న్యూఢిల్లీ: పెద్ద నోట్లను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాలు నింగిని తాకుతున్నాయి .గురువారం నాటి మార్కెట్‌లో దేశీయ సూచీలు మెరుపులు మెరిపిస్తున్నాయి. మదుపర్ల భారీ కొనుగోళ‍్ళతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ సూచీ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 9.56 పంజాబ్ నేషనల్ బ్యాంకు 9.19శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.73 శాతం ఎగిశాయి. ఓబీసీ, యూనియన్ బ్యాంక్, సిండికేట్, అలహాబాద్ బ్యాంక్ కూడా ఇదే బాటలో పురోగమిస్తున్నాయి. అలాగే కెనరా బ్యాంక్ 7 శాతం, ఐసీఐసీఐ 6 శాతం, హెడ్‌డీఎఫ్‌సీ, 2 శాతం జంప్ చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కువ డిపాజిట్లు, ముఖ్యంగా తక్కువ ధర డిపాజిట్ల నమోదుతో బ్యాంకుల లాభాలు కొనసాగనున్నాయని కోటక్ సెక్యూరిటీస్ సీఈవో కమేలేశ్ రావు అభిప్రాయపడ్డారు. అయితే, రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ సెక్టార్‌లోని బ్యాంకుల ఆస్తులపై అధిక ఒత్తిడి తప్పదని తెలిపారు. ప్రభుత్వ చర్యతో ద్రవ్యోల్బణం కట్టడవుతుందని, తద్వారా వడ్డీ రేట్లు తగ్గేందుకు వీలుచిక్కుతుందని, అంతేకాకుండా డిపాజిట్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు చర్య దోహదపడుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా డొనాల‍్డ్ ట్రంప్ అనూహ్య విజయంతో బుధవారం నాటి భారీ పతనంతో ఆకర్షణీయంగా ఉన్న ధరల్లో మదుపర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో మెటల్ షేర్లతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది.
దూసుకెళ్ళిన ప్రభుత్వ బ్యాంక్ షేర్లు
Published Thu, Nov 10 2016 3:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
Advertisement
Advertisement