సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద 2 జీస్కాం పై తీర్పు వెలువడిన నేపథ్యంలో రియల్టీ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. 2జీ కేసు తీర్పుతో ఈ కేసుతో సంబంధం ఉన్న పలు కౌంటర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి ముఖ్యంగా సన్‌టీవీ షేరు 6శాతం ర్యాలీ అయింది. వీటితోపాటు యూనిటెక్, డీబీ తదితర రియాల్టీ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోని నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ గురువారం పటియాలా షాకింగ్ తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. దీంతో కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఎ.రాజా, కనిమొళిసహా 17 మందిని నిర్దోషులుగా గుర్తిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ సంచలన తీర్పుతో మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా, కనిమొళికి భారీ ఊరట లభించింది. అటు డీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment