investors concerns
-
లాక్డౌన్ గుబులు: సుమారు 6 లక్షల కోట్లు సంపద ఆవిరి
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ల మహాపతనంతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందను క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్డౌన్ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 వద్దకు చేరుకుంది. అంతకుముందు 48,832 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 426 పాయింట్ల పతనమై 14200కు దిగువకు చేరింది. దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఆరంభంలో మార్కెట్ల భారీ పతనంతో రూ .5.82 లక్షల కోట్ల మేర క్షీణించడంతో బీఎస్ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లోని రూ. 205.71 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 199.89 లక్షలకు కోట్లకు పడిపోయింది. బ్యాంకింగ్, ఆటో తో పాటు అన్న రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఈ పరిణామానికి దారి తీసింది. అయితే ఫార్మ, ఆక్సిజన్ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. (కరోనా సెగ : రుపీ ఢమాల్) తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ ఎగ్జిక్యూటివ్-విపి రస్మిక్ ఓజా తెలిపారు. కోవిడ్ కేసుల పెరుగుదల, రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు రాబోయే 2-3 నెలలలో మరింత ఎగియనుందనే ఆందోళన, దీంతో పలు రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు, లాక్డౌన్ల అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నాయన్నారు. ఇది మన ఎకానమీ వీ షేప్ రికవరీని దెబ్బతీస్తుందనీ, ఆదాయ అంచనాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాటు మరణాల రేట్లు పెరగడం పెట్టుబడిదారులను భయపెట్టిందని టిప్ప్ 2 ట్రేడ్స్‌లో సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ తెలిపారు. సాంకేతికంగా, నిఫ్టీ 14192 కన్నా దిగువన ముగిస్తే మరింత బలహీనం తప్పదన్నారు. (దలాల్ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు) కాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకటారం గత 24 గంటల్లో 2.73 లక్షల తాజా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 1,619 కొత్త మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులకుసంబంధించి ఇండియా ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్) -
స్లో రికవరీకే ఛాన్సులెక్కువ!
షేర్లలాంటి రిస్క్ ఎక్కువుండే అసెట్స్‌పై మదుపరులు బేరిష్‌గా ఉంటారని, దీంతో మార్కెట్లలో, ఎకానమీలో రికవరీ చాలా మందకొడిగా వస్తుందని బోఫాఎంఎల్ అంచనా వేసింది. కరోనా వైరస్ మరోదఫా ఉధృతి చూపే రిస్కులున్నందున ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారని బోఫా సర్వేలో తేలింది. మార్చి కనిష్ఠాల నుంచి ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు కూడా కొంతమేర కోలుకున్న సంగతి తెలిసిందే. ఎకానమీలో రికవరీ వేగంగా ఉంటుందన్న అంచనాలు ఈ పుల్‌బ్యాక్‌కు దోహదం చేశాయి. కానీ తాజాగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతూనే ఉండడం, ఆంక్షలు సడలిస్తే సంక్షోభం ముదరడం వంటివి ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లుజల్లాయి. కరోనా సెకండ్‌వేవ్ వస్తుందన్న భయమే అతిపెద్ద రిస్కని సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. సంక్షోభానంతరం U ఆకారపు లేదా W రికవరీ ఉంటుందని సర్వేలో 75 శాతం మంది అంచనా వేయగా, కేవలం 10 శాతం మంది మాత్రమే V ఆకార రికవరీకి ఛాన్సులున్నాయని భావించారు. మిగిలినవాళ్లు ఎటూ చెప్పలేమన్నారు. రికవరీలో మందగమనం, లేదా వృద్ధి కొంత పురోగమించి తిరిగి నేలచూపులు చూసి అనంతరం రికవరీ చెందడాన్ని వరుసగా యూ, డబ్ల్యు ఆకార రికవరీలంటారు. సంక్షోభ నేపథ్యంలో ప్రజల వద్ద నగదు నిల్వలు 5.7 శాతానికి ఎగబాకినట్లు సర్వేలో తేలింది. ఇన్వెస్టర్లు హడావుడిగా పెట్టుబడులు పెట్టేకన్నా నగదు చేతిలో ఉంచుకొని వేచిచూసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని బోఫా పేర్కొంది. ఈ సర్వే యూఎస్ మార్కెట్లను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని చేసినా, ఫలితాలు అన్ని దేశాలకు వర్తించేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
ఎక్స్చేంజ్ ఫౌండర్ కన్నుమూత : వందల కోట్లు గోవిందా?
కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్ గెరాల్డ్ కాటన్ ఆకస్మిక మరణం లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫాంసంబంధించిన పాస్వర్డ్లు, రికవరీ కీ తదితర ముఖ్యమైన సమాచారం కేవలం గెరాల్డ్‌కు మాత్రమే య తెలుసు. కానీ గత ఏడాది డిసెంబరులో ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. పాస్వర్డ్, రికవరీ కీ మరెవ్వరికీ తెలియకపోవడంతో, దాదాపు 187 మిలియన్ల కెనడా డాలర్లు( రూ.982 కోట్లు) ఫ్రీజ్ అయిపోయాయి. దీనికి ఈ గండంనుంచి గట్టెక్కేందుకు టెక్ నిపుణులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో సంస్థలో ఇతర అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు గెరాల్డ్ ఎలా చనిపోయాడు? నిజంగా చనిపోయాడా లేదా కంపెనీ మోసం చేస్తోందా లాంటి పలు అనుమానాలు, ప్రశ్నలతో ఆన్లైన్ దుమారం రేగింది. అంతేకాదు గెరాల్డ్ భార్య జెన్నిఫర్ రాబర్ట్‌సన్‌కు వేధింపులు, బెదిరింపులు తీవ్ర మయ్యాయి. దీంతో వీటిని నుంచి తనకూ, కంపెనీకి రక్షణ కల్పించాల్సిందిగా ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో బిట్‌కాయిన్, లైట్‌కాయిన్, ఎథిరియం లాంటి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం క్వాడ్రిగా సీఎక్స్ ఎక్స్చేంజ్కు నోవా స్కోటియా ఉన్నత న్యాయస్థానం దివాలా రక్షణను మంజూరు చేసింది. ఈ వేదికపై కరెన్సీ ట్రేడింగ్ కూడా నిలిపివేసింది. కేవలం అతనికి మాత్రమే తెలిసిన పాస్వర్డ్లు ఎక్కడా రాసిపెట్టలేదని, దీంతో వాటిని కనుక్కోవడం చాలా కష్టంగా మారిందంటూ కంపెనీ తరపున జెన్నిఫర్ రాబర్ట్సన్ అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే గెరాల్డ్ సెల్ ఫోన్లు, ఇతర కంప్యూటర్లలోని సమాచారం కోసం సంబంధిత ఎన్క్రిప్షన్లను ఛేదించడానికి నిపుణులతో ప్రయత్నిస్తున్నామనీ, కానీ ఫలితం లభించలేదన్నారు. క్వాడ్రిగాలో 363,000 యూజర్లు నమోదుగాకా, సుమారు లక్షా పదిహేను వేల మందియూజర్లకు 250 మిలియన్ల కెనడా డాలర్లు రుణపడి ఉన్నామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాబర్ట్సన్ పేర్కొన్నారు. అటు ఇన్వెస్టర్లు కూడా ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధ పడుతున్నారు. కాగా ఇండియాలో ఒక అనాధాశ్రయానికి సేవలందిస్తున్న క్రమంలో గెరాల్డ్ కాటన్ డిసంబరు 9న చనిపోయారని జనవరి 14న సోషల్ మీడియా ద్వారా కంపెనీ ప్రకటించింది. -
బంగారం, క్రూడ్ ధరలు రయ్...
న్యూయార్క్/ముంబై: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో బంగారం, వెండి, చమురు ధరలకు రెక్కలొచ్చాయి. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ కమోడిటీ డివిజన్లో ఔన్స్(31.1గ్రా) బంగారం ధర సోమవారం రాత్రి క్రితం ముగింపుతో పోల్చితే 33 డాలర్లు(2.5%) ఎగసి 1,354 డాలర్లకు చేరింది. ఇది 4 నెలల గరిష్ట స్థాయి. వెండి కూడా1.66% ఎగసి 22 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. దేశీయంగా: కాగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా కనబడుతోంది. సోమవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్ 10 గ్రాముల బంగారం ధర 1.5 శాతానికి పైగా ఎగసి రూ. 30,573 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర కూడా 2 శాతానికి పైగా ఎగసి, రూ.47,300 వద్ద ట్రేడవుతోంది. బంగారం, వెండి ధరలు ఇదే రీతిలో ముగిస్తే, మంగళవారం స్పాట్ మార్కెట్లో (రూపాయి కదలికలకు లోబడి) ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. క్రూడ్ ఇలా: నెమైక్స్‌లో లైట్ స్వీట్ బ్యారల్ ధర కడపటి సమాచారం అందే సరికి శుక్రవారం ముగింపు ధరతో పోల్చితే 2 శాతానికి పైగా ఎగసి 105 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ అయిల్ ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి 112 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.