
చెన్నై: తిరువళ్లూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు తెలుగు ప్రముఖులు బరిలో దిగుతున్నారు. గుమ్మిడిపూండీ డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్ తెలుగువారే. గుమ్మిడిపూండి సమీపంలోని దిగువముదలంబేడు గ్రామానికి చెందిన టీజేఎస్ విద్యాసంస్థల అధినేత టీజే గోవిందరాజన్. ప్రస్తుతం ఇతను డీఎంకే జిల్లా ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేస్తున్నారు.
తిరువళ్లూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ కూడా తెలుగు మూలాలు వున్న వ్యక్తి కావడం గమనించదగ్గ విషయం. ఇతని భార్య ఇందిరా రాజేంద్రన్ టీటీడీ బోర్డు సభ్యురాలుగా వున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి రెండోసారి డీఎంకే తరఫున పోటీచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment