సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ల మహాపతనంతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందను క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్‌డౌన్ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 వద్దకు చేరుకుంది. అంతకుముందు 48,832 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 426 పాయింట్ల పతనమై 14200కు దిగువకు చేరింది. దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఆరంభంలో మార్కెట్ల భారీ పతనంతో రూ .5.82 లక్షల కోట్ల మేర క్షీణించడంతో బీఎస్‌ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లోని రూ. 205.71 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 199.89 లక్షలకు కోట్లకు పడిపోయింది. బ్యాంకింగ్, ఆటో తో పాటు అన్న రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఈ పరిణామానికి దారి తీసింది. అయితే ఫార్మ, ఆక్సిజన్ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. (కరోనా సెగ : రుపీ ఢమాల్)
తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ ఎగ్జిక్యూటివ్-విపి రస్మిక్ ఓజా తెలిపారు. కోవిడ్ కేసుల పెరుగుదల, రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు రాబోయే 2-3 నెలలలో మరింత ఎగియనుందనే ఆందోళన, దీంతో పలు రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు, లాక్‌డౌన్ల అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నాయన్నారు. ఇది మన ఎకానమీ వీ షేప్ రికవరీని దెబ్బతీస్తుందనీ, ఆదాయ అంచనాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాటు మరణాల రేట్లు పెరగడం పెట్టుబడిదారులను భయపెట్టిందని టిప్ప్ 2 ట్రేడ్స్‌లో సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ తెలిపారు. సాంకేతికంగా, నిఫ్టీ 14192 కన్నా దిగువన ముగిస్తే మరింత బలహీనం తప్పదన్నారు. (దలాల్ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు)
కాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకటారం గత 24 గంటల్లో 2.73 లక్షల తాజా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 1,619 కొత్త మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులకుసంబంధించి ఇండియా ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్‌డౌన్)
Comments
Please login to add a commentAdd a comment