Economic Survey 2013-14
-
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు : రూ.1.6 లక్షల కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 36.8 శాతం వృద్ధితో రూ.1.6 లక్షల కోట్లు దాటతాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో మొబైల్స్ వాటా దాదాపు సగ భాగం ఉంటుందని భావిస్తోంది. ‘దేశం నుంచి 2021-22లో రూ.1,16,937 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పలు దేశాలకు సరఫరా అయ్యాయి. ఇందులో మొబైల్స్ వాటా రూ.45,000 కోట్లు. 2022-23లో ఇది రూ.76,000 కోట్లు దాటుతుంది. 2022 ఏప్రిల్-డిసెంబర్లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్స్ విలువ రూ.1,33,313 కోట్లు. ఇందులో మొబైల్స్ వాటా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. 2021 ఏప్రిల్-డిసెంబర్లో మొబైల్స్ ఎగుమతులు రూ.27,288 కోట్లు. యూఏఈ, యూఎస్, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి అధికంగా మొబైల్స్ సరఫరా అయ్యాయి’ అని ఐసీఈఏ వివరించింది. -
ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంద్వారా దేశంలో పంపిణీ వ్యవస్థలో రెడ్ టేపిజాన్ని అరికట్టి సామాజిక పథకాల్లో సత్ఫలితాలు సాధించాలని ఆర్థికసర్వే 2013-14 సూచించింది. కేంద్ర ప్రభుత్వ వ్యయంలో సామాజిక సేవల వాటా 2012-13 ఆర్థిక సంవత్సరంలో 11.83 శాతం ఉండగా, 2013-14 సంవత్సరంలో 12.83 శాతానికి చేరిందని పేర్కొంది. అయితే లోపభూయిష్ట పంపిణీ విధానంవల్ల వివిధ పథకాల్లో ఆశించిన ఫలితాలు రావట్లేదని తెలిపింది. దేశంలో అసలైన సవాలు పంపిణీ విధానమేనని అభిప్రాయపడింది. పంపిణీవిధానంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, గవర్నెన్స్‌లో పలు అంచెలను తొలగించడం, సరళమైన విధానాలు, లబ్ధిదారులను భాగస్వాములను చేయడం ద్వారా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచవచ్చ ని పేర్కొంది. సా మాజిక పథకాల్లో ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వాములను చేయడంద్వారా సక్రమంగా, సులువుగా ప్రజలకు చేరువయ్యేలా చేయవచ్చంది. అలాగే అక్రమంగా లబ్ధిపొందుతున్నవారిని కనిపెట్టవచ్చని పేర్కొంది. ‘ఉపాధి హామీ’ పథకంలో లబ్ధిదారుని అకౌంటుకు నేరుగా చెల్లింపులు జరపడాన్ని అందుకు ఉదాహరణగా చూపింది. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇంకా ఎక్కువ సాధించవచ్చని పేర్కొంది. పంచాయతీ రాజ్ సంస్థలకు మరింత సమాచారం, హక్కులు కల్పించడంద్వారా సామాజిక పథకాల పంపిణీని మెరుగుపరచవచ్చని సూచించింది.