
హైదారాబాద్: వ్యాపార ఆశావాదం మెరుగుపడినట్టు టీఆర్‌ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ ప్రకటించింది. 2023 మూడో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) విషయంలో వ్యాపార ఆశావహం ఎంతో ఎక్కువగా ఉంటుందని తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ అధిక సానుకూలత వ్యక్తమైనట్టు తెలిపింది. టీఆర్‌ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ (ఎండీఐ) 2023 క్యూ2లో 89.37గా ఉంటే క్యూ3 అంచనాలు 92.68 పాయింట్లకు చేరింది. 50కిపైన సానుకూలంగా, 50కి దిగువ ప్రతికూలంగా పరిగణిస్తుంటారు. ఈ ప్రకారం మూడో త్రైమాసికానికి వ్యాపార ఆశావహం ఎంతో మెరుగ్గా ఉంటుందని ఎండీఐ తెలిపింది.
నివేదికలోని అంశాలు..
► కంపెనీలకు సంబంధించి మార్కెటింగ్ బడ్జెట్ గణనీయంగా పెరగొచ్చు. ఇందుకు సంబంధించి సూచీ 8.8 శాతం పెరిగి 85.1 నుంచి 92.6 పాయింట్లకు క్యూ3లో చేరుకోవచ్చు.
► ప్రాంతీయ ప్రింట్ ప్రకటనల వాటా మార్కెటింగ్ బడ్జెట్‌లో అధికంగా ఉంటుంది. అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టైజింగ్ (ఓఓహెచ్) వాటా 11 శాతం, జాతీయ టీవీల ప్రకటనలు, రేడియో ప్రకటనలు చెరో 10 శాతం వాటా ఆక్రమించనున్నాయి.
► లోకల్ టీవీ ప్రకటనలు, ఇంగ్లిష్ ప్రింట్ ప్రకటనల వాటా 9 శాతం, సోషల్ మీడియా ప్రకటనల వాటా 7 శాతం మేర ఉండనుంది. డిజిటల్ సెర్చ్, డిజిటల్ యాడ్ 6 శాతం ఉండొచ్చని ఎండీఐ నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment