మిస్త్రీకి ఇండియన్ హోటల్స్ దన్ను!
• ఆయన నాయకత్వమే బాగుందన్న డెరైక్టర్లు
• చైర్మన్‌గా కొనసాగింపునకు సంపూర్ణ మద్దతు
ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవిని కోల్పోరుున సైరస్ మిస్త్రీకి పెద్ద ఊరట లభించింది. గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) డెరైక్టర్ల బోర్డు... చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నాయకత్వానికి, చైర్మన్‌గా ఆయన్ను కొనసాగిం చేందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు ప్రత్యేకంగా సమావేశమై మిస్త్రీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నట్టు ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయానికి కంపెనీలోని మిగిలిన డెరైక్టర్లు సైతం మద్దతిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపారుు.
కాగా, ఈ విషయమై స్వతంత్ర డెరైక్టర్ల అభిప్రాయాలను ఐహెచ్‌సీఎల్ బీఎస్‌ఈకి తెలియజేసింది. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్‌స చైర్మన్‌గా మిస్త్రీ ఉద్వాసనకు గురైనా... గ్రూపులోని కొన్ని కంపెనీలకు ఇప్పటికీ ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో రతన్‌టాటా ఆధ్వర్యంలోని యాజమాన్యం గ్రూపు కంపెనీల నుంచీ మిస్త్రీని తొలగించాలని చూస్తున్న విషయం తెలిసిందే.
స్వతంత్ర డెరైక్టర్ల భేటీ...:ఐహెచ్‌సీఎల్ బోర్డు సమావేశం సైరస్ మిస్త్రీ అధ్యక్షతన శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను ఆమోదించారు. దీనికంటే ముందు కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు అరుున బ్యాంకర్ దీపక్ పరేఖ్, నాదిర్ గోద్రెజ్, గౌతం బెనర్జీ, కేకీ దాదిసేత్, విభా రిషీపౌల్, ఇరీనా విట్టల్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే వారు మిస్త్రీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలికారు.
ముంబైలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్’లో శుక్రవారం ఇండియన్ హోటల్స్ కంపెనీ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టాటా సన్‌స చైర్మన్‌గా తొలగించిన సైరస్ మిస్త్రీ ఆయన సోదరడు షాపూర్ మిస్త్రీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన ఫోటో జర్నలిస్టులపై బాంబే హౌస్ భద్రతా సిబ్బంది దాడిచేశారు. కిందపడేసి కొట్టారు. అప్పటి చిత్రాలే ఇవి. జరిగిన ఘటనపై టాటా గ్రూప్ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు.
నానోపై పెట్టుబడిలో చాలా వరకు నష్టపోయాం.. నిజాన్ని ఒప్పుకున్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ ఆరోపణలు నిజమేనని తేలింది. నానో విషయంలో ఇప్పటిదాకా గుంభనంగా ఉన్న టాటా మోటార్స్... దీనిపై పెట్టిన పెట్టుబడుల్లో చాలా వరకూ నష్టపోరుునట్లు అంగీకరించింది. నానో కారు అభివృద్ది కోసం చేసిన వ్యయం, సంబంధిత ప్రాజెక్టుపై చేసిన పెట్టుబడుల్లో చాలా వరకు నష్టపోయామని, చాలా నష్టాల్ని కొన్నేళ్లుగా కంపెనీ ఖాతాల్లో చూపించామని సంస్థ తెలియజేసింది. వీటిని రైటాఫ్ చేసినట్లు వెల్లడించింది. ప్యాసింజర్ కార్లకు సంబంధించి తమ విధానాన్ని సమీక్షించుకుంటామని ప్రకటించింది. నానో కారు గుదిబండలా తయారైం దని, దానివల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అరుుతే, రతన్ టాటా కలల ప్రాజెక్టు కావడంతో కొనసాగించాల్సి వచ్చిందంటూ గ్రూపు మాజీ చైర్మన్ మిస్త్రీ ఆరోపించటం తెలిసిందే.