న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్‌లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్‌చేసి రూ. 167 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 122 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,258 కోట్ల నుంచి రూ. 1,481 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,101 కోట్ల నుంచి రూ. 1,249 కోట్లకు పెరిగాయి.
ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో కొత్తగా 8 హోటళ్లను తెరవడంతోపాటు.. మరో 17 ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చాట్వల్ పేర్కొన్నారు. అనుబంధ సంస్థ పియమ్ హోటల్స్‌లో న్యూ వెర్నాన్ ప్రయివేట్ నుంచి 6.8 శాతం వాటాకు సమానమైన 2.59 లక్షల ఈక్విటీ షేర్లను షేర్ల స్వాప్, నగదు ద్వారా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment