సాక్షి, ముంబై: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దలాల్ స్ట్రీట్‌లో సరికొత్త వెలుగులు నింపారు. కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో దేశీ స్టాక్‌మార్కెట్ల చరిత్రలో లేని లాభాలకు కారణమయ్యారు. గత పదేళ్ల కాలంలోలేని విధంగా కీలక సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లపైగా దూసుకెళ్లింది. సెన్సెక్స్ 1992 పాయింట్లు దూసుకెళ్లి 38వేలకు ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. నిఫ్టీది కూడా ఇటే బాట 600 పాయింట్లకుపైగా ఎగిసి 11,300 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఒక్క గంటలోనే దేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)కు రూ. 5 లక్షల కోట్లు జమ అయ్యాయంటేనే మార్కెట్ల జోరు తెలుసుకోవచ్చు. లాభాల్లో రికార్డుమోత మోగిస్తోంది.ఒకరోజులో ఇదేఅతిపెద్ద లాభాల నమోదు.
అన్ని రంగాలూ లాభాల మోత మోగిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటో రంగాలు 7.5 శాతం చొప్పున దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, బ్రిటానియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటన్ బాగా లాభపడుతున్నాయి. జీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ స్వల్పంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment