హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 36.8 శాతం వృద్ధితో రూ.1.6 లక్షల కోట్లు దాటతాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో మొబైల్స్ వాటా దాదాపు సగ భాగం ఉంటుందని భావిస్తోంది. ‘దేశం నుంచి 2021-22లో రూ.1,16,937 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పలు దేశాలకు సరఫరా అయ్యాయి.
ఇందులో మొబైల్స్ వాటా రూ.45,000 కోట్లు. 2022-23లో ఇది రూ.76,000 కోట్లు దాటుతుంది. 2022 ఏప్రిల్-డిసెంబర్‌లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్స్ విలువ రూ.1,33,313 కోట్లు. ఇందులో మొబైల్స్ వాటా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. 2021 ఏప్రిల్-డిసెంబర్‌లో మొబైల్స్ ఎగుమతులు రూ.27,288 కోట్లు. యూఏఈ, యూఎస్, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి అధికంగా మొబైల్స్ సరఫరా అయ్యాయి’ అని ఐసీఈఏ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment