ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం | Public distribution system   No technical knowledge required | Sakshi
Sakshi News home page

ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం

Published Thu, Jul 10 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

ప్రజా పంపిణీ వ్యవస్థలో  సాంకేతిక పరిజ్ఞానం అవసరం

ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం

న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంద్వారా దేశంలో పంపిణీ వ్యవస్థలో రెడ్ టేపిజాన్ని అరికట్టి సామాజిక పథకాల్లో సత్ఫలితాలు సాధించాలని ఆర్థికసర్వే 2013-14 సూచించింది. కేంద్ర ప్రభుత్వ వ్యయంలో సామాజిక సేవల వాటా 2012-13 ఆర్థిక సంవత్సరంలో 11.83 శాతం ఉండగా, 2013-14 సంవత్సరంలో 12.83 శాతానికి చేరిందని పేర్కొంది. అయితే లోపభూయిష్ట పంపిణీ విధానంవల్ల వివిధ పథకాల్లో ఆశించిన ఫలితాలు రావట్లేదని తెలిపింది. దేశంలో అసలైన సవాలు పంపిణీ విధానమేనని అభిప్రాయపడింది. పంపిణీవిధానంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, గవర్నెన్స్‌లో పలు అంచెలను తొలగించడం, సరళమైన విధానాలు, లబ్ధిదారులను భాగస్వాములను చేయడం ద్వారా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచవచ్చ ని పేర్కొంది.

సా మాజిక పథకాల్లో ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వాములను చేయడంద్వారా సక్రమంగా, సులువుగా ప్రజలకు చేరువయ్యేలా చేయవచ్చంది.  అలాగే అక్రమంగా లబ్ధిపొందుతున్నవారిని కనిపెట్టవచ్చని పేర్కొంది. ‘ఉపాధి హామీ’ పథకంలో లబ్ధిదారుని అకౌంటుకు నేరుగా చెల్లింపులు జరపడాన్ని అందుకు ఉదాహరణగా చూపింది. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇంకా ఎక్కువ సాధించవచ్చని పేర్కొంది. పంచాయతీ రాజ్ సంస్థలకు మరింత సమాచారం, హక్కులు కల్పించడంద్వారా సామాజిక పథకాల పంపిణీని మెరుగుపరచవచ్చని సూచించింది.
 

Advertisement
Advertisement