సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులకు తగ్గడం లేదు. తాజాగా కేంద్రం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 1341 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,23,354 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు ఇండియాలో 11,99,37,641 మందికి వ్యాక్సిన్ ను అందించారు. (మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశలోఎకానమీ బెటర్..!)
తెలంగాణా
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా రాష్ట్రంలో 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. ఇందులో 3,11,008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1809 కి చేరింది. మరోవైపు కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన సంగతి తెలిసిందే. (నేటి నుంచి పూర్తిగా కరోనా రోగులకే సేవలు)
మహారాష్ట్ర, ఢిల్లీలో విజృంభణ
మహారాష్ట్రలో కేసుల సంఖ‍్య భారీగా పెరుగుతూ కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రోజువారీ కేసుల నమోదు 63,729 గా ఉంది. దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. కొత్తగా19,486 కరోనా కేసులు నమోదు కాగా, 141 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30 లక్షల మంది మరణించారు. అమెరికా (3.15 కోట్లు) తరువాత రెండవ అత్యధిక ప్రభావిత దేశంగా ఇండియా ఉంది.
వైరస్ అలర్ట్: ఒక్కరోజే 2,34,692 కోవిడ్ కేసులు
Published Sat, Apr 17 2021 10:43 AM | Last Updated on Sat, Apr 17 2021 12:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment