Sun TV Shares
-
షాకింగ్ తీర్పు: సన్‌టీవీ షేర్లు జూమ్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద 2 జీస్కాం పై తీర్పు వెలువడిన నేపథ్యంలో రియల్టీ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. 2జీ కేసు తీర్పుతో ఈ కేసుతో సంబంధం ఉన్న పలు కౌంటర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి ముఖ్యంగా సన్‌టీవీ షేరు 6శాతం ర్యాలీ అయింది. వీటితోపాటు యూనిటెక్, డీబీ తదితర రియాల్టీ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోని నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ గురువారం పటియాలా షాకింగ్ తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. దీంతో కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఎ.రాజా, కనిమొళిసహా 17 మందిని నిర్దోషులుగా గుర్తిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ సంచలన తీర్పుతో మాజీ టెలికాం మంత్రి ఏ.రాజా, కనిమొళికి భారీ ఊరట లభించింది. అటు డీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. -
అమ్మ దెబ్బకి ఢమాల్
ముంబై : ఎగ్జిట్ పోల్ అంచనాలతో స్టాక్ మార్కెట్లో మెరుపులు సృష్టించిన సన్ టీవీ షేర్లు గురువారం ఢమాల్ మని పడిపోయాయి. తమిళనాడులో అన్నాడిఎంకె విజయం దాదాపు ఖాయం కావడంతో గురువారం నాటి ట్రేడింగ్ లో సన్ టీవీ షేర్లు 10శాతం మేర పతనమయ్యయి.. తమిళనాడులో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ తో అమాంతం దూసుకుపోయిన ఈ షేర్లు, ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో, పెట్టుబడిదారుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. కరుణానిధిపై తమిళ ఒటర్లు కరుణ చూపకపోవడంతో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అమ్మ జయలలిత పార్టీ అన్నాడీంఎకే 141 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో సన్ టీవీ షేర్లు కుదేలవుతున్నాయి. కాగా అన్నాడీఎంకే ప్రత్యర్థి, ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధినే ఈ సారి ఎన్నికల్లో విజయం వరించబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో చెన్నైకు చెందిన ఈ సన్ టీవీ నెట్ వర్క్ షేర్లు జూమ్ అయ్యాయి. డీఎంకే పార్టీ గెలవబోతుందనే సంకేతాలతో సన్ టీవీ షేర్లు గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో జిగేల్ మనిపించాయి. సన్ టీవీ అధినేత కళానిధి మారన్, డీఎంకే అధినేతకరుణానిధికి మనువడు. పార్టీ హవా కొనసాగుతూ రికార్డు తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న అమ్మ దెబ్బకి సన్ టేవీ బేర్ మంది. -
మార్కెట్ లో సన్ టీవీ మెరుపులు
చెన్నై: తమిళనాడులో అధికార పగ్గాలు డీఎంకే కే అన్న ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో సన్ టీవీ షేర్లు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రతిపక్ష డిఎంకెకు సానుకూలంగా రావడంతో మంగళవారం నాటి మార్కెట్ లో సన్ టివి నెట్ వర్క్ లిమిటెడ్ షేర్లు మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. 9.5 శాతానిపై గా లాభంతో 430 రూ. దగ్గర ట్రేడవుతూ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తప్పదని తేలడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు ఈ పేరు జోరును మరింత కొనసాగించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ క్రమంలో 540రూ.లకు షేర్ విలువ చేరితే, 560కి చేరే అవకాశాలున్నాయని. ఈ స్థాయిని కూడా దాటి నిలదొక్కుకొని, కొనుగోళ్ల మద్దతు లభిస్తే మరింత లాభపడే అవకాశం ఉందని తెలిపారు. ఒక వేళ 560 స్థాయి దగ్గర బలంగా లేకపోతే అప్రమత్తంగా ఉండాలని విశ్లేష్లకులు సూచిస్తున్నారు. అధికార పార్టీకి 103 సీట్లు తగ్గుతాయని, డీఎంకె, కాంగ్రెస్ కూటమి 120 సీట్లకు పైగా కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధిపతి కరుణా నిధి (90) సీఎం పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. మార్చి త్రైమాసికంలో లాభాలను సాధిస్తుందనే అంచనాల నేపథ్యంలో కూడా సన్ టీవీపై మదుపర్లు దృష్టి సారించారని విశ్లేషకులు భావిస్తున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ క్యూ 4 ఫలితాలు కూడా సన్ టీవీ లాభాలకు నమూనాగా ఉంటాయని, ఇది కూడా స్టాక్ ధరలు పెరగడానికి కారణమని ఏంజిల్ బ్రోకింగ్ చెందిన మయురేష్ జోషి చెప్పారు.కాగా చెన్నైకు చెందిన సన్ టీవీ కి డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి మనవడు కళానిధి మారన్ అధిపతిగా ఉన్న సంగతి తెలిసిందే.