బెల్మండ్ లో కొంత వాటా విక్రయం: ఇండియన్ హోటల్స్ | Belmand some stake sale in Indian hotels | Sakshi
Sakshi News home page

బెల్మండ్ లో కొంత వాటా విక్రయం: ఇండియన్ హోటల్స్

Published Sat, Feb 27 2016 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

బెల్మండ్ లో కొంత వాటా విక్రయం: ఇండియన్ హోటల్స్

బెల్మండ్ లో కొంత వాటా విక్రయం: ఇండియన్ హోటల్స్

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ బెల్‌మండ్ సంస్థలో రూ.82 కోట్ల విలువైన 12.7 లక్షల షేర్లను విక్రయించింది. బెల్‌మండ్ సంస్థలో ఈ షేర్లను తమ విదేశీ విభాగమైన సంసార ప్రాపర్టీస్ విక్రయించిందని ఇండియన్ హోటల్స్ తెలిపింది. ఈ వాటా విక్రయం ద్వారా లభించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించుకుంటామని పేర్కొంది. బెల్‌మండ్ సంస్థ 23 దేశాల్లో 46 హోటళ్లను, రివర్ క్రూయిజ్, సఫారి, లగ్జరీ రైల్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ షేర్ల విక్రయానంతరం బెల్‌మండ్ సంస్థలో సంసార ప్రాపర్టీస్‌కు 5.73 శాతం వాటా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement