టాటా గ్రూపు సంస్థ , హైదరాబాద్ ఆధారిత జీవీకే, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ల జాయింట్ వెంచర్ సంస్థ అయిన తాజ్ జీవీకే హోటల్స్ & రిసార్ట్స్ ను ఇండియన్ హోటల్స్ విలీనం చేసుకోనుందట. తాజ్ జీవీకే పూర్తి స్వాధీనానికి ఇండియన్ హోటల్స్ సిద్ధపడుతున్నట్టు వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకు రెండు సంస్థల యాజమాన్యాల మధ్య చర్చలు సాగుతున్నట్లు వార్తలు వెలువెడుతున్నాయి. ఈ విలీనానాకి సంబంధించిన స్వాప్ రేషియోపై ఇండియన్ హోటల్స్, జీవీకే రెడ్డి సంస్థలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ విలీన ప్రతిపాదన ఓకే అయినా ...తాజ్ జీవీకేను ప్రత్యేక కంపెనీగా లిస్టింగ్ కొనసాగించే వీలున్నట్లు సమాచారం.
అయితే జూన్ 30, 2016 నాటికి తాజ్ జీవీకేలో జీవీకే గ్రూప్ 50 శాతం వాటాను, ఇండియన్ హెటల్స్ కంపెనీ 25.52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వార్తలతో తాజ్ జీవీకే హోటల్స్ & రిసార్ట్స్ షేర్ దాదాపు 20 శాతం ర్యాలీ అయింది బీఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది. ఇండియన్ హోటల్స్ షేరు కూడా లాభాల బాటపట్టింది.
మరోవైపు ఈ వార్తలపై ఇండియన్ హోటల్స్ ను కంపనీని వివరణ కోరినట్టు బీఎస్ ఈ తెలిపింది. ఇండియన్ హోటల్స్ యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇండియన్ హోటల్స్ లో తాజ్ జీవీకే విలీనం?
Published Fri, Aug 19 2016 1:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
Advertisement
Advertisement