![Arvind Kejriwal Calls Emergency Meeting Tomorrow Amide Rise Covid Cases - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/21/aravind.jpg.webp?itok=Epx-C6uH)
న్యూఢిల్లీ: పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే తగిన చర్యలు తీసుకునేలా సంసిద్ధం కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూఎస్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్‌లను ట్రాక్ చేసేలా తగిన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష భూషణ్ రాష్ట్రాలకు కేంద్ర పాలితన ప్రాంతాలకు కరోనా విషయమై అప్రమత్తంగా ఉండాలంటూ లేఖ రాశారు. ఆ లేఖలో దేశంలో కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్‌ని గుర్తించగలిగేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టడం ద్వారా సులభంగా బయటపడేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు.
(చదవండి: మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు)
Comments
Please login to add a commentAdd a comment