Indian Hotels
-
లాభాల్లో దూసుకెళ్లిన టాటా గ్రూప్ కంపెనీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం మూడు రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది.విమానయాన, సంస్థాగత కేటరింగ్ సేవల విభాగం ‘తాజ్‌శాట్స్’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,433 కోట్ల నుంచి రూ.1,826 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం రూ.1,249 కోట్ల నుంచి రూ.1,502 కోట్లకు పెరిగాయి.‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ త్రైమాసికంలో డిమాండ్ బలంగా పుంజుకుంది. దీంతో ఆదాయం 28 శాతం పెరిగింది. హోటల్ విభాగంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెందింది. దీంతో క్యూ2లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎబిట్డా మార్జిన్ 29.9 శాతం నమోదైంది’’అని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ తెలిపారు. 2024–25 సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని ల్యాండ్‌మార్క్ హోటల్ ‘క్లారిడ్జ్’ను 2025 ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు. -
ఇండియన్ హోటల్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్‌చేసి రూ. 167 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 122 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,258 కోట్ల నుంచి రూ. 1,481 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,101 కోట్ల నుంచి రూ. 1,249 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో కొత్తగా 8 హోటళ్లను తెరవడంతోపాటు.. మరో 17 ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చాట్వల్ పేర్కొన్నారు. అనుబంధ సంస్థ పియమ్ హోటల్స్‌లో న్యూ వెర్నాన్ ప్రయివేట్ నుంచి 6.8 శాతం వాటాకు సమానమైన 2.59 లక్షల ఈక్విటీ షేర్లను షేర్ల స్వాప్, నగదు ద్వారా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
మిస్త్రీకి ఇండియన్ హోటల్స్ దన్ను!
• ఆయన నాయకత్వమే బాగుందన్న డెరైక్టర్లు • చైర్మన్‌గా కొనసాగింపునకు సంపూర్ణ మద్దతు ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవిని కోల్పోరుున సైరస్ మిస్త్రీకి పెద్ద ఊరట లభించింది. గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) డెరైక్టర్ల బోర్డు... చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నాయకత్వానికి, చైర్మన్‌గా ఆయన్ను కొనసాగిం చేందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు ప్రత్యేకంగా సమావేశమై మిస్త్రీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నట్టు ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయానికి కంపెనీలోని మిగిలిన డెరైక్టర్లు సైతం మద్దతిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపారుు. కాగా, ఈ విషయమై స్వతంత్ర డెరైక్టర్ల అభిప్రాయాలను ఐహెచ్‌సీఎల్ బీఎస్ఈకి తెలియజేసింది. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్స చైర్మన్‌గా మిస్త్రీ ఉద్వాసనకు గురైనా... గ్రూపులోని కొన్ని కంపెనీలకు ఇప్పటికీ ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో రతన్‌టాటా ఆధ్వర్యంలోని యాజమాన్యం గ్రూపు కంపెనీల నుంచీ మిస్త్రీని తొలగించాలని చూస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర డెరైక్టర్ల భేటీ...:ఐహెచ్‌సీఎల్ బోర్డు సమావేశం సైరస్ మిస్త్రీ అధ్యక్షతన శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను ఆమోదించారు. దీనికంటే ముందు కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు అరుున బ్యాంకర్ దీపక్ పరేఖ్, నాదిర్ గోద్రెజ్, గౌతం బెనర్జీ, కేకీ దాదిసేత్, విభా రిషీపౌల్, ఇరీనా విట్టల్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే వారు మిస్త్రీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలికారు. ముంబైలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్’లో శుక్రవారం ఇండియన్ హోటల్స్ కంపెనీ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టాటా సన్స చైర్మన్‌గా తొలగించిన సైరస్ మిస్త్రీ ఆయన సోదరడు షాపూర్ మిస్త్రీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన ఫోటో జర్నలిస్టులపై బాంబే హౌస్ భద్రతా సిబ్బంది దాడిచేశారు. కిందపడేసి కొట్టారు. అప్పటి చిత్రాలే ఇవి. జరిగిన ఘటనపై టాటా గ్రూప్ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. నానోపై పెట్టుబడిలో చాలా వరకు నష్టపోయాం.. నిజాన్ని ఒప్పుకున్న టాటా మోటార్స్ న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ ఆరోపణలు నిజమేనని తేలింది. నానో విషయంలో ఇప్పటిదాకా గుంభనంగా ఉన్న టాటా మోటార్స్... దీనిపై పెట్టిన పెట్టుబడుల్లో చాలా వరకూ నష్టపోరుునట్లు అంగీకరించింది. నానో కారు అభివృద్ది కోసం చేసిన వ్యయం, సంబంధిత ప్రాజెక్టుపై చేసిన పెట్టుబడుల్లో చాలా వరకు నష్టపోయామని, చాలా నష్టాల్ని కొన్నేళ్లుగా కంపెనీ ఖాతాల్లో చూపించామని సంస్థ తెలియజేసింది. వీటిని రైటాఫ్ చేసినట్లు వెల్లడించింది. ప్యాసింజర్ కార్లకు సంబంధించి తమ విధానాన్ని సమీక్షించుకుంటామని ప్రకటించింది. నానో కారు గుదిబండలా తయారైం దని, దానివల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అరుుతే, రతన్ టాటా కలల ప్రాజెక్టు కావడంతో కొనసాగించాల్సి వచ్చిందంటూ గ్రూపు మాజీ చైర్మన్ మిస్త్రీ ఆరోపించటం తెలిసిందే. -
టాటాలకు సెబీ షాక్
ముంబై: మిస్త్రీ పేల్చిన బాంబుతో వరుసగా మూడో రోజు కూడా టాటా షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ముఖ్యంగా రతన్ టాటాతోపాటు, గ్రూప్ కార్యకలాపాలపై సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శల నేపథ్యంలో టాటా గ్రూపు షేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతుండటంతో ఇండియన్ హోటల్స్ కౌంటర్ ఏకంగా 13 శాతానికిపైగా పతనమైంది. ఈ బాటలో టాటా పవర్, టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్ టాటా గ్లోబల్ బెవరేజెస్ , టాటా కాఫీ , టాటా ఇన్వెస్ట్మెంట్ , టాటా టెలీ సర్వీసెస్, కౌంటర్లలో అమ్మకాలు జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో కనిష్ట స్థాయికి దిగజారాయి. ఇప్పటికే భారీ నష్టాలను మూటగట్టుకున్నటాటా గ్రూప్ మార్కెట్ విలువ తాజా నష్టాలతో సుమారు రూ. 40,000 కోట్లమేరకు చేరింది. మరోవైపు ఈవ్యవహారంపై మార్కెట్లు రెగ్యులేటర్ సెబీ రంగంలోకి దిగింది. కార్పొరేట్ పాలన నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఒకవేళ గతంలో ఏదైనా మొత్తాన్ని రద్దు చేసుంటే, వాటి పూర్తి వివరాలు తెలియజేయాలని, ఆ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలియజేయకుండా లావాదేవీలు జరిపివుంటే వాటి వివరాలు ఇవ్వాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆదేశించింది. కాగా వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ సుమారు రూ. 1.18 లక్షల కోట్లు (18 బిలియన్ డాలర్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ రాసిన లేఖతో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. -
ఇండియన్ హోటల్స్ లో తాజ్ జీవీకే విలీనం?
టాటా గ్రూపు సంస్థ , హైదరాబాద్ ఆధారిత జీవీకే, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ల జాయింట్ వెంచర్ సంస్థ అయిన తాజ్ జీవీకే హోటల్స్ & రిసార్ట్స్ ను ఇండియన్ హోటల్స్ విలీనం చేసుకోనుందట. తాజ్ జీవీకే పూర్తి స్వాధీనానికి ఇండియన్ హోటల్స్ సిద్ధపడుతున్నట్టు వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందుకు రెండు సంస్థల యాజమాన్యాల మధ్య చర్చలు సాగుతున్నట్లు వార్తలు వెలువెడుతున్నాయి. ఈ విలీనానాకి సంబంధించిన స్వాప్ రేషియోపై ఇండియన్ హోటల్స్, జీవీకే రెడ్డి సంస్థలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ విలీన ప్రతిపాదన ఓకే అయినా ...తాజ్ జీవీకేను ప్రత్యేక కంపెనీగా లిస్టింగ్ కొనసాగించే వీలున్నట్లు సమాచారం. అయితే జూన్ 30, 2016 నాటికి తాజ్ జీవీకేలో జీవీకే గ్రూప్ 50 శాతం వాటాను, ఇండియన్ హెటల్స్ కంపెనీ 25.52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వార్తలతో తాజ్ జీవీకే హోటల్స్ & రిసార్ట్స్ షేర్ దాదాపు 20 శాతం ర్యాలీ అయింది బీఎస్ఈలో 20 శాతం అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది. ఇండియన్ హోటల్స్ షేరు కూడా లాభాల బాటపట్టింది. మరోవైపు ఈ వార్తలపై ఇండియన్ హోటల్స్ ను కంపనీని వివరణ కోరినట్టు బీఎస్ ఈ తెలిపింది. ఇండియన్ హోటల్స్ యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది. -
బెల్మండ్ లో కొంత వాటా విక్రయం: ఇండియన్ హోటల్స్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ బెల్మండ్ సంస్థలో రూ.82 కోట్ల విలువైన 12.7 లక్షల షేర్లను విక్రయించింది. బెల్మండ్ సంస్థలో ఈ షేర్లను తమ విదేశీ విభాగమైన సంసార ప్రాపర్టీస్ విక్రయించిందని ఇండియన్ హోటల్స్ తెలిపింది. ఈ వాటా విక్రయం ద్వారా లభించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించుకుంటామని పేర్కొంది. బెల్మండ్ సంస్థ 23 దేశాల్లో 46 హోటళ్లను, రివర్ క్రూయిజ్, సఫారి, లగ్జరీ రైల్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ షేర్ల విక్రయానంతరం బెల్మండ్ సంస్థలో సంసార ప్రాపర్టీస్‌కు 5.73 శాతం వాటా ఉంటుంది.