న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేయాలన్న తీహార్ జైలు అధికారుల అభ్యర్థనను ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టు తిరస్కరించింది. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నందుకు డెత్ వారెంట్లు జారీ చేయలేమని తెలిపింది. ప్రతిపాదనల ఆధారంగా డెత్ వారెంట్లు జారీచేయలేమని స్పష్టంచేసింది.
(చదవండి : నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి)
కాగా, నిర్భయ దోషులు నలుగురూ న్యాయ పరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. దోషులను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 5న ఈ మేరకు తీర్పు వెలువరించింది.
(చదవండి : వాళ్లను త్వరలోనే ఉరి తీస్తారు: నిర్భయ తల్లి)
Comments
Please login to add a commentAdd a comment