IHCL
-
తాజ్ హోటల్స్‌పై సైబర్ అటాక్ - ప్రమాదంలో 15 లక్షల మంది డేటా!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ 'ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా'(ఐసీబీసీ) మీద జరిగిన సైబర్ దాడి మరువకముందే.. టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 2023 నవంబర్ 5న తాజ్ హోటల్ గ్రూప్‌పై సైబర్ అటాక్ జరిగినట్లు, తాజ్ హోటల్‌కు చెందిన సుమారు 15 లక్షల మంది డేటాను హ్యాక్ చేసినట్లు తెలిసింది. నిందితులు ఈ డేటాను తిరిగి ఇవ్వాలంటే 5000 డాలర్లు డిమాండ్ చేస్తూ కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని.. దీనిపైనా సమగ్ర పరిశీలను జరుగుతోందని, డేటా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. Dnacookies అనే పేరుతో హ్యాకర్లు కస్టమర్ల డేటాను హ్యాక్ చేసినట్లు, ఇప్పటికి ఈ డేటాను ఎవరికీ ఇవ్వలేదని వెల్లడించారు. కస్టమర్ ఐడీ, అడ్రస్ వంటి ఇతర వ్యక్తిగత సమాచారాలను వారు హ్యాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కస్టమర్ డేటా 2014 నుంచి 2020 వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. ఈ సంఘటనపై ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్) ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అధికారులకు కూడా ఇప్పటికే తెలియజేసినట్లు స్పష్టం చేశారు. -
జింజర్..పవర్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్
‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం! ఏమిటి జింజర్? ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్‌కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్సిఎల్ సీయివో పునీత్ చత్వాల్. ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది. కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు. అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది. స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. 371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. -
ఆరేళ్ల తర్వాత లాభాల బాట
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) ప్రస్తుత ఏడాదిలో 8 నూతన హోటళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆరేళ్ల తరవాత 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మళ్లీ లాభాల బాట పట్టిందని వ్యాఖ్యానించిన చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. ఇక్కడ నుంచి వృద్ధిరేటు కొనసాగుతుందని, వచ్చే ఐదేళ్లలో ఆదాయం 30 శాతం వృద్ధిని సాధించాలనే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 8– 10% వృద్ధితో ఉన్నట్లు కంపెనీ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. ‘3ఆర్’ వ్యూహంలో భాగంగా నిర్మాణం, ఇంజినీరింగ్, ప్రణాళికలను పున:సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యూహం వల్ల నిర్వహణ మార్జిన్లు 800 బేసిస్ పాయింట్లు వృద్ధిచెందుతుందని అంచనావేశారు. జనాభా గణాంకాల అధ్యయనం సానుకూలంగా ఉందని వెల్లడించారు. మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరగడం వల్ల వీరు చేస్తున్న ఖర్చులు కూడా పెరుగుతున్నాయనే అంశం హోటల్స్ పరిశ్రమకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘తాజ్ వివాంత, జింజర్ బ్రాండ్లతో పాటు ’సెలక్షన్’ పేరుతో కొనసాగుతున్న వ్యాపారం కూడా పుంజుకుంటోంది. ప్రయాణ, పర్యాటక రంగం ఏడాదికి 6.9 శాతం వృద్ధి చెందుతోంది. ప్రభుత్వం చేపట్టిన ’ఈ–వీసా’ స్కీమ్, విమానయాన రంగం అభివృద్ధి చెందుతున్న అంశాల నేపథ్యంలో ఆతిథ్య రంగం సైతం వృద్ధిబాట పట్టింది. ఇంతటి సానుకూల అంశాల మధ్య హోటల్ ఇండస్ట్రీ అక్యుపెన్సీ పెరిగి సగటు గదుల ఆదాయంలో వృద్ధిరేటు పెరుగుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని చంద్రశేఖరన్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.101 కోట్లు నికర లాభం సాధించినట్లు తెలిపిన ఆయన రూ.4,165 కోట్లు ఆదాయం సాధించామని, ఈ క్రమంలో కంపెనీ అప్పులు రూ.5,800 కోట్ల నుంచి రూ.2,400 కోట్లకు తగ్గాయని వివరించారు. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగింపు సమయానికి ఐహెచ్‌సీఎల్ షేరు ధర రూ.0.90 (0.70 శాతం) తగ్గి రూ.128.25 వద్ద ముగిసింది. -
‘మక్కా’లో తొలి తాజ్ హోటల్!
ముంబై: తాజ్ బ్రాండ్ కింద లగ్జరీ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) సౌదీ అరేబియాలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ముస్లింలు పవిత్రంగా భావించే, మహమ్మద్ ప్రవక్త జన్మ స్థలమైన మక్కా నగరంలో తొలి హోటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దీని కోసం ఉమ్ అల్ ఖురా డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐహెచ్‌సీఎల్ తెలిపింది. కాగా మక్కాలోని ఒకానొక అతిపెద్ద, కీలక అర్బన్ రెజువనేషన్ ప్రాజెక్ట్ అయిన కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్ ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటైన జాయింట్ స్టాక్ కంపెనీయే ఉమ్ అల్ ఖురా డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. ఇక మక్కాలోని తాజ్ హోటల్‌ను 2023 జనవరిలో ప్రారంభిస్తామని ఐహెచ్‌సీఎల్ పేర్కొంది. ‘సౌదీలో తొలి తాజ్ హోటల్‌ను ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉంది. మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికాలో విస్తరణకు కట్టుబడ్డాం. ఈ ప్రాంతంలో తాజా హోటల్ మాకు నాలుగో వెంచర్’ అని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈఓ పునీత్ చత్వాల్ తెలిపారు. వచ్చే 12–18 నెలల్లో దుబాయ్‌లో రెండు హోటళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఐహెచ్‌సీఎల్ అంతర్జాతీయంగా 11 దేశాల్లో, 72 ప్రాంతాల్లో 145 హోటళ్లను నిర్వహిస్తోంది. -
మిస్త్రీకి ఇండియన్ హోటల్స్ దన్ను!
• ఆయన నాయకత్వమే బాగుందన్న డెరైక్టర్లు • చైర్మన్‌గా కొనసాగింపునకు సంపూర్ణ మద్దతు ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవిని కోల్పోరుున సైరస్ మిస్త్రీకి పెద్ద ఊరట లభించింది. గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) డెరైక్టర్ల బోర్డు... చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నాయకత్వానికి, చైర్మన్‌గా ఆయన్ను కొనసాగిం చేందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు ప్రత్యేకంగా సమావేశమై మిస్త్రీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నట్టు ఏకగ్రీవంగా నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయానికి కంపెనీలోని మిగిలిన డెరైక్టర్లు సైతం మద్దతిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపారుు. కాగా, ఈ విషయమై స్వతంత్ర డెరైక్టర్ల అభిప్రాయాలను ఐహెచ్‌సీఎల్ బీఎస్ఈకి తెలియజేసింది. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్స చైర్మన్‌గా మిస్త్రీ ఉద్వాసనకు గురైనా... గ్రూపులోని కొన్ని కంపెనీలకు ఇప్పటికీ ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో రతన్‌టాటా ఆధ్వర్యంలోని యాజమాన్యం గ్రూపు కంపెనీల నుంచీ మిస్త్రీని తొలగించాలని చూస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర డెరైక్టర్ల భేటీ...:ఐహెచ్‌సీఎల్ బోర్డు సమావేశం సైరస్ మిస్త్రీ అధ్యక్షతన శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను ఆమోదించారు. దీనికంటే ముందు కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు అరుున బ్యాంకర్ దీపక్ పరేఖ్, నాదిర్ గోద్రెజ్, గౌతం బెనర్జీ, కేకీ దాదిసేత్, విభా రిషీపౌల్, ఇరీనా విట్టల్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే వారు మిస్త్రీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలికారు. ముంబైలో టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్’లో శుక్రవారం ఇండియన్ హోటల్స్ కంపెనీ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టాటా సన్స చైర్మన్‌గా తొలగించిన సైరస్ మిస్త్రీ ఆయన సోదరడు షాపూర్ మిస్త్రీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన ఫోటో జర్నలిస్టులపై బాంబే హౌస్ భద్రతా సిబ్బంది దాడిచేశారు. కిందపడేసి కొట్టారు. అప్పటి చిత్రాలే ఇవి. జరిగిన ఘటనపై టాటా గ్రూప్ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. నానోపై పెట్టుబడిలో చాలా వరకు నష్టపోయాం.. నిజాన్ని ఒప్పుకున్న టాటా మోటార్స్ న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ ఆరోపణలు నిజమేనని తేలింది. నానో విషయంలో ఇప్పటిదాకా గుంభనంగా ఉన్న టాటా మోటార్స్... దీనిపై పెట్టిన పెట్టుబడుల్లో చాలా వరకూ నష్టపోరుునట్లు అంగీకరించింది. నానో కారు అభివృద్ది కోసం చేసిన వ్యయం, సంబంధిత ప్రాజెక్టుపై చేసిన పెట్టుబడుల్లో చాలా వరకు నష్టపోయామని, చాలా నష్టాల్ని కొన్నేళ్లుగా కంపెనీ ఖాతాల్లో చూపించామని సంస్థ తెలియజేసింది. వీటిని రైటాఫ్ చేసినట్లు వెల్లడించింది. ప్యాసింజర్ కార్లకు సంబంధించి తమ విధానాన్ని సమీక్షించుకుంటామని ప్రకటించింది. నానో కారు గుదిబండలా తయారైం దని, దానివల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అరుుతే, రతన్ టాటా కలల ప్రాజెక్టు కావడంతో కొనసాగించాల్సి వచ్చిందంటూ గ్రూపు మాజీ చైర్మన్ మిస్త్రీ ఆరోపించటం తెలిసిందే.