మార్కెట్ లో సన్ టీవీ మెరుపులు | Sun TV Shares Surge On Hopes Of DMK Victory In Tamil Nadu | Sakshi
Sakshi News home page

మార్కెట్ లో సన్ టీవీ మెరుపులు

Published Tue, May 17 2016 10:25 AM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM

మార్కెట్ లో  సన్ టీవీ  మెరుపులు - Sakshi

మార్కెట్ లో సన్ టీవీ మెరుపులు

చెన్నై: తమిళనాడులో అధికార పగ్గాలు  డీఎంకే కే అన్న ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో సన్ టీవీ షేర్లు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రతిపక్ష డిఎంకెకు సానుకూలంగా రావడంతో  మంగళవారం నాటి మార్కెట్ లో సన్ టివి  నెట్ వర్క్  లిమిటెడ్ షేర్లు మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి.  9.5 శాతానిపై గా లాభంతో 430 రూ. దగ్గర ట్రేడవుతూ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం  ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తప్పదని తేలడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

అటు ఈ పేరు జోరును మరింత కొనసాగించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ క్రమంలో 540రూ.లకు షేర్ విలువ చేరితే, 560కి చేరే అవకాశాలున్నాయని. ఈ స్థాయిని కూడా దాటి నిలదొక్కుకొని, కొనుగోళ్ల మద్దతు లభిస్తే  మరింత లాభపడే అవకాశం ఉందని తెలిపారు. ఒక వేళ 560 స్థాయి దగ్గర బలంగా లేకపోతే అప్రమత్తంగా  ఉండాలని విశ్లేష్లకులు సూచిస్తున్నారు.

అధికార పార్టీకి 103  సీట్లు తగ్గుతాయని,  డీఎంకె, కాంగ్రెస్ కూటమి 120 సీట్లకు పైగా  కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధిపతి కరుణా నిధి (90) సీఎం పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. మార్చి త్రైమాసికంలో  లాభాలను సాధిస్తుందనే  అంచనాల నేపథ్యంలో  కూడా సన్ టీవీపై మదుపర్లు దృష్టి సారించారని   విశ్లేషకులు భావిస్తున్నారు. జీ ఎంటర్టైన్మెంట్  క్యూ 4 ఫలితాలు కూడా సన్ టీవీ లాభాలకు నమూనాగా ఉంటాయని, ఇది కూడా స్టాక్ ధరలు పెరగడానికి కారణమని  ఏంజిల్ బ్రోకింగ్  చెందిన మయురేష్  జోషి చెప్పారు.కాగా  చెన్నైకు చెందిన  సన్ టీవీ  కి డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి మనవడు కళానిధి మారన్ అధిపతిగా ఉన్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement