hanged to death
-
కన్న తల్లిదండ్రులే హతమార్చి.. ఉరివేసుకున్నట్లు చిత్రించి..
ఉత్తరప్రదేశ్: కన్న తల్లిదండ్రులే కసాయిగా ప్రవర్తించారు. ఓ అబ్బాయిని ప్రేమించినందుకు సొంత బిడ్డనే గొంతు నులిమి హతమార్చారు. ఆ హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తన గ్రామంలోని ఓ అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను పలుమార్లు హెచ్చరించారు. బయటికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తల్లిదండ్రుల కళ్లుగప్పి బాలిక.. ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికను చితకబాదారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వంటగదిలో బాలిక ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారు. కానీ పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇదీ చదవండి: వివాహేతర సంబంధం: కలిసి ఉండలేక.. విడిగా బతకలేక! -
హిజ్రాను ప్రేమించి పెళ్లాడిన యువకుడు అనుమానాస్పద మృతి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): హిజ్రాను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూరాజరాజేశ్వరీపేటలో శనివారం చోటుచేసుకుంది. న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన వడ్డీ రమదేవి, రామారావు దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు వడ్డీ ప్రవీణ్‌కుమార్ (26) రెండేళ్ల క్రితం న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన అవ్వ మాధవి అనే హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తన తల్లిదండ్రుల పక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నారు. వారిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ మళ్లీ సర్దుకొని జీవిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్‌లో తమ బంధువుల ఇంట్లో వేడుక ఉంటే వెళ్లగా హిజ్రా మాధవి శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో తమ కుమారుడు ఉరేసుకొని చనిపొయినట్లు ఫోను చేసి చెప్పింది. దీంతో వారు హూటాహూటిన నగరానికి చేరుకొని తమ కుమారుడి భౌతికకాయాన్ని చూసి కుమిలిపోయారు. తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! -
దేవుడే వారి రూపంలో వచ్చి.. నిండు ప్రాణం నిలబెట్టారు
కడప : కొన్ని క్షణాలు ఆలస్యమైతే ఒక నిండు ప్రాణం పోయేది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. మెరుపులా వచ్చారు ఇద్దరు పోలీసులు.. ఇంటి తలుపులు పగలకొట్టి ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడారు. నిజంగా దేవుడే పోలీసుల రూపంలో వచ్చాడేమో అనేలా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని చౌటపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న అతను ఉరేసుకునేందుకు ఫ్యాన్‌కు చీర చుడుతున్నాడు. కిటికిలో నుంచి కుమారుడ్ని గమనించిన తల్లి చెన్నమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆత్మహత్య చేసుకోవద్దని, బయటికి రమ్మంటూ ఆమె రోదించసాగింది. ఈ క్రమంలోనే ఆమె కమాండ్ కంట్రోల్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. బ్లూకోల్ట్స్–7కు చెందిన పోలీసులు రామాంజనేయులు, నరసింహనాయుడు హుటా హుటిన చౌటపల్లెలోని ఎస్సీ కాలనీకి వెళ్లారు. స్థానికుల సాయంతో వెంటనే ఇంటి తలుపు పగులకొట్టారు. అప్పటికే ఉరికి వేలాడుతున్న సుబ్బరాయుడును పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడారు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ఇన్చార్జి డీఎస్పీ చెంచుబాబు, రూరల్ ఎస్ఐ శివశంకర్ అభినందించారు. సుబ్బరాయుడు తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. క్షణాల్లో స్పందించి సుబ్బరాయుడిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు రామాంజనేయులు, నరసింహనాయుడును జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. -
అలాంటి వారిని ఉరి తీస్తాం: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులు మూడు లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. ఈ సారి ఆక్సిజన్ వినియోగం అత్యధికంగా ఉంది. చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు దగ్గరపడుతుండటంతో కొత్త వారిని చేర్చుకోవడం లేదు. ఇక ఢిల్లీ, రాజస్తాన్ వంటి చోట్ల ఆక్సిజన్ కొరతతో పలువురు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమిస్తుండటంతో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సప్లైని అడ్డుకునే వారిని ఉరి తీస్తామని హెచ్చరించింది. ఆక్సిజన్ కొరతపై రాష్ట్రంలోని మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విపిన్ సంఘి, రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సరఫరా అడ్డుకునే వారికి సంబంధించి ప్రభుత్వం ఎవరిమీద అయినా తమకు ఫిర్యాదు చేస్తే.. కోర్టు సదరు వ్యక్తిని తప్పక ఉరి తీస్తుంది అని తెలిపింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో ఎంత పెద్ద అధికారి అయినా సరే.. తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. అంతేకాక ఇలాంటి అధికారుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం వారి వారి మీద తగిన చర్యలు తీసుకుంటుందని కోర్టు వెల్లడించింది. చదవండి: వ్యవస్థ ఇలా నాశనమవుతోంది: సుప్రీంకోర్టు -
‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’
సాక్షి, కొయ్యూరు(పాడేరు): ‘నేనంటే ఇంటిలో ఎవరికీ ఇష్టం లేదు... నాకు నేనే నచ్చను.. సంతోషం ఆవిరవుతున్న క్షణం ఇది.. నాకు బతకాలని లేదు..’ అంటూ లేఖ రాసి ఓ విద్యార్థి డార్మెటరీలో కట్‌చేసిన రగ్గు పీలికతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక గురుకుల పాఠశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు మండలం లగిజేపల్లి పంచాయతీ గురుపల్లికి చెందిన పూజారి హరికృష్ణరాజు, సరస్వతి కుమారుడు సౌజిత్‌రాజు (15) స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఐదేళ్లుగా ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాలలో సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సమావేశంలో రాజు పాల్గొన్నాడు. అతని తల్లిదండ్రులు హాజరుకాలేదు. పండగ సెలవులు ఇవ్వడంతో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులందరూ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. స్వగ్రామాలకు వెళ్తున్నట్టు అందరితో పాటు సౌజిత్‌రాజు కూడా రిజిస్టర్లో సంతకం చేశాడు. మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తాడని స్నేహితులతో చెప్పి అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఆరుగంటలకు ఒకసారి, ఎనిమిది గంటలకు మరోసారి పాఠశాల వాచ్‌మన్ కోటి డార్మెటరీలో గదులన్నీ చెక్ చేశాడు. విద్యార్థులెవరూ కనిపించలేదు. చదవండి: ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..! మంగళవారం ఉదయం లైట్లు ఆర్పేందుకు వెళ్లిన కోటికి సౌజిత్‌రాజు విగతజీవిగా కనిపించాడు. వెంటనే ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, ఎస్ఐ నాగేంద్రలు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ జరుపుతామని సీఐ,ఎస్ఐలు తెలిపారు. అందరితో పాటు పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన రాజు అర్ధరాత్రి సమయంలో డార్మెటరీకి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకుని రాజు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రాజు బంధువులు, తల్లిదండ్రులు కొద్ది సేపు వాచ్‌మన్ కోటితో వాగ్వాదం చేశారు. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !! లేఖను చదువుతున్న తండ్రి హరికృష్ణరాజు తదితరులు రాజు కోసం వడ్డాది వెళ్లాం.. శుక్ర, శనివారాల్లో పాఠశాలకు రెండు సార్లు ఫోన్ చేస్తే సోమవారం అమ్మఒడి సమావేశం అయిన తరువాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. దీంతో రాజు వస్తాడని సోమవారం రాత్రి వడ్డాది వెళ్లాం. అక్కడ చాలా సేపు వేచి ఉన్నామని రాజు తండ్రి హరికృష్ణరాజు విలపిస్తూ విలేకరులకు తెలిపాడు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తరువాత వడ్డాది నుంచి పాడేరు వచ్చేందుకు ఎలాంటి వాహనాలు ఉండవు. దీంతో తమ బిడ్డ వడ్డాదిలో ఉండిపోయి ఉంటాడని భావించి అక్కడ వెతికామని చెప్పారు. ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం వస్తాడన్న ఆశతో వెళ్లిపోయామన్నారు. ఉదయం లేవగానే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చిందని వాపోయాడు. ఆరు పేజీల లేఖ ఆత్మహత్య చేసుకునే ముందు సౌజిత్ రాజు ఆరు పేజీల లేఖ రాశాడు. ఇంగ్లిష్ మీడియం కావడంతో తెలుగులో తప్పులు వస్తాయని పేర్కొన్నాడు. చిన్ననాటి విషయాలు, స్నేహితులతో ఆడుకున్న పాత జ్ఞాపకాలు ప్రస్తావించాడు. నాకు ఒత్తిడి పెరిగిపోతోంది. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని తెలిపాడు. తల్లిదండ్రులు మందలించారని పేర్కొన్నాడు. సొంత గ్రామానికి వెళ్లాలని లేదని తెలిపాడు. పరీక్షల అట్ట, కొన్ని నోట్‌పుస్తకాలపై పబ్జీతోపాటు ప్రీఫైర్ ఆటల బొమ్మలు వేసి ఉన్నాయి. అయితే ఈ ఆటలంటే నాటు ఇష్టం లేదంటూ ఆ లేఖలో తెలిపాడు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నాడు. -
రెండ్రోజులుగా చెట్టుపైనే మృతదేహం
సాక్షి, సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గంగాధర్ మృతదేహం రెండ్రోజులుగా చెట్టు పైనే ఉంది. గత అక్టోబర్‌లో గ్రామానికి చెందిన మమత హత్య కేసులో గంగాధర్‌ను అనుమానితుడిగా భావించి పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు, మహిళలు ఆరోపిస్తున్నారు. గంగాధర్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, మమత హత్య కేసులో అసలైన నిందితులను తక్షణం పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చదవండి: ఇల్లు అమ్మనివ్వడంలేదని.. ఫ్యానుకు ఉరి! ఇరు కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, గంగాధర్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. శవాన్ని చెట్టుపై నుంచి దించేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకున్నారు. వారితో మాట్లాడటానికి వచ్చిన నిజామాబాద్ ఆర్డీవో రవిని ఆదివారం రాత్రి వరకు అక్కడే అడ్డుకున్నారు. తగిన న్యాయం జరిగేంత వరకు చెట్టుకు వేలాడుతున్న మృతదేహన్ని కిందకు దించనిచ్చేది లేదని వారు పట్టుబట్టారు. చదవండి: అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య -
నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో జైలు నెంబర్ 3లో ఈరోజు ఉదయం 5:30 గంటలకు వారిని ఉరితీశారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగిక దాడి చేసి.. అతి కిరాతకంగా చంపేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి మైనర్ అని తేలింది. దీంతో అతనికి జువైనల్ యాక్ట్ కింద జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ప్రస్తుతం అతను దక్షిణ భారత దేశంలో.. రహస్య జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిసింది. (చదవండి: నిర్భయ దోషులకు ఉరి అమలుపై మోదీ) ఢిల్లీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామానికి చెందిన సదరు మైనర్‌కు బస్సు ఓనర్ రామ్ సింగ్.. క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. 11 ఏళ్లకే ఇళ్లు వదిలి వచ్చిన ఆ మైనర్‌ను రామ్ సింగ్ చేరదీశాడు. నిర్భయ ఘటన సమయంలో మైనర్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిరూపణ అయింది. రేప్ కేసులో దోషిగా తేలిన మైనర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. అయితే, అతన్ని ఢిల్లీకి దూరంగా పంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక ఎప్పుడూ అతని ముఖాన్ని కప్పిఉంచడం వల్ల ఆ మైనర్‌ను ఎవరూ గుర్తుపట్టలేరు. అతని ఆనవాళ్లు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతను ఓ వంటవాడిగా జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. అతనిపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
ఇంకా 8మంది ఖైదీలు యావజ్జీవులుగా..
ఉరి శిక్ష అమలైన ఖైదీలు.. ఆఖరి నిమిషంలో యావజ్జీవ కారాగార ఖైదీలుగా మారుతున్నారు. చట్టంలోని లోటుపాట్లతో ఉరి నుంచి తప్పించుకుని జీవితాంతం జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. తీహార్ జైల్లో నిర్భయనిందితులకు ఉరిశిక్ష అమలు చేస్తున్న వేళ జిల్లాలోని రాజమహేంద్రవరంసెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలు, తదితర ఘటనలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఒకేసారి ఉరి శిక్షను అమలు చేసేలా కోర్టు తీర్పు ఇవ్వడం, నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండడంతో ఉరి శిక్షలు అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని నిర్భయ లైంగికదాడి కేసులో నిందితులైన ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్‌శర్మలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి శిక్ష అమలు చేయనున్నారు. దీని అమలు, తీరుతెన్నులపై ఒక్కసారి అవలోకనం చేసుకుంటే దేశంలో ఎక్కువగా కఠిన శిక్షలు అమలు చేసిన దాఖలాలు లేవు. నేరస్తులను కస్టడీ అండ్ కేర్ కరక్షన్(అదుపులోకి తీసుకొని సంరక్షించి నేరాలు వైపు మరలకుండా సంస్కరించాలని) జైలు మాన్యువల్ చెబుతోంది. మహిళలపై జరిగిన లైంగికదాడులు ♦ 2005లో ఢిల్లీలో లక్ష్మి అగర్వాల్‌పై యాసిడ్ దాడి జరిగింది. దేశంలోనే సంచలనం కలిగించిన కేసు 2012లో డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయపై నలుగురు నిందితులు రేప్ చేసి హత్య చేశారు. ♦ 2007లో విజయవాడలో ఆయేషా మీరాపై లైంగికదాడి, హత్య. ♦ 2018 జనవరి 17న జమ్ము కశ్మీర్లో ఆసిఫా అనే బాలికపై లైంగికదాడి. అలాగే గుంటూరులో హరిత అనే మహిళపై లైంగికదాడి. 2019 గుంటూరులో మైనర్ బాలికపై రేప్ జరిగాయి. ♦ 2019 తెలంగాణలో లక్ష్మి అనే మహిళపై లైంగికదాడి అనంతరం హత్య చేశారు. ♦ 2019 నవంబర్ 27న హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలపై లైంగికదాడులు, హత్యలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తుంటే.. మరికొన్ని మాత్రం బయటపడడం లేదు. నేరం చేసిన నిందితులు దర్జాగా సమాజంలో తిరుగుతున్నారు. మహిళలపై లైంగికదాడులు, హత్యలు, వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ♦ మహిళలపై లైంగికదాడులకు పాల్పడడమే కాదు వారిని హత్య చేసిన నిందితులకు పలుచోట్ల ఉరిశిక్షలు విధించినా.. వాటిని అమలు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతోంది. తొలుత ఉరిశిక్ష అని తీర్పు చెప్పినా.. రోజులు గడిచే కొద్దీ మానవతా దృక్పథంతో ఆఖరి నిమిషంలో జీవిత ఖైదీలుగా శిక్షలు మార్చుతూ ప్రభుత్వాలు ఖైదీల పట్ల దయతో వ్యవహరించేవి. దీంతో ప్రస్తుతం మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడికే తరలించేవారు.. ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఏడు సెంట్రల్ జైళ్లు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు, తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి, చంచల్‌గూడలలో ఉన్నాయి. అయితే రాజమహేంద్రవరంలో మాత్రమే ఉరి శిక్ష అమలు చేసేందుకు ఉరి కంబం ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నూతనంగా భవనాలు నిర్మించారు. వీటితో పాటు ఆధునికమైన ఉరి కంబంను కూడా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉరి శిక్షలు అమలు చేయాలంటే ఖైదీలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకుతరలించాల్సిందే. ఉరిశిక్ష పడి జీవిత ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న ఎనిమిది మంది ఖైదీలురాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో వివిధ కేసుల్లో ఉరి శిక్షలు పడిన ఖైదీలు, వాటిని హై కోర్టులు క్షమాభిక్షలుగా మార్చడంతో ఎనిమిది మంది ఖైదీలు యావజ్జీవ కారాగార శిక్షలుఅనుభవిస్తున్నారు. 1976లో ఆఖరి సారిగా ఉరి శిక్ష అమలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఆఖరి సారిగా 1976లో నంబి కృష్టప్ప అనే ఖైదీని ఉరి వేశారు. భార్య, పిల్లలు హత్య కేసులో నిందితుడైన ఈ ఖైదీని ఉరి తీశారు. ఇతడి ఆఖరి కోరిక లడ్డును తినాలని ఉందని కోరాడు. ఇతడి కోరికను జైలు అధికారులు తీర్చి అనంతరం ఉరి తీశారు. ఈ సెంట్రల్ జైలులో ఆదే ఆఖరి ఉరి. అప్పటి నుంచి దాదాపు 44 సంవత్సరాలు ఈ జైలులో ఉరి శిక్షను అమలు చేయలేదు. 1993 మార్చి 8న జరిగిన చిలకలూరి పేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతికి కారకులైన కేసులో నిందితులు గుంటూరుకు చెందిన గంటేల విజయవర్ధనరావు, చలపతిరావులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆఖరి నిమిషంలో 1997 ఏప్రిల్‌లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ క్షమాభిక్ష ప్రసాదించారు. 1997లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా భారత దేశ పర్యటనకు వచ్చిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ రచయిత్రి మహాశ్వేతా దేవి ఉరి శిక్ష పడిన ఖైదీల గురించి నెల్సన్ మండేలా దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి క్షమా భిక్ష ప్రసాదించాలని కోరడంతో మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో అప్పటి ఆర్టీఓ శ్రీధర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆఖరి నిమిషంలో జైలు అధికారులకు రాష్ట్రపతి ఉత్తర్వులు అందజేసి ఉరి శిక్ష పడిన ఖైదీలు విజయవర్ధనరావు, చలపతిరావులకు ఉరి శిక్ష అమలు కాకుండా నిలిపివేశారు. ప్రస్తుతం విజయవర్ధనరావు గుంటూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా చలపతిరావు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!
న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని తెలిపారు. గత రాత్రి భోజనం చేయలేదని, ఉరి తీసే గంట ముందు బ్రేక్ ఫాస్ట్‌కు నిరాకరించారని పేర్కొన్నారు. ఉరి అమలు ముందు రోజు (గురువారం రాత్రి) వారిని విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచామని తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు వారు నిద్ర లేచారని, అప్పటికే సుప్రీం కోర్టు వారి చివరి పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపారు. దోషులను స్నానం చేయాలని కోరగా.. ఎవరూ అంగీకరించలేదని అన్నారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే. (చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం) 30 నిముషాలపాటు ఉరి.. ఉరికి ముందు దోషులను నిర్భయ కుటుంబ సభ్యులకు చూపించామని జైలు అధికారులు చెప్పారు. ఉరి అమలు నేపథ్యంలో జైలంతా లాక్డౌన్లో ఉంచామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇక కారాగార సమయంలో పవన్, వినయ్, ముఖేష్ జైల్లో పనిచేశారని, వారు సంపాదించిన మొత్తం ఆయా కుంటుంబాలకు అందిస్తామని జైలు అధికారులు చెప్పారు. 5:30 గంటలకు నిర్భయ దోషులను ఉరితీశామని తీహార్ జైలు అధికారి సందీప్ గోయల్ చెప్పారు. నిబంధనల మేరకు తలారి పవన్ జల్లాద్ దోషులను 30 నిముషాలపాటు ఉరికి వేలాడదీశాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇదిలాఉండగా.. ఉరి అమలుకు ముందు వినయ్ కుమార్ ఉరి తీయొద్దని పోలీసులను వేడుకున్నట్టు తెలిసింది. ఉరి భయాల నేపథ్యంలో అతను గత ఫిబ్రవరిలో గోడకు తల బాదుకున్నట్టు సమాచారం. (చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ) -
నిర్భయ దోషులకు ఉరి: తీహార్ జైలు వద్ద సంబరాలు
-
‘దోషులకు ఉరి అమలు; సమాజంలో మార్పేం ఉండదు’
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన తీహార్ జైలు వద్ద స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. నిర్భయ వర్థిల్లాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కొందరు జాతీయ జెండా ప్రదర్శించారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఇక జైలు వద్దకు చేరుకున్న వారిలో సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా ఉన్నారు. ‘నిర్భయకు న్యాయం జరిగింది. మిగతా బాధితులకు కూడా న్యాయం జరగాలి’ అనే పోస్టర్‌ను ఆమె ప్రదర్శించారు. నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం) కష్టతరమైన యుద్ధంలో విజయం సాధించామని నిర్భయ కుంటుంబం సన్నిహితుడు అకాశ్ దీప్ అన్నారు. ఉరి శిక్ష నిర్ణయం, అమలు.. మంచిదే.. కానీ, శిక్ష అమలు ఇంతలా ఆలస్యం కాకుండా... ముందే జరగాల్సిందని దివ్యా ధావన్ అనే మహిళా అన్నారు. ‘నిర్భయ దోషులకు ఉరి అమలుతో సమాజం ఏమీ మారదు. కానీ, నిర్భయకు న్యాయం జరిగింది. సంతోషం’అని సనా అనే యువతి తెలిపారు. ఇక ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఒకేసారి నలుగురికి ఉరితీయయం ఇదే తొలిసారి. తీహార్ జైలు 16 వేల మంది ఖైదీలకు కాగారారం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఉరి అమలు నేపథ్యంలో జైలు వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుద్టిమైన భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: ఉరి అమలు: ఉదయం 3:30 గంటలకు పిటిషన్ కొట్టివేత) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉరి అమలు: ఉదయం 3:30 గంటలకు పిటిషన్ కొట్టివేత
-
రెండు గంటల్లో ఉరి.. ఆగని ప్రయత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఏడేళ్లుగా నలుగుతున్న నిర్భయ కేసులో బాధితురాలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు (శుక్రవారం) ఉదయం 5:30 గంటలకు తీహార్ జైలులో ఉరి తీశారు. అయితే, మరణ దండన నుంచి తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాల పేరుతో దోషులు తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరి శిక్ష అమలుకు రెండు గంటల ముందు వరకు దోషుల ప్రయత్నాలు ఆగలేదు. ఢిల్లీ హైకోర్టులో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వారు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషుల చివరి పిటిషన్‌ను శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు సుప్రీం కోర్టు కొట్టివేసింది. (చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం) కాగా, దోషులు పిటిషన్లమీద పిటిషన్లు వేయడంతో డెత్ వారెంట్లు జారీ అయ్యాక మూడు సార్లు ఉరి అమలు నిలిచిపోయింది. 2020, జనవరి 22 న దోషులను ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌజ్‌కోర్టు తొలుత డెత్ వారెంట్లు జారీ చేసింది. దోషుల వరుస పిటిషన్లతో ఉరి అమలు సాధ్యం కాలేదు. అనంతరం ఫిబ్రవరి 1, తర్వాత మార్చి 3న ఉరితీయాలని డెత్ వారెంట్లు జారి అయినప్పటికీ శిక్ష అమలు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 20న (నాలుగోసారి) ఉరితీయాలని జారీ అయిన డెత్ వారెంట్ల ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది. (చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ) ఏడేళ్ల నిర్భయ కేసు పరిణామాలు.. 2012, డిసెంబర్ 16న అర్థరాత్రి నిర్భయపై సామూహిక అత్యాచారం కదులుతున్న బస్సులో అత్యాచారం చేసిన ఆరుగురు దోషులు నిర్భయను అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం చేసిన దోషులు నిర్భయతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేసిన ఆరుగురు దోషులు తీవ్రగాయాలైనా ఇద్దరిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్సపొందుతూ 2012, డిసెంబర్ 29న నిర్భయ మృతి 2013, జనవరి 2న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు 2013, జనవరి 3న ఛార్జ్‌షీట్ దాఖలు 2013, మార్చి 11న తీహార్ జైల్లో రామ్‌సింగ్ ఆత్మహత్య 2013, మార్చి 21న నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం 2013, ఆగస్టు 31న మైనర్ దోషికి మూడేళ్ల రిఫార్మ్ హోం శిక్ష 2013, సెప్టెంబర్ 13న నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు 2014, మార్చి 13న ఉరిశిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు 2015, డిసెంబర్ 20న రిఫార్మ్ హోం నుంచి మైనర్ విడుదల 2017, మే 5న ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు 2020, జనవరి 7న ఉరిశిక్ష అమలుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం 2020, ఫిబ్రవరి 1న ఉరితీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు ఉరిశిక్షను నిలిపేయాలంటూ కోర్టులో దోషుల పిటిషన్లు ఎట్టకేలకు 2020, మార్చి 20న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు -
నిర్భయ: ‘వారి పట్ల మానవ కనికరం అవసరం’
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు రేపు (మంగళవారం) ఉరి శిక్ష విధించనున్న నేపథ్యంలో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్భయ దోషుల అవయవాలను దానం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఓ వ్యక్తి చనిపోవడం వల్ల.. ఆ కుటుంబానికి తీరని శోకం మిగులుతుందని, అవయవ దానం కోసం దోషుల మృతదేహాలను ముక్కలు చేయడం సరికాదని చెప్పింది. వారి పట్ల మానవ కనికరం కలిగి ఉండాలని పేర్కొంది. అవయవ దానం అనేది స్వచ్ఛందంగా జరగాలని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. (చదవండి: క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి) ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషుల అవయవాలు దానం చేసే వీలు కల్పించాలని మాజీ న్యాయమూర్తి ఎంఎఫ్ సల్దానా తన పిటిషన్లో కోరారు. ఇకపై మరణ శిక్షకు గురైన వారి అవయవాలను సైతం దానం చేసే దిశగా మార్గదర్శకాలు జారీ చేయాలని సల్దానా పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్‌గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీం కోర్టు నేడు కొట్టివేసింది. ఇక పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొన్ని గంటల వ్యవధిలోనే తిరస్కరించారు. అలాగే డెత్‌వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్ జైల్లో ఉరితీయానున్నారు. దీని కొరకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. -
నిర్భయ కేసు: నోటీసులు ఇస్తే మరింత ఆలస్యం..!
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యం కావడం పట్ల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడటంపై దేశ ప్రజలు ఇప్పటికే అసహనంతో ఉన్నారని కేంద్రం తరపు లాయర్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు. చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా దోషులు న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో కలుగజేసుకుని.. నిర్భయకు న్యాయం జరిగే విధంగా చట్టాల్లో మార్పులు చేయాలని కోరారు. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌ను విడివిడిగా ఉరి తీయాలని అన్నారు. ఈమేరకు దోషులకు నోటీసులు జారీ చేయాలని విఙ్ఞప్తి చేశారు. (చదవండి : నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి) కాగా, వాదనలు విన్న జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. కేంద్రం అభ్యర్థనను స్వీకరించిన పక్షంలో శిక్ష అమలు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మంగళవారం (ఫిబ్రవరి 11) వాయిదా వేసింది. ఇక నిర్భయ దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌ను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 5న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. (చదవండి : ఉరి.. అందరికీ ఒకే సారి) -
నిర్భయ కేసు: డెత్ వారెంట్లు జారీ చేయలేం !
న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేయాలన్న తీహార్ జైలు అధికారుల అభ్యర్థనను ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టు తిరస్కరించింది. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నందుకు డెత్ వారెంట్లు జారీ చేయలేమని తెలిపింది. ప్రతిపాదనల ఆధారంగా డెత్ వారెంట్లు జారీచేయలేమని స్పష్టంచేసింది. (చదవండి : నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి) కాగా, నిర్భయ దోషులు నలుగురూ న్యాయ పరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. దోషులను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఫిబ్రవరి 5న ఈ మేరకు తీర్పు వెలువరించింది. (చదవండి : వాళ్లను త్వరలోనే ఉరి తీస్తారు: నిర్భయ తల్లి) -
నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం: వర్మ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడటంపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష పడకుంటా అడ్డుకుంటున్న న్యాయవాది ఏపీ సింగ్‌పై మండిపడుతూ వరుస ట్వీట్లు చేశాడు. ‘మురికి మనిషి ఏపీ సింగ్ నీతినియమాలను ఉల్లంఘిస్తే తన కూతురునైనా కాల్చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో చూడండి. ఇది మన సిస్టమ్‌కు ఉరి వేస్తూ అతడు వేసిన ఒట్టు అది. మన దేశానికి ఎంతో అవమానకరం’అంటూ 2013లో ఏపీ సింగ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూ లింక్‌ను షేర్ చేశాడు. ‘అత్యంత క్రూరంగా, అహంకారంతో మన వ్యవస్థను న్యాయవాది ఏపీ సింగ్ మార్చుతుంటే.. మన వ్యవస్థ కంటే తెలంగాణ పోలీసులపైనే ప్రజలకు ఎక్కువ నమ్మకం కలుగుతుంది’, ‘నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనివ్వని ఏపీ సింగ్ సవాల్ చేస్తున్నాడు. నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం’అంటూ మరో రెండు ట్వీట్లు శనివారం చేశాడు. అయితే శుక్రవారం దోషులకు ఉరిశిక్ష వాయిదా వేస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వెంటనే వర్మ ట్విటర్ వేదికగా మండిపడిన విషయం తెలిసిందే. నాడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురైతే.. నేడు మన వ్యవస్థ చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురవుతోందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని మీరు ఊహించగలరా మోదీ గారూ. దానిని తెలుసుకోవడం కోసం.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి’ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా నిర్బయ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు శిక్ష అమలుకానుండగా.. కొన్ని గంటల ముందు కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయరాదని ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష పదే పదే వాయిదా పడటాన్ని యావత్ దేశం జీర్ణించుకోలేకపోతోంది. Just check the interview of this dirt piece called A P Singh where he’s bragging to burn his own daughter and this is the scum who made our system stay the hanging ..SHAME ON OUR COUNTRY https://t.co/hjQb3gBati — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 If even filthy scum like advocate A P Singh also can manipulate the system with such brutal arrogance, it’s no wonder people have more faith in the telangana police than in our system https://t.co/w8UwJebNP8 — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 చదవండి: ఆ కీచకులను వెంటనే ఉరితీయండి: గంభీర్ ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా -
ఆ కీచకులను వెంటనే ఉరితీయండి: గంభీర్
న్యూఢిల్లీ : ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశారు. మన న్యాయవ్యవస్థకు ఇదొక మాయని మచ్చ వంటిదని పేర్కొన్నారు. నిర్భయ కీచకులు భూమ్మీద ఇంకా జీవించి ఉంటే అది మన న్యాయవ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. అంతటి పైశాచిక చర్యకు పాల్పడిన దోషులు ఏడేళ్లైన ఇంకా శిక్షను అనుభవించడం లేదని వాపోయారు. నిర్భయ తల్లి కడుపుకోత తీరేదెప్పుడని ప్రశ్నించారు. ‘నిర్భయ దోషుల్ని వెంటనే ఉరితీయండి’అని గంభీర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముకేశ్ సింగ్, అక్షయ్ సింగ్, వినయ్ శర్మకు ఈరోజు (ఫిబ్రవరి 1) విధించాల్సిన ఉరిశిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని దోషుల విజ్ఞప్తి మేరకు.. ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా శుక్రవారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయొద్దని స్పష్టం చేశారు. (చదవండి : నిర్భయ కేసు : వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరణ) -
నిర్భయ కేసు : వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు. ఇక నిర్భయ దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ సింగ్‌ల ఉరిశిక్ష అమలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని దోషుల విఙ్ఞప్తి మేరకు.. ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా శుక్రవారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయొద్దని స్పష్టం చేశారు. (చదవండి : ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా) నిబంధనలకు విరుద్ధం..! దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించారు. అయితే, వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్‌లో ఉండటం.. మిగతా ఇద్దరు (అక్షయ్, పవన్) చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ వారి తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం అడిషనల్ సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు. (చదవండి : అందుకే నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే: జడ్జి) -
ఉరి అమలు ఆ ముగ్గురికే..!
