సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం నుంచి నిర్దోషులుగా బయటపడడంపై ప్రధాన నిందితురాలు, డీఎంకే ఎంపీ కనిమొళి సంతోషం వ్యక్తం చేశారు. ఈకేసులో ప్రధాన నిందితులు టెలికాం మాజీ మంత్రి ఏ రాజా, సహా మిగిలిన 19మందికి కేసునుంచి విముక్తి కల్పిస్తూ తీర్పు వెలువడిన వెంటనే ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోపణల వెనుక అందరి కుట్ర దాగి వుందన్నారు. చివరకు న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. ఏ నేరం చేయనిదానికి తాను ఏడేళ్లు ఆరోపణలను, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని కనిమొళి ఆవేదన వ్యక‍్తం చేశారు. తన జీవితంలో 7సంవత్సరాలు క్షోభ అనుభవాల్సి వచ్చిందన్నారు. ఎవరికైనా ఇది చాలా కష్టమనీ, తనకు సంబంధించినంతవరకు ఇది అంత ఈజీ కాదన్నారు. ఈ తీర్పు డీఎంకే వర్గాలకు మంచి ఉత్సాహాన్నిస్తుందని కనిమొళి పేర్కొన్నారు.
అలాగే ఆర్‌కే నగర్ ఉపఎన్నికపై ఈ తీర్పు ప్రభావం పడుతుందా అని ప్రశ్నించినపుడు అలాంటిదేమీ ఉండదని కనిమొళి వ్యాఖ్యానించారు. మరోవైపు అత్యంత సంచలనం రేపిన 2జీ కుంభకోణం కేసులో నిందుతులందరినీ నిర్దోషులుగా ప్రకటించడంతో డీఎంకే శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. సత్యమేయ జయతే ప్లకార్డులతో సందడి చేశాయి.
కాగా తగిన ఆధారాలు చూపనందున కేసులో నమోదైన వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు పటియాలా హౌస్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కుంభకోణం జరిగిందనడానికి ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment