Surge
-
ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్‌లో హైదరాబాద్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగంలో భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ప్రకారం.. 100 కంటే ఎక్కువ భూ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా సుమారు 1,700 ఎకరాలు చేతులు మారాయి. గతేడాది ఇదే కాలంలో 60 డీల్స్‌కుగాను 1,200 ఎకరాలు చేతులు మారాయి.డీల్స్ సంఖ్య పరంగా ఈ ఏడాది 65 శాతం వృద్ధి నమోదైంది. ల్యాండ్ డీల్స్‌లో ఆరు ప్రధాన భారతీయ నగరాలు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ల్యాండ్ డీల్స్‌లో రెసిడెన్షియల్ 61 శాతం, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ 13 శాతం, ఆఫీస్ విభాగం 8 శాతం నమోదయ్యాయి. విభిన్న రకాల ఆస్తులకు సంబంధించి పెరిగిన భూ ఒప్పంద కార్యకలాపాలు బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్నట్లు సీబీఆర్ఈ తెలియజేసింది.ఇదీ చదవండి: ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్‘‘రెసిడెన్షియల్, ఆఫీస్, డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో బలమైన వృద్ధిని చూస్తున్నాం. భారత రియల్ ఎస్టేట్ రంగం యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై పెట్టుబడిదారులు మరింత నమ్మకంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఈ ఆశావాదం భారత్‌ను రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు వ్యూహాత్మక మార్కెట్‌గా నిలుపుతోంది. వివిధ మార్కెట్లలో బలమైన డిమాండ్, అనుకూల ఆర్థిక పరిస్థితులతో కలిపి వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మార్కెట్ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను నొక్కి చెప్పే వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్ఈ వివరించింది. -
బ్లాక్ సీతాకోకచిలుకలా 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (ఫొటోలు)
-
వ్యాపార ఆశావాదం జూమ్
హైదారాబాద్: వ్యాపార ఆశావాదం మెరుగుపడినట్టు టీఆర్ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ ప్రకటించింది. 2023 మూడో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) విషయంలో వ్యాపార ఆశావహం ఎంతో ఎక్కువగా ఉంటుందని తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ అధిక సానుకూలత వ్యక్తమైనట్టు తెలిపింది. టీఆర్ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ (ఎండీఐ) 2023 క్యూ2లో 89.37గా ఉంటే క్యూ3 అంచనాలు 92.68 పాయింట్లకు చేరింది. 50కిపైన సానుకూలంగా, 50కి దిగువ ప్రతికూలంగా పరిగణిస్తుంటారు. ఈ ప్రకారం మూడో త్రైమాసికానికి వ్యాపార ఆశావహం ఎంతో మెరుగ్గా ఉంటుందని ఎండీఐ తెలిపింది. నివేదికలోని అంశాలు.. ► కంపెనీలకు సంబంధించి మార్కెటింగ్ బడ్జెట్ గణనీయంగా పెరగొచ్చు. ఇందుకు సంబంధించి సూచీ 8.8 శాతం పెరిగి 85.1 నుంచి 92.6 పాయింట్లకు క్యూ3లో చేరుకోవచ్చు. ► ప్రాంతీయ ప్రింట్ ప్రకటనల వాటా మార్కెటింగ్ బడ్జెట్లో అధికంగా ఉంటుంది. అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టైజింగ్ (ఓఓహెచ్) వాటా 11 శాతం, జాతీయ టీవీల ప్రకటనలు, రేడియో ప్రకటనలు చెరో 10 శాతం వాటా ఆక్రమించనున్నాయి. ► లోకల్ టీవీ ప్రకటనలు, ఇంగ్లిష్ ప్రింట్ ప్రకటనల వాటా 9 శాతం, సోషల్ మీడియా ప్రకటనల వాటా 7 శాతం మేర ఉండనుంది. డిజిటల్ సెర్చ్, డిజిటల్ యాడ్ 6 శాతం ఉండొచ్చని ఎండీఐ నివేదిక అంచనా వేసింది. -
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు : రూ.1.6 లక్షల కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 36.8 శాతం వృద్ధితో రూ.1.6 లక్షల కోట్లు దాటతాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో మొబైల్స్ వాటా దాదాపు సగ భాగం ఉంటుందని భావిస్తోంది. ‘దేశం నుంచి 2021-22లో రూ.1,16,937 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పలు దేశాలకు సరఫరా అయ్యాయి. ఇందులో మొబైల్స్ వాటా రూ.45,000 కోట్లు. 2022-23లో ఇది రూ.76,000 కోట్లు దాటుతుంది. 2022 ఏప్రిల్-డిసెంబర్లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్స్ విలువ రూ.1,33,313 కోట్లు. ఇందులో మొబైల్స్ వాటా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. 2021 ఏప్రిల్-డిసెంబర్లో మొబైల్స్ ఎగుమతులు రూ.27,288 కోట్లు. యూఏఈ, యూఎస్, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి అధికంగా మొబైల్స్ సరఫరా అయ్యాయి’ అని ఐసీఈఏ వివరించింది. -
ఢిల్లీలో రేపు అత్యవసర కరోనా సమీక్ష సమావేశం
న్యూఢిల్లీ: పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే తగిన చర్యలు తీసుకునేలా సంసిద్ధం కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూఎస్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లను ట్రాక్ చేసేలా తగిన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష భూషణ్ రాష్ట్రాలకు కేంద్ర పాలితన ప్రాంతాలకు కరోనా విషయమై అప్రమత్తంగా ఉండాలంటూ లేఖ రాశారు. ఆ లేఖలో దేశంలో కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్‌ని గుర్తించగలిగేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టడం ద్వారా సులభంగా బయటపడేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. (చదవండి: మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు) -
ద్రవ్యోల్బణం కట్టడి ఇప్పట్లో సాధ్యమేనా? ఆర్బీఐ కీలక ఆర్టికల్
ముంబై: ద్రవ్యోల్బణంపై పోరాటం చాలా కాలంపాటు కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ బులిటెన్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ఒకటి పేర్కొంది. దీర్ఘకాల ద్రవ్య విధానంసహా, పలు చర్యలు ధరల కట్టడికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘‘మనం ద్రవ్యోల్బణంపై విజయం సాధిస్తే, ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు మరింత సుస్థిరమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ తగిన స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్లవుతుంది. అలాగే ఈ హర్షణీయమైన పరిణామం విదేశీ పెట్టుబడిదారులను పునరుజ్జీవింపజేస్తుంది. మార్కెట్లను స్థిరీకరించి, శాశ్వత ప్రాతిపదికన భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా చేస్తుంది’ అని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రాసిన కథనం పేర్కొంది. బులిటన్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అంశాలను ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న నేథ్యంలో ఈ ఆర్టికల్ వెలువడింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాల్లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. రేటు పెంపు ప్రభావానికి ఆరు క్వార్టర్లు ఆగాలి: వర్మ ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. ‘‘కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం తప్పనిసరిగా దిగొస్తుంది’’ అని ఒక టెలిఫోనిక్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) ప్రొఫెసర్‌గా ఉన్న వర్మ, మాంద్యం భయాలు లేనప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి వాస్తవానికి చాలా సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో లేదని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధి ప్రస్తుతం పరపతి విధానానికి సవాళ్లు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడికే ఆర్బీఐ ఎంపీసీ తొలి ప్రాధాన్యతని వివరించారు. భారత్ రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు ప్రతి కరెన్సీపై డాలర్ ఇటీవల బలపడిందన్నారు. అమెరికా వాస్తవ ఎకానమీ పటిష్టత, ఫెడ్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం డాలర్ బలపడ్డానికి కారణమని విశ్లేషించారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశమేనని పేర్కొన్నారు. -
ఆగస్టు నెలలోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం: ఎస్బీఐ రిపోర్ట్
-
థర్డ్‌వేవ్ వస్తోంది.. ఎస్బీఐ రిపోర్టులో కీలక విషయాలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌పై ఆందోళన నేపథ్యంలో ఎస్బీఐ తాజా సర్వే కీలక విషయాలను వెల్లడించింది. సెకండ్ వేవ్ తీవ్ర ఉధృతి క్రమంగా క్షీణిస్తూ, కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పుంజుంటోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం కొత్తగా 40వేల లోపు కేసులు నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. అలాగే మరణాలు వెయ్యి లోపు నమోదైనాయి. దీంతో కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. అయితే మూడో వేవ్ ముప్పుమాత్రం దేశ ప్రజలను వెంటాడుతోంది. ఈ క్రమంలో థర్డ్‌వేవ్ ప్రభావంపై ఎస్బీఐ తాజా సర్వే కీలక అంచనాలు వెలువరించింది. వచ్చే నెలలోనే (ఆగస్ట్) కరోనా థర్డ్‌వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో కరోనా కేసుల నమోదు శిఖరాన్ని తాకుతుందని కూడా అంచనా వేసింది. ‘కోవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో ఎస్బీఐ ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చని, అలాగే ఆగస్ట్ 15 తరువాత కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్బీఐ రిపోర్ట్ అంచనా వేసింది. ఎస్బీఐ రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు గ్లోబల్ డేటా అంచనాల ప్రకారం సెకండ్ వేవ్‌తో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ సగటు ఉధృత కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చారిత్రక పోకడల ఆధారంగా ఆగస్ట్ 12 తరువాత కేసుల సంఖ్య క్రమంగా పుంజుకుని, నెల తరువాత పీక్ స్టేజీకి వెళ్లేఅవకాశం ఉంది. అలాగే దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తుండగా, దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతంగా ఉన్నారు. ఇక తొలి డోసు తీసుకున్వారు 20.8 శాతం మంది మాత్రమే. యుఎస్, యుకె, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాల కంటే ఇది ఇప్పటికీ తక్కువే. మరోవైపు కరోనా నిబంధనలు పాటించకపోతే అక్టోబర్-నవంబర్ మధ్య థర్డ్‌వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వ ప్యానెల్ శాస్త్రవేత్త హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే రెండో వేవ్‌తో పోలీస్తే రోజువారీ కేసుల సంఖ్య సగానికి తగ్గవచ్చన్నారు. దేశంలో లక్షా, 50 వేలనుంచి 2 లక్షల వరకు కేసులు నమోదు కానున్నాయని ప్యానెల్ సభ్యులు, ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త అగర్వాల్ హెచ్చరించారు. ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్త ఎం విద్యాసాగర్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. -
సెకండ్ హ్యాండ్ కార్లకు కరోనా జోష్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమకు కరోనా మహమ్మారి కలిసొచ్చింది. వైరస్ నేపథ్యంలో ప్రజా రవాణా సాధనాలను వినియోగించడం రిస్క్ అనే భావన పెరగడంతో సొంత వాహన కొనుగోళ్ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కారుకు బదులుగా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లకే జై కొడుతున్నారు. ఫస్ట్ టైమ్ కార్ కొనుగోలుదారులు యూజ్డ్ కార్లకే ఆసక్తి చూపిస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా యూజ్డ్ లేదా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. గత రెండు సంవత్సరాలలో యూజ్డ్ కార్లకు, పాత కార్ల మధ్య నిష్పత్తి 1.4 నుంచి 1.6కి పెరిగింది. గతేడాది దేశంలో 37 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయమయ్యాయి. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య 40 లక్షలకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త కార్ల కొనుగోలు ఎంక్వైరీలు 16 శాతం క్షీణిస్తే.. సెకండ్ హ్యాండ్ కార్ల ఎంక్వైరీలు మాత్రం 10 శాతం పెరిగాయని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శషాంక్ శ్రీవాస్తవ తెలిపారు. డిజైర్, బ్యాలెనో, స్విఫ్ట్ వంటి 7 ఏళ్ల క్రితంనాటి కార్ల ధరలు సగటున రూ.3.3 లక్షలుగా ఉంది. ఏడేళ్లు దాటినవయితే రూ.1.60 లక్షలకు దొరుకుతున్నాయి. (18 ఏళ్లు పైబడిన వారికి టీకా: ఖర్చు ఎంతో తెలుసా?) వ్యవస్థీకృత మార్కెట్ వాటా 20%.. దేశీయ యూజ్డ్ కార్ల మార్కెట్లో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగంలోనే ఉంది. మారుతీ సుజుకీ ట్రూ వ్యాల్యూ, హోండా ఫస్ట్ చాయిస్, టాటా మోటార్స్ అష్యూర్డ్ వంటి వ్యవస్థీకృత కార్ల కంపెనీలతో పాటు స్పిన్నీ వంటి స్టార్టప్ కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నాయి. యూజ్డ్ కార్ల పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 20 శాతం వరకుంటుంది. యూజ్డ్ కార్ల మార్కెట్లో 55 శాతం అమ్మకాలు కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ సేల్స్ ఉంటాయని శ్రీవాస్తవ చెప్పారు. గతేడాది కంటే ప్రస్తుతం యూజ్డ్ కార్ల వ్యవస్థీకృత కంపెనీలు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. (కరోనా ముప్పు: ఎస్బీఐ సంచలన రిపోర్ట్) యూజ్డ్ కార్లకే ఫస్ట్ టైమ్ బయ్యర్ ఓటు.. ద్విచక్ర వాహనం నుంచి కారు కొనుగోళ్లకు.. ఇందులోనూ తొలిసారి కారు కొనుగోలుదారులు క్రమంగా పెరుగుతున్నారు. యూజ్డ్ కార్ల మార్కెట్లో వేగాన్ని బట్టి గేర్లను నియంత్రించే ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఈ తరహా కార్ల విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. గతేడాది ఎనిమిదేళ్లుగా ఉన్న యూజ్డ్ కార్ల సగటు వయసు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలకు పెరిగిందని చెప్పారు. తొలిసారి కారు కొనుగోలుదారులు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. 2018–19 లో మొత్తం యూజ్డ్ కార్ల విక్రయాలలో ఫస్ట్ టైమ్ కారు కొనుగోలుదారులు వాటా 62 %గా ఉండగా.. ప్రస్తుతం ఇది 70%కి పెరిగిందని తెలిపారు. టాప్‌గేర్‌లో ట్రూ వ్యాల్యూ సేల్స్.. మారుతీ సుజుకీ ట్రూ వ్యాల్యూ బ్రాండ్ పేరిట యూజ్డ్ కార్లను విక్రయిస్తుంది. ఏటా 4,20 లక్షల కార్లను విక్రయిస్తుంది కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ట్రూ వ్యాల్యూకి 2.3 మిలియన్ల ఎంక్వైరీలు వచ్చాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఎంక్వైరీలు పెరిగాయి కానీ విక్రయాలు తగ్గాయని శ్రీవాస్తవ తెలిపారు. 2016-17లో 3,46,603 సెకండ్స్ కార్లను విక్రయించగా.. 2017-18లో 3,54,135 యూనిట్లు, 2018-19లో 4,22,892 వాహనాలు, 2019-20లో 4,18,897 కార్లను విక్రయించింది. ట్రూ వ్యాల్యూలో ఫస్ట్ టైం కారు కొనుగోలుదారుల విభా గం 3% మేర వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్లో ట్రూ వ్యాల్యూ విక్రయాలు 12 శాతం క్షీణించాయి. ఉత్తరప్రదేశ్‌లో స్థిరంగా ఉన్నాయి. ఓడోమీటర్ల టాంపరింగ్ ఉండదు.. ఆర్గనైజ్ కంపెనీల యూజ్డ్ కార్లలో వాహనం తిరిగిన కిలో మీటర్లను తగ్గించే ఓడోమీటర్ల టాంపరింగ్ వంటి వాటికి అవకాశం ఉండదు. నాణ్యమైన కార్లను విక్రయించడంతో పాటు వారంటీ, మెయింటనెన్స్ రికార్డ్స్, ఇతరత్రా పారదర్శకమైన ఆఫర్లను అందిస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగిందని రీసెర్చ్ అండ్ అనలిటిక్ట్స్ కంపెనీ ఐహెచ్ మార్కిట్, పవర్‌ట్రెయిన్ అండ్ కంప్లెయిన్స్ ఫోర్కాస్ట్కు నాయకత్వం వహిస్తున్న సూరజ్ ఘోష్ తెలిపారు. ఉదాహరణకు మారుతీ ట్రూ వ్యాల్యూ ఇద్దరు యజమానుల కంటే ఎక్కువ చేతులు మారిన కార్లను విక్రయించదు. ట్రూ వ్యాల్యూ సేల్స్ ఎలా ఉన్నాయంటే? సంవత్సరం విక్రయాల సంఖ్య 2016–17 3,46,603 2017–18 3,54,135 2018–19 4,22,892 2019–20 4,18,897 -
లాక్డౌన్ గుబులు: సుమారు 6 లక్షల కోట్లు సంపద ఆవిరి
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ల మహాపతనంతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందను క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్డౌన్ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 వద్దకు చేరుకుంది. అంతకుముందు 48,832 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 426 పాయింట్ల పతనమై 14200కు దిగువకు చేరింది. దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఆరంభంలో మార్కెట్ల భారీ పతనంతో రూ .5.82 లక్షల కోట్ల మేర క్షీణించడంతో బీఎస్ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లోని రూ. 205.71 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 199.89 లక్షలకు కోట్లకు పడిపోయింది. బ్యాంకింగ్, ఆటో తో పాటు అన్న రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఈ పరిణామానికి దారి తీసింది. అయితే ఫార్మ, ఆక్సిజన్ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. (కరోనా సెగ : రుపీ ఢమాల్) తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ ఎగ్జిక్యూటివ్-విపి రస్మిక్ ఓజా తెలిపారు. కోవిడ్ కేసుల పెరుగుదల, రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు రాబోయే 2-3 నెలలలో మరింత ఎగియనుందనే ఆందోళన, దీంతో పలు రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు, లాక్డౌన్ల అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నాయన్నారు. ఇది మన ఎకానమీ వీ షేప్ రికవరీని దెబ్బతీస్తుందనీ, ఆదాయ అంచనాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాటు మరణాల రేట్లు పెరగడం పెట్టుబడిదారులను భయపెట్టిందని టిప్ప్ 2 ట్రేడ్స్‌లో సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ తెలిపారు. సాంకేతికంగా, నిఫ్టీ 14192 కన్నా దిగువన ముగిస్తే మరింత బలహీనం తప్పదన్నారు. (దలాల్ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు) కాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకటారం గత 24 గంటల్లో 2.73 లక్షల తాజా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 1,619 కొత్త మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులకుసంబంధించి ఇండియా ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్) -
వైరస్ అలర్ట్: ఒక్కరోజే 2,34,692 కోవిడ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులకు తగ్గడం లేదు. తాజాగా కేంద్రం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 1341 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,23,354 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు ఇండియాలో 11,99,37,641 మందికి వ్యాక్సిన్ ను అందించారు. (మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశలోఎకానమీ బెటర్..!) తెలంగాణా తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా రాష్ట్రంలో 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. ఇందులో 3,11,008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1809 కి చేరింది. మరోవైపు కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన సంగతి తెలిసిందే. (నేటి నుంచి పూర్తిగా కరోనా రోగులకే సేవలు) మహారాష్ట్ర, ఢిల్లీలో విజృంభణ మహారాష్ట్రలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రోజువారీ కేసుల నమోదు 63,729 గా ఉంది. దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. కొత్తగా19,486 కరోనా కేసులు నమోదు కాగా, 141 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30 లక్షల మంది మరణించారు. అమెరికా (3.15 కోట్లు) తరువాత రెండవ అత్యధిక ప్రభావిత దేశంగా ఇండియా ఉంది. -
ఇదేం ఖర్మరా నాయనా.. వ్యాక్సిన్ కోసం వెళితే..
‘టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్.. కరోనా పరిభాషలో ఈ మూడు ‘టీ’లు కీలకం. కానీ.. నగరంలో ఇవే కొంప ముంచే దుస్థితి నెలకొంది. తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందన్న చందంగా మారింది. కోవిడ్‌ను నిలువరించేందుకు వ్యాక్సినేషన్ కోసం వెళితే మొదటికే ముప్పు వాటిల్లుతోంది. టీకా వేయించుకునేందుకు పోతే వైరస్ సోకుతోంది. కేంద్రాలకు వచ్చేవారిలో ఎవరు పాజిటివో.. ఎవరు నెగెటివో తెలియడంలేదు. గుంపులు గుంపులు రావడం, మాస్కులు ధరించకపోవడం.. తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి కరోనా విస్తరిస్తోంది’ దిల్‌సుక్‌నగర్‌కు చెందిన కమల్‌కిశోర్ ఈ నెల 8న సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో టీకా వేయించుకున్నారు. ఆ తర్వాత 3 రోజులకే ఆయనకు జ్వరం ఒంటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అనుమానం వచ్చి టెస్ట్ చేయించడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిజానికి ఆయన వాక్సిన్ తీసుకోవడానికి ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ బయటికి వెళ్లలేదు. మరి వైరస్ ఎలా సోకిందని ఆరా తీయగా.. టీకా వేయించుకున్న ప్రదేశం నుంచేనని తేలింది. టెస్టులకు వచ్చిన వారు, టీకా వేయించుకోవడానికి వచ్చిన వారు ఒకేచోట కలవడంతో వైరస్ సోకినట్టు వెల్లడైంది. సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నగరవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతుండటంతో నిర్ధారణ టెస్టుల కోసం సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేయాల్సిన ఆరోగ్య కేంద్రాలు.. మరింత విస్తరణకు కారణమవుతున్నాయి. ఒకే ప్రాంగణంలో టెస్టులు.. టీకాలు కొనసాగుతుండటంతో కోవిడ్ బాధితులు, లబ్ధిదారులతో రద్దీగా మారుతున్నాయి. టెస్టుల కోసం సరైన గదులు లేకపోవడంతో ల్యాబ్ టెక్నిషియన్లు పీపీఈ కిట్లతో చెట్లకిందే నిల్చుని పరీక్షలు చేయాల్సివస్తోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని కిట్లు సరఫరా చేయకపోవడంతో సమస్య తలెత్తుతోంది. టెస్టుల కోసం ఉదయం 8 గంటలకే ఆస్పత్రికి చేరుకుని గంటల తరబడి క్యూలైన్లో నిలబడినవారు తీరా కిట్లు లేక చివరకు వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. కమ్యూనిటీ హాళ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిని టీకాల కోసం వినియోగిస్తే లబ్ధిదారులు వైరస్ బారిన పడకుండా చూడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు కిట్లు.. ఇటు టీకాల కొరత.. ► హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 248 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తుండగా, ఒక్కో సెంటర్లో రోజుకు వంద మందికి టెస్టులు చేస్తున్నారు. వీరికి సహాయంగా కుటుంబ సభ్యులు కూడా వస్తుండటంతో ఆయా కేంద్రాలన్నీ రద్దీగా మారుతున్నాయి. వచ్చిన వారిలో ఎవరికి వైరస్ ఉందో తెలియని దుస్థితి. భౌతికదూరం పాటించడం లేదు. శానిటైజ్ చేయని కుర్చీల్లోనే ఒకరి తర్వాత మరొకరు కూర్చుంటున్నారు. చెట్ల కింద గుంపులుగా నిలబడుతుండటం, టెస్టులు, టీకాలు ఒకే చోట నిర్వహిస్తుండటం వైరస్ విస్తరణకు కారణమవుతోంది. ఫలితంగా నెలవారీ పరీక్షలకు వస్తున్న గర్భిణులు, బాలింతలు, శిశువులు వైరస్ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ► ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 179 ప్రభుత్వ, 148 ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు సగటున 150 మందికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఈ మూడు జిల్లాల్లో సుమారు 20 లక్షల మందికి టీకాలు వేశారు. మొదట్లో టీకాపై పెద్దగా ఆసక్తి చూపని సిటిజన్లు..సెకండ్‌వేవ్ తీవ్రత కారణంగా తాజాగా టీకాల కోసం క్యూ కడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న టీకాల నిష్పత్తికి మించి లబ్ధిదారులు వస్తుండటంతో కోవిన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి కూడా టీకాలు దొరకని పరిస్థితి. అంతేకాదు తొలి విడతలో టీకా వేయించుకున్న వారు రెండో డోసు కోసం పడిగాపులు కాస్తున్నారు. టీకా కోసం వెళ్తే వైరస్ కోవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4న బాలానగర్ పీహెచ్‌సీకి వెళ్లాను. నాతో పాటు నా భార్యను కూడా తీసుకెళ్లాను. అప్పటికే అక్కడ టెస్టుల కోసం వచ్చిన వారితో ఆస్పత్రి రద్దీగా మారింది. టెస్టుల కోసం వచ్చిన వారి మధ్యలో నుంచి టీకా గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. టీకా వేయించుకున్న నాలుగు రోజులకే నా భార్యకు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు మొదలయ్యాయి. టెస్ట్ చేయిస్తే పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటికే ఆమెకు సన్నిహితంగా మెలిగిన నాకు కూడా వైరస్ సోకింది. నిజానికి గత నెల రోజుల నుంచి ఇద్దరం ఇంటి గడప కూడా దాటలేదు. కేవలం టీకా కోసం మాత్రమే బయటికి వెళ్లి వచ్చాం. -జగదీశ్వర్, బడంగ్పేట్ సెకండ్ డోస్ దొరకడం లేదు మార్చి 10 తేదీన సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తొలి డోసులో భాగంగా కోవాగ్జిన్ టీకా తీసుకున్నా. రెండో డోసు కోసం ఇటీవల మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లాను. తీరా టీకా లేదన్నారు. తొలి డోసు టీకా వేసుకుని ఇప్పటికే 35 రోజులైంది. ప్రతి రోజు ఉదయమే ఆస్పత్రి వెళ్లడం.. నిరాశతో వెనుతిరిగి వస్తున్నా. ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. -నాగేశ్వర్రావు, సనత్‌నగర్ ఇది ఉప్పల్ పట్టణ ఆరోగ్య కేంద్రం. ఇక్కడ ఓవైపు కోవిడ్ టెస్టులు.. మరోవైపు టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకోవైపు నెలవారీ చెకప్‌ల కోసం గర్భిణులు, బాలింతలు ఇక్కడికే వస్తున్నారు. ఉదయం 9 గంటలకే టెస్టులు, టీకాలు కొనసాగుతుండటంతో బాధితులు, లబ్ధిదారులు ఓ గంట ముందే వచ్చి ఆస్పత్రిలోని చెట్ల కింద గుంపులుగా నిల్చుంటున్నారు. వైరస్ నిర్ధారణ టెస్టుల కోసం వచ్చినవారి ద్వారా టీకాలు వేయించుకునే వారు, ఇతర వైద్య పరీక్షలకు వచ్చేవారు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది .. ఇది ఒక్క ఉప్పల్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మాత్రమే కాదు.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని దాదాపు అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హయత్‌నగర్‌లో టీకాల కొరత.. హయత్‌నగర్: కోవిడ్ వ్యాక్సిన్లకు డిమాండ్ పెరగడంతో ఆస్పత్రుల్లో వీటికి కొరత ఏర్పడింది. టీకాల నిష్పత్తికి మించి లబ్ధిదారులు రావడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. చివరకు టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. హయత్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం వరకు టీకాల పంపిణీ సజావుగానే సాగింది. గురువారం టీకాలు సరఫరా లేకపోవడంతో టీకాల కార్యక్రమాన్ని నిలిపివేశారు. వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. -
విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు
-
విజృంభిస్తున్న కరోనా: కొత్తగా వెయ్యికిపైగా మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 1,85,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల నమోదుకు సంబంధించి ఇది సరికొత్త గరిష్టం. అంతేకాదు వరుసగా నాలుగవ రోజు కూడా లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ ఏడాదిలో మరణాల సంఖ్య కూడా వెయ్యిదాటేసింది. గడచిన 6 నెలల తరువాత దేశంలో అత్యధిక సంఖ్యలో 1026 మరణాలు నమోదు కావడం గమనార్హం. (వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి?) ఇప్పటికే కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 60,212 కొత్త కరోనా ఇన్ఫెక్షన్లు (కొత్త కేసులలో 32శాతం ఉన్నాయి), ఉత్తర ప్రదేశ్ 18,021 కేసులు, ఢిల్లీలో 13,468 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ల కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,38,52,599 కేసులు నమోదుగా కాగా 1,71,929 మరణాలు సంభవించాయి. కరోనా కేసుల్లో భారత్ ఇప్పటికే బ్రెజిల్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే.13.52 మిలియన్ల సంచిత కేసులతో ఉన్న బ్రెజిల్ ప్రస్తుతం రోజుకు సగటున 72,000కేసులుబ్రెజిల్ రోజుకు సగటున 3,100 కంటే ఎక్కువ మరణాలను నమోదు ఏప్రిల్ 11 నాటికి, బ్రెజిల్ మొత్తం 3,54,617 మరణాలను నమోదు చేసింది, ఇది భారతదేశం కంటే రెండు రెట్లు ఎక్కువ. ఏప్రిల్ 13 న ఉదయం 7 గంటల వరకు భారతదేశంలో 10,85,33,085 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (భారీ ఊరట: మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి) తెలంగాణాలో కేసులు తెలంగాణలో కరోనా కేసులు నమోదు పెరుగుతూ పోతోంది. రాత్రి 8 గంటల వరకు మొత్తం 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఎనిమిది మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరింది. 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. -
క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!
సాక్షి, సిటీబ్యూరో: మాస్ రియాక్టివ్ డిప్రెషన్ (ఎమ్మార్డీ). మానసిక వైద్య నిపుణులు కొత్తగా చెబుతున్న మాట ఇది. సాధారణంగా వ్యక్తులు కుంగుబాటు బారిన పడతారు. కానీ సమాజంలో ఎక్కువ మంది ఒకేసారి ఒకేవిధమైన ఆందోళన, డిప్రెషన్‌కు గురైతే.. అదే మాస్ రియాక్టివ్ డిప్రెషన్. కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ సృష్టించిన షాక్ ఇది. మొదటి దశ కంటే రెండో దశలోనే కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒకవైపు వైరస్ తమను ఏం చేయలేదనే తెగింపు ధోరణి కొంతమంది ఆలోచనా విధానంలో కనిపిస్తోంది. మరోవైపు తొలగిపోయిందనుకున్న మహమ్మారి తిరిగి విజృంభించడంతో నెలకొన్న భయాందోళనల కారణంగా మాస్ డిప్రెషన్ లక్షణాలు పెరుగుతున్నాయని సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి.. వంచించి ► గతేడాది మార్చి నుంచి ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన కోవిడ్ సెప్టెంబర్ నాటికి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. నవంబర్ నెలలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. పెళ్లిళ్లు, వేడుకలు, పర్యటనలు, సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారం వంటి వాటితో పాటు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు పెరిగాయి. ► సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్ తదితర అన్ని వ్యాపార, వినోద కేంద్రాలు తిరిగి తెరుచుకున్నాయి. జనంలో చాలా వరకు కోవిడ్ భయాందోళనలు తొలగిపోయాయి. ఒక భరోసా ఏర్పడింది. ఇక కోవిడ్ ముప్పు తొలగినట్లేనని భావించిన జనం మాస్కులు ధరించడం మానేశారు. ► భౌతిక దూరం నిబంధన తొలగిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోవిడ్ తిరిగి తన ప్రతాపాన్ని ప్రదర్శించడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరుకున్నాయి. ఇది మాస్ రియాక్టివ్ డిప్రెషన్‌కు దారితీసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇమ్యూనిటీపై ఎఫెక్ట్ ► సాధారణంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్ ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు. దీంతో వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధత లభిస్తుంది. కానీ మహమ్మారిని ఎదుర్కోవడంలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో ముఖ్యం. ► వైరస్ రెండో దశకు విస్తరించడం ఒకవైపు అయితే, మరోవైపు వైరస్‌పై వివిధ రకాల ప్రచారంతో సైకలాజికల్ ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతోంది. తమకేదైనా అవుతుందేమోననే భయాంతో చాలామంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. దీనికి కారణం వైరస్ ఎప్పటి వరకు తొలగిపోతుందనే అంశంపై స్పష్టత లేకపోవడమేనని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ సంహిత తెలిపారు. సన్నద్ధతతోనే పరిష్కారం వైరస్ వ్యాప్తి, ఉద్ధృతి, తగ్గుముఖానికి అనుగుణంగా మానసిక సన్నద్ధతను పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం. శారీరక వ్యాయామంతో దృఢత్వం పెంచుకొన్నట్లుగానే ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి -
టెక్ జాబ్స్‌లో తగ్గని జోష్!
సాక్షి,ముంబై: కరోనా కంటే ముందు, తర్వాత కాలంలోను సాంకేతిక ఉద్యోగ నియామకాలు గణనీయంగా పెరిగాయి. వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి విస్తరించడం, వ్యవస్థలోకి కస్టమర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర సంస్థలను అనుసంధానించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేయడం వైపు దృష్టి కేంద్రీకరించడం వల్ల కరోనా అనంతరం టెక్ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి నైపుణ్య సాంకేతిక ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్‌డీడ్ తెలిపింది. జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో ఇన్‌డీడ్ ఫ్లాట్‌ఫామ్‌లోని డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొంచించారు. ఈ మధ్య కాలంలో ఆయా విభాగాలలో 150-300 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొంది. కంపెనీలలో సాంకేతిక సమస్యల పరిష్కారం మీద నిరంతరం ఆధారపడటం, వర్క్ ఫ్రం హోమ్ విస్తరించడం, వ్యాపార సంస్థలు సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం వంటి టెక్ జాబ్స్ పోస్టింగ్స్ వృద్ధికి కారణాలని తెలిపింది. ఫీల్డ్ ఇంజనీర్, సేల్స్ లీడ్, ఎడిటర్ వంటి ఉద్యోగాలకు యాజమాన్యాల నుంచి 55-85 శాతం డిమాండ్ ఉందని పేర్కొంది. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పుణే, ఢిల్లీ వంటి కీలక మెట్రో నగరాల్లో అన్ని రంగాలలో జాబ్స్ పోస్టింగ్స్ పెరిగాయి. రిటైల్, బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ పోస్టింగ్ కేంద్రీకృతమైన కోల్‌కత్తాలో మినహా మిగిలిన అన్ని మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలలో వృద్ధి ఉందని తెలిపింది. ఈ ఏడాది మార్చితో ఏడాది పూర్తయిన కరోనా మహమ్మారి ప్రభావంతో దేశీయ నియామక కార్యకలాపాల్లో 9 శాతం క్షీణత నమోదయిందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్‌డీడ్ తెలిపింది. కాలర్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విపరీతంగా క్షీణించాయి. కరోనా తర్వాతి నుంచి ప్రపంచం డిజిటల్ భవిష్యత్తు వైపు శరవేగంగా పరుగులు పెడుతోందని ఈ డేటా విశ్లేషించిందని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు. అన్ని రంగాలలో షాపింగ్, రిమోట్ వర్కింగ్ టెక్ డెవలపర్లకు ప్రాముఖ్యత సంతరించిందని పేర్కొన్నారు. -
మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు
సాక్షి, ముంబై : మద్యం దుకాణాలకు షరతులతో కూడిన అనుమతి లభించడంతో నష్టాల మార్కెట్లో కూడా పలు లిక్కర్ షేర్లు దూసుకుపోతున్నాయి. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం లిక్కర్ స్టాక్స్ ఫుల్ జోష్‌లో ట్రేడవుతున్నాయి. దాదాపు 11శాతం వరకు ఎగిసాయి. జీఎం బ్రూవరీస్, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్, రాడికో ఖైతాన్, గ్లోబస్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్, యునైటెడ్ స్పిరిట్స్ ఈ రోజు ఇంట్రా-డే లో 4 నుండి 11 శాతం వరకు లాభపడుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతికి అడ్డు కట్టపడకపోవడంతో మే 17 తేదీ వరకు లాక్డౌన్ పొడగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్ 1712 పాయింట్లకుపైగా కుప్ప కూలి 32వేల స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పతనమైంది. (లాక్డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్) లాక్‌డౌన్‌తో గత త్రైమాసికంలో మద్యం అమ్మకాల వాల్యూమ్స్ గణనీయంగా పడిపోనున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో యునైటెడ్ బ్రేవరీస్ తమ వాల్యూమ్స్‌లో 15శాతం క్షీణతను అంచనావేసింది. అయితే అధిక ధరల కారణంగా కంపెనీలకు మార్జిన్స్ మరింత పెరగనున్నాయనీ, అమ్మకాలు తగ్గడంతో ఆపరేటింగ్ మార్జింగ్ క్షీణతను నమోదు చేసే అవకాశముందని ఎంకే గ్లోబల్ సర్వీసెస్ అంచనా వేసింది. (జియో మరో భారీ డీల్ ) మరోవైపు దేశవ్యాప్తంగా షరతులతో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు ఆయా దుకాణాల వద్ద బారులు తీరడం గమనార్హం. కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, రెడ్ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలను ( స్టాండ్ ఎలోన్) తెరవడానికి అనుమతిస్తారు. అయితే దేశవ్యాప్తంగా కంటైన్ మెంట్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి లేదు. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) -
బంగారం ధరలు పైపైకి
సాక్షి, ముంబై: దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కారణంగా ఫిజికల్ కొనుగోళ్లు పడిపోయినప్పటికీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లలో రికార్డు స్థాయిని తాకాయి. సోమవారం ఒక శాతానికిపైగా పుంజుకుని రికార్డును స్థాయికి చేరాయి. ఎంసీఎక్స్ లో జూన్ పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాములకు 45,800కు చేరుకుంది. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో వుంది. మే నెల వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.4 శాతం పెరిగి 43,670కు చేరుకుంది. బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తోందని, మొత్తం ధోరణి సానుకూలంగా ఉందని ఎస్ఎంసి గ్లోబల్ ఒక నోట్లో పేర్కొంది. బంగారానికి పది గ్రాముల ధర రూ. 45 వేల దగ్గర, వెండి కిలో ధర 42,500 రూపాయల వద్ద గట్టి మద్దతు వుందని తెలిపింది. గ్లోబల్ మార్కెట్లలో, ఈ రోజు బంగారం రేట్లు ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక నెల గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా ఉన్నాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో గత వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన, తాజా ఉద్దీపన చర్యల మధ్య ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, బంగారానికి మద్దతు ఇస్తున్నాయని నిపుణుల అంచనా. స్పాట్ బంగారం ఔన్సు1,687 డాలర్లుగా వుంది. ఇతర విలువైన లోహాలలో, వెండి 0.5శాతం పెరిగి 15.40 డాలర్ల వద్ద,, ప్లాటినం 0.3శాతం క్షీణించి 745.74 డాలర్లకు చేరుకుంది. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) భారతదేశంలో,మూడు వారాల లాక్ డౌన కారణంగా బంగారం భౌతిక కొనుగోళ్లు నిలిచిపోయాయి. అంతేకాదు లాక్ డౌన్ పొడిగింపుపై అనిశ్చితి కారణంగా జ్యువెలర్స్ మే డెలివరీకి కూడా ఆర్డర్లు ఇవ్వడం లేదని ముంబైకి చెందిన డీలర్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రికార్డు ధరలు, లాక్ డౌన్ కారణంగామార్చిలో భారత బంగారు దిగుమతులు సంవత్సరానికి 73శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) చదవండి : కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ -
2019లో దూసుకుపోయిన ఇండియన్ టైకూన్
సాక్షి, ముంబై: ఇండియన్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ముకేశ్ అంబానీకి 2019 ఏడాది బాగా కలిసి వచ్చిన మంచి సంవత్సరంగా నిలిచింది. ఒక పక్క దేశ ఆర్థిక వ్యవస్థలో మందమనం ఆందోళన రేపుతోంటే ఆయన మాత్రం సంపద సృష్టిలో దూసుకుపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, భారత వ్యాపారవేత్త, కుబేరుడు అంబానీ సంపద డిసెంబర్ 23 నాటికి దాదాపు 18 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇది ఆసియాలో అత్యధికం. దీంతో ఆయన సంపద నికర విలువ 61 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరగ్గా, జెఫ్ బెజోస్ 13.2 బిలియన్ డాలర్లు పెరిగింది. 2021 నాటికి రిలయన్స్ కంపెనీని జీరో డెబిట్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆగస్ట్ నెలలో చెప్పిన అంబానీ ఆ వైపుగా దూసుకుపోతున్నారు. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల విలువ 40 శాతం పెరగడంతో పుంజుకోవడం ముకేశ్ అంబానీ సంపద భారీగా పెరగడానికి దోహదపడింది. ఇదే కాలంలో ఇండియా బెంచ్ మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ లాభపడిన దాని కంటే రిలయన్స్ స్టాక్స్ రెండింతలు పెరిగడం గమనార్హం. ఆయిల్ అండ్ గ్యాస్, టెలి కమ్యూనికేషన్స్ సహా రీటైల్ వివిధ రంగాలు, పెట్టుబడులు, రిలయన్స్‌ను ఓ స్థాయికి తీసుకు వెళ్లారని, టీసీజీ అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చక్రి లోకప్రియ తెలిపారు. త్వరలోనే అమెజాన్‌కు పోటీగా ఇ-కామర్స్ దిగ్గజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో, ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టనుందన్నారు. అలాగే రానున్న రిలయన్స్ వాటాదారుల విలువను రెట్టింపు అవుతుందని తాము నమ్ముతున్నామన్నారు. తద్వారా రిలయన్స్ కొత్త వెంచర్స్ ద్వారా 50 శాతం ఆదాయం రానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 32 శాతంగా ఉంది. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కోతో ఒప్పందం రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చాయి.(ఆరాంకోతో ప్రతిపాదిత లావాదేవీకి కేంద్రం ద్వారా ప్రస్తుతానికి అడ్డుకట్ట పడింది). దీనికితోడు టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనం, ప్రత్యర్థుల ధీటుగా శర వేగంగా దూసుకెళ్లి మూడేళ్లలోనే దేశంలో నెంబర్ 1 గా అవతరించడం వంటివి రిలయన్స్‌కు 2019లో బాగా కలిసి వచ్చిన అంశాలు. కాగా ఫోర్బ్స్ గత నెలలో ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచిన సంగతి విదితమే. -
యస్ బ్యాంకునకు ఊరట : షేరు జంప్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణదాత యస్‌బ్యాంకునకు భారీ ఊరట లభించింది. ఇటీవల పాతాళానికి పడిపోయిన బ్యాంకు షేరు గురువారం నాటి ట్రేడింగ్ ఆరంభంలోనే ఏకంగా 20శాతం ఎగిసింది. తద్వారా వరుస ఐదు రోజుల పతనానికి చెక్ పెట్టింది. బ్యాంక్ ఫైనాన్షియల్, నిర్వహణ, అంతర్గత పరిస్థితులు పటిష్టంగా ఉన్నట్లు యస్ బ్యాంక్ యాజమాన్యం తాజాగా పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లిక్విడిటీ పరిస్థితులు సైతం మెరుగ్గా ఉన్నాయని స్టాక్ ఎక్చ్సేంజీ సమాచారంలో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లతో భారీగా లాభపడింది. దాదాపు ఎనిమిది నెలల్లో ఇది అతిపెద్ద లాభం. ప్రమోటర్ రాణాకపూర్, తదితరులు 2.16 శాతం వాటాను విక్రయించడంతో బ్యాంకులో వాటా 4.72 శాతానికి పరిమితమైనట్లు యస్ బ్యాంక్ ఇప్పటికే తెలిపింది. రాణా కపూర్ తనఖా పెట్టిన 10 కోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు యస్‌బ్యాంక్ తెలిపింది. ఇప్పటికి తమ బ్యాంకు ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది. డిపాజిట్లు, నిధుల లభ్యతపై కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు ఉద్దేశ్యం పూర్తిగా తెరపైకి వచ్చాయని, కనీస మూలధన పరిమితికి మించి తమ వద్ద నిధుల లభ్యత ఉన్నట్లు తెలిపింది. షేర్ల పతనానికి అడ్డుకట్ల వేసేందుకు తక్షణ చర్యలు ప్రారంభిస్తామని ఎక్చ్సేంజీలకు ఇచ్చిన వివరణలో పేర్కొంది. మరోవైపు బ్యాంక్‌ను కష్టాల కడలి నుంచి గట్టేక్కించే అంశంలో మేనేజ్మెంట్పై తమ పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటర్ అశోక్ కపూర్ , ఆమె కుమార్తె షాగున్ గొగోయ్ ప్రకటించడం ఇన్వస్టెర్లకు మరింత ఊతమిచ్చింది మరోవైపు బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా చేసినట్లు సీఈవో రవ్నీత్ గిల్ గురువారం ప్రకటించారు. 2004లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్యాంకులో చేరిన మోంగా తదనంతరకాలంలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగారు. కాగా మంగళవారం తనఖా షేర్లను ఇన్స్టిట్యూషన్స్ విక్రయించడంతో దాదాపు 30 శాతం పడిపోయింది. రూ. 29 వద్ద షేరు ఒక దశాబ్దం కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
ఒక్క గంటలో రూ.5 లక్షల కోట్లు
సాక్షి, ముంబై: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దలాల్ స్ట్రీట్‌లో సరికొత్త వెలుగులు నింపారు. కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో దేశీ స్టాక్‌మార్కెట్ల చరిత్రలో లేని లాభాలకు కారణమయ్యారు. గత పదేళ్ల కాలంలోలేని విధంగా కీలక సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లపైగా దూసుకెళ్లింది. సెన్సెక్స్ 1992 పాయింట్లు దూసుకెళ్లి 38వేలకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. నిఫ్టీది కూడా ఇటే బాట 600 పాయింట్లకుపైగా ఎగిసి 11,300 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఒక్క గంటలోనే దేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)కు రూ. 5 లక్షల కోట్లు జమ అయ్యాయంటేనే మార్కెట్ల జోరు తెలుసుకోవచ్చు. లాభాల్లో రికార్డుమోత మోగిస్తోంది.ఒకరోజులో ఇదేఅతిపెద్ద లాభాల నమోదు. అన్ని రంగాలూ లాభాల మోత మోగిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటో రంగాలు 7.5 శాతం చొప్పున దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, బ్రిటానియా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్ బాగా లాభపడుతున్నాయి. జీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
భారీగా పెరిగిన బంగారం ధరలు..!
ముంబై : బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా కొనుగోళ్ల సందడి పెరుగుతుండటంతో బంగారం ధర ఆరేళ్ల గరిష్ఠానికి చేరింది. నేడు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 32, 650గా నమోదైంది. బంగారం ధర దూసుకుపోతుండగా.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. పరిశ్రమల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో వెండి ధర రూ. 40 తగ్గి 39, 200కి నమోదైంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం 30 రూపాయల చొప్పున పెరిగి రూ.32,650గా, రూ.31,500గా నమోదైంది. నవంబర్ 29, 2012 తర్వాత ఇదే అత్యధిక ధర. 2012, నవంబర్ 29న 10 గ్రాముల బంగారం ధర 32, 940రూపాయలకు చేరింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ రోజే రికార్డ్ స్థాయిలో బంగారం ధర పెరిగింది. -
పెట్రో వాత : ఆగస్టునుంచి ఎంత?
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లీటరు పెట్రోలు ధర మరో12 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 16పైసలు పైకి ఎగబాకింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ధర సోమవారం 83.21 డాలర్ల నుంచి బ్యారెల్‌కి 85 డాలర్లకు చేరింది. త్వరలోనే బ్యారెల్‌కు 100 డాలర్లు తాకే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు మధ్యకాలం నుంచి పెట్రోలు లీటరుకు 6.50 రూపాయల మేరకు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రోజువారీ పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెంపు డాలరు మారకంలో రూపాయి విలువ అంతకంతకూ మరింత దిగజారుతోంది. దేశీయకరెన్సీ డాలరు మారకంలో సోమవారం 72.91 వద్ద ముగిసింది. -
లెమన్ ట్రీ డెబ్యూ అదిరింది
సాక్షి, ముంబై: ఆతిథ్య రంగ సంస్థ లెమన్ ట్రీ హోటల్స్ మొట్టమొదటి ట్రేడింగ్‌లో అదరగొట్టింది. మొట్టమొదటి ట్రేడింగ్‌లోనే లాభాల మోతమోగించింది. లిస్టింగ్‌లో 10 శాతం ప్రీమియాన్ని సాధించిన లెమన్ ట్రీ హోటల్స్ స్టాక్ ట్రేడింగ్ ఆద్యంతం జోరుగా సాగింది. ఇష్యూ ధర రూ. 56కాగా ఆరంభంలోనే 10శాతం దూసుకెళ్లింది. అనంతరం దాదాపు 32శాతానికి పైగా ఎగిసింది. చివరికి 28 శాతం లాభంతో 73.90వద్ద ముగిసింది. గత నెలాఖరున ఐపీవోకి వచ్చిన కంపెనీ దాదాపు రూ. 1039 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 311 కోట్లను సమీకరించింది. అయితే ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్ర స్పందనే కనిపించింది. ఇష్యూకి 1.2 రెట్లు అధికంగా మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా లెమన్ ట్రీ 12.98 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 15.47 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్) కోటా 3.88 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. సంపన్న వర్గాలు, రిటైల్ విభాగాల నుంచి నామమాత్రంగా 0.12 శాతమే దరఖాస్తులు లభించాయి. కాగా మిడ్ రేంజ్లో దేశీయంగా అతిపెద్ద సంస్థ అయిన లెమన్ ట్రీ హోటల్స్ 28 పట్టణాలలో 45 హోటళ్లను నిర్వహిస్తోంది. లెమన్ ట్రీ ప్రీమియం, లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్ బ్రాండ్లతో ప్రీమియం, మధ్యస్థాయి, ఎకానమీ విభాగాల్లో మొత్తంగా 4,700 రూములను ఆఫర్ చేస్తోంది. -
మార్కెట్లో ఫలితాల జోరు
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్లో క్యూ3 ఫలితాల జోరు కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పలుకౌంటర్లు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో కీలక సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా, నిప్టీ 10,900కి పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కంపెనీ కౌంటర్ రికార్డు ధరని(రూ.2231.50) నమోదు చేసింది. దీంతోపాటు హెడ్ఎఫ్సీ బ్యాంకు, అదానీ పోర్ట్, కోటక్ మహీంద్ర, ఎస్ బ్యాంక్ 7శాతానికిపై గా పుంజుకోవడం విశేషం. మరోవైపు సోమవారం ఫలితాలను ప్రకటించిన యాక్సిస్ బ్యాంకు కూడా ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ క్యూ3లో రూ.66కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.20కోట్ల లాభం సాధించగా..ఇప్పుడీ లాభం మూడింతలైనట్లైంది. ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన చూస్తే రూ.795.20కోట్లు ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 26శాతం లభాలను, హెచ్డీఎఫ్ఎసీ లాభం 20శాతం, అదానీ పోర్ట్స్20శాతం, ఎస్‌బ్యాంక్ 22శాతం వార్షిక గ్రోత్‌ను , కోటక్ మహీంద్ర 20శాతం లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.