందజేశారు. కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..! దోషులు ఉరి తప్పించుకునేందుకు తప్పుడు పిటిషన్లు వేస్తున్నారని.. వారికి సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చామని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి వినయ్ శర్మ లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేశారు. దీంతో ఉరి నుంచి తప్పించుకునేందుకు మెల్లమెల్లగా దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పటికే క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరించగా ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు! -
తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని
న్యూఢిల్లీ: ‘ఏడేళ్లుగా.. రక్తపు కన్నీరు కారుస్తూ న్యాయ పోరాటం చేశాను’ అని నిర్భయ తల్లి అన్నారు. తమ కూతురిని అత్యంత పాశవికంగా హతమార్చిన మృగాళ్లను ఎలా క్షమించగలనని.. వారికి శిక్ష పడాల్సిందేనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైన విషయం తెలిసిందే. ఈ అమానుష ఘటనలో దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే డెత్ వారెంట్ ప్రకటనకు ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. తన బిడ్డపై కరుణ చూపాలని న్యాయమూర్తిని ఆమె కోరింది. అనంతరం నిర్భయ తల్లి వద్దకు వెళ్లి తన కొడుకుపై దయ చూపాలని అభ్యర్థించింది. అయితే ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..) ఈ విషయం గురించి నిర్భయ తల్లి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏడేళ్ల క్రితం మా కూతురిని కోల్పోయాం. రక్తపు మడుగులో మునిగిన తన శరీరాన్ని చూశా. తన శరీరంపై ఉన్న గాయాలు.. తనపై క్రూర మృగాలు దాడి చేశాయా అన్నట్లు ఉన్నాయి. ఆనాటి నుంచి నా కళ్ల నుంచి రక్తం కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ... దయ చూపమని అర్థించడం నాపై ఎటువంటి ప్రభావం చూపదు. ఏడేళ్లుగా ఏడ్చీ ఏడ్చీ నేనొక బండరాయిలా మారాను. అత్యంత దారుణ పరిస్థితుల్లో నా కూతురు కొట్టుమిట్టాడటం కళ్లారా చూశాను. రోజూ చస్తూ.. బతుకుతున్నాను. అందుకే నాకు ఎలాంటి భావోద్వేగాలు ఉండవు’ అని తన మానసిక వేదన గురించి చెప్పుకొచ్చారు. (‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’) ఇక నిర్భయ తండ్రి మాట్లాడుతూ...తన కూతురి జీవితం నాశనం చేసి.. ఆమెను బలి తీసుకున్న మృగాళ్లపై ఎవరూ కనికరం చూపరని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను ఉరి తీయడం ద్వారా నేరగాళ్లకు చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే సందేశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. కూతురు లేని జీవితం తమకు నరకప్రాయమని.. బతికి ఉన్నంతకాలం ఈ విషాదం తమను వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. (నిర్భయ దోషులకు 22న ఉరి.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు) కాగా 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి కదులుతున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారం జరిపారు. నిర్భయ, ఆమె స్నేహితుడిని ఇనుప రాడ్లతో చితకబాదారు. సింగపూర్ మౌంట్ ఎలిజెబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ డిసెంబర్ 29న కన్నుమూసింది. ఆరుగురిలో ఒకడైన ప్రధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ను దోషిగా జువైనల్ బోర్డు తేల్చింది. అతడిని జువనైల్ హోమ్‌కు తరలించారు. ఈ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. దోషులు వీరే.. ముఖేష్ సింగ్: తీహార్ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తమ్ముడే ముఖేష్ సింగ్ (32). దక్షిణ ఢిల్లీలోని రవిదాస్ మురికివాడల్లో సోదరుడితో కలసి నివసించేవాడు అప్పుడప్పుడు తానే ఆ బస్సుని నడిపించేవాడు. క్లీనర్‌గా చేసేవాడు. ఘటన రోజు ముఖేశ్ బస్సు నడిపాడు. అత్యాచారం చేశాక నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. వినయ్ శర్మ: వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిటినెస్ ట్రైనర్. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు. అక్షయ్ కుమార్ ఠాకూర్: అక్షయ్ ఠాకూర్ (31) బిహార్ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్ డ్రాపవుట్ అయిన అక్షయ్ 2011లో బిహార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత అక్షయ్‌ని బిహార్‌లో అరెస్ట్ చేశారు. పవన్ గుప్తా: పవన్ గుప్తా (25) పండ్ల వ్యాపారి. డిసెంబర్ 16 మధ్యాహ్నం మద్యం సేవించి బయటకు వెళ్లాడు. అరెస్ట్ చేసిన తర్వాత పవన్ తాను చాలా దుర్మార్గానికి పాల్పడ్డానని, తనకి ఉరి శిక్షే సరైనదని కోర్టులో చెప్పుకున్నాడు. -
నిర్భయ దోషులకు ఉరి
-
నిర్భయ దోషులకు 22న ఉరి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్‌ను చదివి వినిపించారు. దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు, ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు లాయర్ దోషులు పెట్టుకున్న పిటిషన్లేవీ న్యాయస్థానాల్లో లేదా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. అలాగే వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించినప్పుడు క్షమాభిక్ష పిటిషన్లు ఏమైనా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయా తెలియజెప్పాలంటూ తీహార్ జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. అలాంటి పిటిషన్లు పెండింగ్‌లో ఏవీ లేవని తేలడంతో కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. కోర్టు హాలులో భావోద్వేగ దృశ్యాలు... డెత్ వారెంట్ ప్రకటించడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ రావడంతో కాసేపు కలకలం రేగింది. తన బిడ్డపై కరుణ చూపాలని న్యాయమూర్తిని ఆమె కోరింది. అయితే ఆమెను బయటకు పంపాలని ఆదేశించిన న్యాయమూర్తి... ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న నలుగురు దోషులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధుల్ని కూడా అనుమతించలేదు. ఆ తర్వాత న్యాయమూర్తి డెత్ వారెంట్లను చదివి వినిపించారు. కోర్టు ఆదేశాలు తెలియగానే ముఖేష్ తల్లి కన్నీరు పెట్టుకుంది. నిర్భయ తల్లి దగ్గరకు వెళ్లి తన బిడ్డను క్షమించాలంటూ వేడుకుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము నిరుపేదలం కావడం వల్లే ఈ నేరంలో తన బిడ్డను ఇరికించారని ఆరోపించింది. జైలు నంబర్–3లో ఉరి అమలు... నిర్భయ దోషులకు కోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైలు గది నంబర్–3లో ఉరితీస్తామని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. డెత్ వారెంట్లు జారీ కాగానే అధికారులు ఈ ప్రకటన చేశారు. నలుగురు దోషుల్లో ముగ్గురు జైలు నెంబర్ 2లో, ఒకరు జైలు నెంబర్ 4లో ఉన్నట్లు తెలిపారు. ఉరి శిక్ష అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలుకు చెందిన తలారిని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. దోషులందరినీ ఒకేసారి ఉరి తీస్తామన్నారు. ‘ఉరితీత రోజు వరకు దోషులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో మా వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈలోగా వారి భద్రత గురించి కూడా మేం తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఉరి అమలులోగా దోషులను వారి కుటుంబ సభ్యులు కలిసి వెళ్లొచ్చు’ అని జైలు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ కోర్టు తీర్పుపై పట్నాలో స్వీట్లు పంచి, హర్షం వ్యక్తం చేస్తున్న యువతులు న్యాయం జరిగింది: నిర్భయ తల్లిదండ్రులు న్యాయం కోసం నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల పోరాటానికి తెరపడింది. డెత్ వారెంట్లు జారీ కాగానే ఉద్వేగం పట్టలేక నిర్భయ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. తాజా తీర్పు చట్టంపై మహిళల నమ్మకాన్ని తిరిగి నిలబెడుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి కదులుతున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారం జరిపారు. నిర్భయ, ఆమె స్నేహితుడిని ఇనుప రాడ్లతో చితకబాదారు. సింగపూర్ మౌంట్ ఎలిజెబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ డిసెంబర్ 29న కన్నుమూసింది. ఆరుగురిలో ఒకడైన ప్రధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ను దోషిగా జువైనల్ బోర్డు తేల్చింది. అతడిని జువనైల్ హోమ్‌కు తరలించారు. ఈ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. మరోవైపు, ఆలస్యంగానైనా నిర్భయకు న్యాయం జరిగిందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. -
సంచలన ఎంపీపై పరువునష్టం దావా
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన తొలి ప్రసంగంతోనే యావత దేశం దృష్టిని ఆకర్షించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయ్‌త్రా చిక్కుల్లో పడ్డారు. లోక్‌సభలో తన ప్రసంగంలో సందర్భంగా జీన్యూస్ ఛానల్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆ ఛానల్ చీఫ్ సుధీర్ చౌదరీ ఆమెపై పరువునష్టం దావా కేసు వేశారు. సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తమ సంస్థను ప్రస్తావిస్తూ.. దొంగ (చోర్), పెయిడ్ న్యూస్ ఛానల్ (అమ్ముడుపోయిన వార్త సంస్థ) అన్నారని జీ న్యూస్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఈ మేరకు పటియాలా హౌస్ కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేశారు. దీనిపై సంస్థ తరఫున న్యాయవాది విజయ్ అగర్వాల్ మాట్లాడతూ... జీ న్యూస్ సంస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై క్రిమిల్ పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించారు. తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా సంస్థ యజమానిని దొంగ అన్నారని, దీంతో మహువా మొయ్‌త్రాపై కేసు వేసినట్లు తెలిపారు. కాగా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన మొయ్‌త్రా.. మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం!
ముప్ఫయ్నాలుగేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో పట్టపగలు ఉన్మాదంతో మూకలు చెలరేగి సాగించిన హత్యాకాండలో మొట్టమొదటిసారి ఒకరికి ఉరిశిక్ష పడింది. 1984 మొదలుకొని ఇన్నేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారికి సుదీర్ఘకాలం తర్వాత దక్కిన తొలి విజయమిది. దక్షిణ ఢిల్లీలోని మహీపాల్పూర్లో 1984 నవంబర్ 1న ఇద్దరు సిక్కు యువకులను పొట్టనబెట్టుకున్న నేరగాడు యశ్‌పాల్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించగా, మరో నేరగాడు నరేష్ షెరావత్కు యావజ్జీవ శిక్ష విధించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు అంగరక్షకులు హతమార్చారని తెలియగానే ఢిల్లీలోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉన్మాదులు వీరంగం వేశారు. విచ్చుకత్తులు, పెట్రోల్ డబ్బాలు, ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. మగవాళ్ల ప్రాణాలు తీశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు ఒడిగట్టి చంపేశారు. ఇల్లిల్లూ దోచుకున్నారు. ఈ దాడులు ఏవో చెదురుమదురుగా, ఆవేశంలో జరిగినవి కాదు. కొందరు కాంగ్రెస్ నాయకులు బస్తీల్లో ఉండే లంపెన్ ముఠాలకు డబ్బు, మద్యం సరఫరా చేసి ఒక పథకం ప్రకారం వీటిని నడిపించారు. అధికారం చేతుల్లో ఉంది గనుక ఎవరూ ఏమీ చేయలేరని భరోసా ఇచ్చారు. వారి హస్తమే లేకుంటే వరసగా నాలుగురోజులపాటు ఈ మార ణకాండ ఇంత యధేచ్ఛగా సాగేది కాదు. పోలీసులు చేష్టలుడిగి ఉండిపోయేవారు కాదు. కేసుల దర్యాప్తులో ఇంతచేటు జాప్యం చోటుచేసుకునేది కాదు. దశాబ్దాలు గడుస్తున్నా నేరగాళ్లు తప్పిం చుకునేవారు కాదు. అధికారిక గణాంకాల ప్రకారం 3,350 మంది పౌరులు ఈ నరమేథంలో బలైపోయారు. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 2,733మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అన ధికార అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 7,000కు పైనే. దేశం సిగ్గుతో తలవంచుకునేవిధంగా సాగిన ఈ దుర్మార్గం విషయంలో నేరగాళ్లెవరో వెలికితీయడానికి పీయూడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర హక్కుల సంఘాలు పడిన శ్రమ అసాధారణమైనది. ఆ సంఘాల కార్యకర్తలు రాజ ధాని నగరంలో అన్ని ప్రాంతాలకూ వెళ్లి ప్రత్యక్ష సాక్షులను కలిసి వివరాలు సేకరించి చాలా స్వల్ప వ్యవధిలోనే ‘హూ ఆర్ ద గిల్టీ?’ అనే శీర్షికతో సమగ్రమైన నివేదిక విడుదల చేశారు. మారణకాండ వెనకున్న నాయకుల పేర్లతోసహా ఆ నివేదిక అన్నిటినీ బయటపెట్టింది. ఆ సంఘాలు కొన్ని రోజుల్లోనే పూర్తి చేసిన పనిని అధికార యంత్రాంగం ఏళ్లూ పూళ్లూ గడిచినా సక్రమంగా చేయలేకపోయింది. వందల కేసుల్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న సాకుతో మూసి వేశారు. ఇప్పుడు తీర్పు వెలువడిన కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. కేసు నమోదు చేయమంటూ ప్రాధేయపడినా బాధిత కుటుంబాల గోడు పట్టిం చుకున్నవారెవరూ లేరు. ఘటన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత... అంటే 1993లో ఎన్నో ఒత్తిళ్ల తర్వాత, కోర్టు ఆదేశాలు తర్వాత కేసు నమోదు చేశారు. చివరకు ఏడాదిపాటు దర్యాప్తు పేరుతో సాగదీసి సరైన సాక్ష్యాలు లేవని పోలీసులు తేల్చారు. అయితే 2015లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మూసేసిన 293 కేసుల్ని మళ్లీ ఆరా తీసి అందులో 60 కేసుల్లో గట్టి సాక్ష్యాధారాలున్నాయని తేల్చింది. ఆ 60 కేసుల్లోనూ ప్రస్తుత కేసు ఒకటి. మామూలుగా కనబడే మనిషి అధికార ఉన్మాదం ఆవహిస్తే ఎంతటి క్రూర మృగంగా మారగలడో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. నేరగాళ్లు, బాధితులు ఇరుగుపొరుగువారే. బాగా తెలిసినవారే. కానీ ఆరోజు వందలమందితో వచ్చి బాధితులిద్దరినీ పై అంతస్తునుంచి కిందికి తోసి పెట్రోల్ చల్లి, మండే టైర్లు మీదకు విసిరి సజీవదహనం చేశారు. మరణించే ముందు వారు ఆర్తనాదాలు చేస్తుంటే ఈ మూక కేరింతలు కొట్టింది. ఇలాంటి కేసుల్ని పట్టించు కోనట్టయితే, దోషులెవరో కూపీ లాగనట్టయితే ఆ బాధిత కుటుంబాలు మాత్రమే కాదు... మొత్తం సమాజమే ఎంతో నష్టపోతుంది. ఎందుకంటే–ఇక్కడ బలవంతులదే రాజ్యమని, వారికి తోచినదే న్యాయమని సాధారణ పౌరుల్లో నిరాశ అలుముకుంటే వారు తమకు తోచిన పద్ధతుల్లో న్యాయాన్ని వెదుక్కుంటారు. అప్పుడు రాజ్యమేలేది అరాచకమే. సిక్కుల ఊచకోతపై మొదట్లో వేద్మార్వా ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ కొన్నాళ్లకే మూతబడింది. ఆ తర్వాత అప్పుటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో మరో కమిషన్ వచ్చింది. రెండేళ్ల తర్వాత ఈ మారణకాండకు కర్తంటూ ఎవరూ లేరని, ఇదంతా యాదృచ్ఛికంగా మొదలై ఆ తర్వాత గూండాల చేతుల్లోకి పోయిందని ఆ కమిషన్ తేల్చింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో తొమ్మిది విచారణ కమిషన్లు వచ్చాయి. వాటివల్ల బాధిత కుటుంబాలకు ఒరిగిందేమీ లేదు. కొన్నిటిలో హెచ్‌కేఎల్ భగత్, సజ్జన్‌కుమార్, జగదీష్ టైట్లర్, కమలనాథ్ వంటి కొందరి పేర్లు ప్రస్తావనకొచ్చాయి. అయితే క్రియకొచ్చేసరికి జరిగిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఏమైనా చెప్పవచ్చు. కానీ కేంద్రంలో ఎవరున్నా బాధిత సిక్కు కుటుంబాలకు ఒరిగింది శూన్యం. ఆలస్యంగా లభించిన న్యాయం అన్యాయంతో సమానమంటారు. ఇప్పుడు నేరగాళ్లిద్దరికీ శిక్షపడిందిగానీ, ఆప్తులను కోల్పోయిన ఆ కుటుంబాలు ఇన్ని దశాబ్దాలపాటు ఎంత వేదననూ, బాధనూ, కష్టనష్టాల్ని అనుభవించి ఉంటాయో ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఒక అధికారి మంచితనం వల్లనో, ఇంకొక న్యాయమూర్తి చొరవ ప్రదర్శించడం వల్లనో, అధికారంలో ఉన్నవారు తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందనుకుంటేనో మాత్రమే కేసుల్లో కదలిక ఉండే స్థితి మంచిదికాదు. నేరగాళ్లు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా, వారెంత పలుకుబడి కలిగినవారైనా సత్వర చర్యలుండే సమర్ధవంతమైన చట్టబద్ధ వ్యవస్థ నెలకొల్పినప్పుడే మనది నిజమైన ప్రజా తంత్ర రిపబ్లిక్ అనిపించుకుంటుంది. అన్ని పార్టీలూ దీన్ని గుర్తెరగాలి. -
తేజస్వీ, రబ్రీ దేవీలకు బెయిల్
న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శనివారం రబ్రీదేవి, తేజశ్వి యాదవ్‌లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన నిందితులందరికీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిలిచ్చింది. నిందితులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాలేదు. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రయాణాలు చేయడానికి వీల్లేదని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్ల లాలూను కోర్టులో హాజరుపరచలేమని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకు సమ్మతించిన కోర్టు, నవంబర్ 19న జరిగే విచారణకు లాలూ తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పూరీలోని ఐఆర్సీటీసీ హోటళ్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మిసా భారతి, ఆమె భర్తకు ఊరట
పటియాలా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతికి, ఆమె భర్త శైలేశ్ కుమార్‌కు పటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో వీరిద్దరికీ పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం 2 లక్షల రూపాయలను ష్యూరిటీ కింద సమర్పించాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు అనుమతి లేకుండా.. దేశం విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీచేసింది. వీరిద్దరిపై ఈడీ డిసెంబర్లో ఛార్జ్‌షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఛార్జ్‌షీటు నమోదు మేరకు నేడు కోర్టుకు హాజరు కావాలని వీరిద్దరినీ కోర్టు ఆదేశించింది. మిస్ మిశాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ పేరుపై భారతీ, ఆమె భర్త ఢిల్లీలో ఓ ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. 2008-09లో షెల్ కంపెనీల ద్వారా ఆర్జించిన అక్రమ సంపద రూ.1.2 కోట్లతో ఈ కొనుగోలు చేపట్టారు. పలు షెల్ కంపెనీలు భాగమై ఉన్న రూ.8000 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణలో ఈ ఫామ్ హౌస్ కొనుగోలు కూడా ఒకటి. ఫామ్ హౌస్ కొనుగోలపై మిశాను ప్రశ్నిస్తే.. మిశాలి ప్యాకర్స్ కంపెనీతో తనకేమీ సంబంధం లేదని, దాన్ని తన భర్త, సందీప్ శర్మ అనే ఛార్టెడ్ అకౌంటెండ్ కలిసి నిర్వహించే వారని తెలిపింది. శైలేష్ కూడా తాను ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను రోజువారీ సమీక్షించలేదని, ఛార్టెడ్ అకౌంటెంట్ శర్మనే అన్నీ చూసుకునే వారని చెప్పారు. అయితే ఆ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నందుకు మీరే బాధ్యత వహించాలని ఈడీ చెప్పింది. మిసా భారతి, శైలేష్ కుమార్, జైన్ బ్రదర్స్ రూ.1.20 కోట్ల మనీలాండరింగ్‌లో ప్రధాన వ్యక్తులని ఈడీ కోర్టుకు తెలిపింది. -
2జీ స్కామ్ తీర్పు: ఆర్బిట్రేషన్ల వరద?
2జి స్పెక్ట్రమ్ కేసులో మొత్తం 17 మంది నిందితులను ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఆర్బిట్రేషన్ల వరద పోటెత్తునుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెలికాం తప్పుడు విధానాలతో నష్టపోయినందుకుగాను ఆయా కంపెనీలు భారీ ఎత్తున నష్టపరిహారం కోరనున్నారని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా లూప్ టెలికాం, రష్యాకు చెందిన సిస్టెమా, టెలినార్ లాంటి ఆపరేటర్లు తమ వ్యూహాలను మార్చనున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈ విషయంలో దేశీయ ఆపరేటర్ వీడియోకాన్ నష్టాన్ని పూడ్చుకునే పనిలో వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు 2జీ స్కాంపై తాజా తీర్పుతో భారత టెలికాం రంగానికి చెందిన విదేశీ కంపెనీలకు ఇది తలుపులు తెరిచిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసిన 122 లైసెన్సుల రద్దు చేసిన సంస్థలు దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని, వీటిని పునఃప్రారంభించడానికి లేదా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరవచ్చని అశిష్ భాన్ అభిప్రాయపడ్డారు. సిస్టెమా, టెలినార్పై విచారణ జరపలేదు. ఒక వేళ వారు మారిషస్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లయితే .. వారికిది మంచి అవకాశమని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు. అలాగే పటియాల హౌస్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేయాలన్న ఈడీ, సిబిఐ నిర్ణయం ప్రస్తుత పరిస్థితిని పెద్దగా మార్చలేదని చెప్పారు. ఈ కేసులో ఎటువంటి నేరారోపణ లేదని నిరూపించడానికి ప్రత్యేక సిబిఐ కోర్టుకు ఏడు సంవత్సరాలు పట్టింది. ప్రత్యేక సిబిఐ కోర్టు పరిశీలించిన సాక్షాధారాల్లో లొసుగులను హైకోర్టు గుర్తించకపోతే, హైకోర్టు జోక్యం సులభం కాదని బన్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే వీడియోకాన్ ప్రభుత్వాన్నిసవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాంటి తప్పులేకుండానే తాము రూ.25 వేలకోట్లను నష్టపోయామని వాదిస్తోంది. తాజా తీర్పుతో ప్రభుత్వంనుంచి పరిహారాన్ని కోరేందుకు మరింత బలం చేకూరిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2015 లో టెలికాం ట్రిబ్యునల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. రూ.10వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఏడేళ్లు అంటే నాకు అంత ఈజీ కాదు
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం నుంచి నిర్దోషులుగా బయటపడడంపై ప్రధాన నిందితురాలు, డీఎంకే ఎంపీ కనిమొళి సంతోషం వ్యక్తం చేశారు. ఈకేసులో ప్రధాన నిందితులు టెలికాం మాజీ మంత్రి ఏ రాజా, సహా మిగిలిన 19మందికి కేసునుంచి విముక్తి కల్పిస్తూ తీర్పు వెలువడిన వెంటనే ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోపణల వెనుక అందరి కుట్ర దాగి వుందన్నారు. చివరకు న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. ఏ నేరం చేయనిదానికి తాను ఏడేళ్లు ఆరోపణలను, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో 7సంవత్సరాలు క్షోభ అనుభవాల్సి వచ్చిందన్నారు. ఎవరికైనా ఇది చాలా కష్టమనీ, తనకు సంబంధించినంతవరకు ఇది అంత ఈజీ కాదన్నారు. ఈ తీర్పు డీఎంకే వర్గాలకు మంచి ఉత్సాహాన్నిస్తుందని కనిమొళి పేర్కొన్నారు. అలాగే ఆర్కే నగర్ ఉపఎన్నికపై ఈ తీర్పు ప్రభావం పడుతుందా అని ప్రశ్నించినపుడు అలాంటిదేమీ ఉండదని కనిమొళి వ్యాఖ్యానించారు. మరోవైపు అత్యంత సంచలనం రేపిన 2జీ కుంభకోణం కేసులో నిందుతులందరినీ నిర్దోషులుగా ప్రకటించడంతో డీఎంకే శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. సత్యమేయ జయతే ప్లకార్డులతో సందడి చేశాయి. కాగా తగిన ఆధారాలు చూపనందున కేసులో నమోదైన వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు పటియాలా హౌస్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కుంభకోణం జరిగిందనడానికి ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. -
షాకింగ్ తీర్పు: సన్‌టీవీ షేర్లు జూమ్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద 2 జీస్కాం పై తీర్పు వెలువడిన నేపథ్యంలో రియల్టీ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. 2జీ కేసు తీర్పుతో ఈ కేసుతో సంబంధం ఉన్న పలు కౌంటర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి ముఖ్యంగా సన్‌టీవీ షేరు 6శాతం ర్యాలీ అయింది. వీటితోపాటు యూనిటెక్, డీబీ తదితర రియాల్టీ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోని నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ గురువారం పటియాలా షాకింగ్ తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. దీంతో కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఎ.రాజా, కనిమొళిసహా 17 మందిని నిర్దోషులుగా గుర్తిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ సంచలన తీర్పుతో మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా, కనిమొళికి భారీ ఊరట లభించింది. అటు డీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. -
'నా ప్రాణానికి ముప్పు.. జైల్లో పెట్టండి'
న్యూఢిల్లీ: తన ప్రాణానికి ముప్పు పొంచివుందని జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాను తప్పు చేస్తే జైల్లో పెట్టాలని, మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు అడ్డుకట్ట వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన కుమార్ పై న్యాయవాదులు దాడి చేశారు. తనపై దాడి చేసిన లాయర్లను న్యాయస్థానంలో అతడు గుర్తించాడు. దేశ సమగ్రతపై తనకు నమ్మకం ఉందని కుమార్ హిందీలో ఒక ప్రకటన విడుదల చేశాడు. అతడు బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కుమార్ కు కోర్టు మార్చి 2 వరకు కస్టడీ విధించడంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు. పటియాలా కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాత్రి 7 గంటలకు అతడిని జైలుకు తీసుకెళ్లారు. తీహార్ జైల్లో అతడికి 3వ నంబర్ సెల్ కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరామని ట్విటర్ ద్వారా తెలిపారు. పటియాలా కోర్టులో చోటుచేసుకున్న ఘటనలపై మరోసారి నివేదిక కోరానని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.