-
ఒక్కొక్కరిని ఉరి తీయండి.. అప్పుడే: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులు చట్టంతో ఆటలాడుకోవాలని చూస్తున్నారని బాధితురాలి తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిని ఉరితీస్తేనే వారికి చట్టం అంటే ఏంటో తెలిసి వస్తుందని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 1న నిర్భయ దోషులందరికీ ఉరిశిక్ష అమలైతేనే తనకు ఆత్మసంతృప్తి కలుగుతుందని ఉద్వేగానికి లోనయ్యారు. ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు( ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)) దాదాపు రెండున్నరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆనాటి నుంచి దోషులకు ఎప్పుడెప్పుడు శిక్ష అమలు చేస్తారా అని నిర్భయ తల్లి ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆనాటి నుంచి ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి చట్టపరమైన మార్గాలన్నింటినీ దోషులు ఉపయోగించుకుంటున్నారు.(నిర్భయ కేసు : పిటిషనర్‌కు సుప్రీం చురకలు) ఈ నేపథ్యంలో పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన అనంతరం నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి వాళ్లు వేసిన ఎత్తుగడ మరోసారి చిత్తయింది. ఫిబ్రవరి 1న వాళ్లను ఉరితీయాల్సిందే. శిక్ష అమలును జాప్యం చేయడానికి ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్లను సైతం ఒక్కొక్కరిగానే ఉరితీయాలి. అప్పుడే చట్టంతో ఆడుకుంటే ఏమవుతుందో వారికి అర్థమవుతుంది’’అని పేర్కొన్నారు.(ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు ) నిర్భయ కేసు: సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని ఆరోజే నా కూతురికి న్యాయం.. -
నిర్భయ కేసు : పిటిషనర్‌కు సుప్రీం చురకలు
న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో.. దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టాడు. నిర్భయ ఉదంతం చోటుచేసుకునే నాటికి తాను మైనర్‌ను అని అపెక్స్ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఈమేరకు పవన్‌కుమార్ గుప్తా తరపు న్యాయవాది సమర్పించిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ వాదన నిజమని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కింది కోర్టు పరిశీలనకు వెళ్లి, తిరస్కరణకు గురైన అంశాన్ని మళ్లీ లేవనెత్తడం సరికాదని హితవు పలికింది. ఒకే అంశంపై ఎన్నిసార్లు వాదిస్తారని చురకలు వేసింది. కాగా, ఇదే విషయమై పవన్‌కుమార్ గుప్తా సమర్పించిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. (చదవండి : సోనియా అంత మనసు లేదు) కోర్టును తప్పుదోవ పట్టించేందుకే.. పిటిషనర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తూ.. నిర్భయ ఉదంతం జరిగే నాటికి పవన్ గుప్తా మైనరేనని అతని పాఠశాల డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోందని అన్నారు. వాటిని ఏ కోర్టు కూడా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. కాగా, ఏపీ సింగ్ వాదనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పదించారు. ఏపీ సింగ్ సమర్పించిన స్కూల్ డాక్యుమెంట్లను న్యాయస్థానాలు పరిశీలించాయని, అవన్నీ కోర్టులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేశారు. నిర్భయ ఘటన జరిగే నాటికి పవన్ గుప్తా 19 ఏళ్ల వయసువాడని కోర్టుకు తెలిపారు. బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్లు పవన్ మేజరేనన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని కోర్టుకు తెలిపారు. (చదవండి : నిర్భయ నేరస్తులకు ఉరితో రేప్‌లకు చెక్!) (చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు ) -
హత్య చేసి.. చెట్టుకు వేలాడదీసి..
గాంధీనగర్ : మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. వాస్తవానికి ఇటీవల మహిళలపై దాడులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్లో మరో దారుణం వెలుగు చూసింది. 19 ఏళ్ల దళిత యువతిని అత్యాచారం చేసి, హత్య చేసి.. చెట్టుకు వేలాడదీశారు. యువతి మృతదేహాన్ని మంగళవారం అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా దళితులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ ఆసుపత్రి ముందు బైఠాయించి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో # Justice For Kajal అనే ట్యాగ్‌తో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నెల 1న సోదరితో కలిసి బయటికి వెళ్లిన ఓ యువతిని(19) కొందరు దుండగులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. తన కూతురిని ఎవరో అపహరించారని యువతి తండ్రి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భీమల్ భర్వాద్ అనే వ్యక్తి తన సోదరిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడని బాధితురాలి సోదరి ఆరోపించింది. కానీ దీనిపై పోలీసులు సరిగా స్పందించలేదని, తమ కేసును స్వీకరించలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా జనవరి 5న మొడాసలోని సైరా గ్రామంలో మర్రిచెట్టుకు వేలాడదీసిన యువతి మృతదేహం లభ్యమైంది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించంగా భీమల్ ప్రయాణించిన కారు తన తండ్రి పేరిట నమోదు అయినట్లు వెల్లడైంది. భీమల్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి యువతిని కిడ్నాప్ చేసినట్లు, అనంతరం అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇప్పటి వరకు నిందితులను పోలీసులు పట్టుకోకపోవండంతో గుజరాత్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని గుజరాత్ ఎస్సీ, ఎస్టీ సెల్‌కు చెందిన అదనపు డీజీపీ కెకె ఓజా హామీయిచ్చారు. కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, నిందితులను అరెస్టు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
ఉన్నావ్: వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష
లక్నో : తమ సోదరి చావుకు కారణమైన అయిదుగురిని చంపడమే సరైన శిక్ష అని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి సోదరుడు స్పష్టం చేశారు. నిందితులకు వేరే ఏ శిక్ష వేసిన ప్రయోజనం లేదని, చంపడం వల్లనే తమకు న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుల చేతిలో పెట్రోల్ దాడికి గురై ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాదితురాలి సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరి ఇక తమతో లేరని, ఆమె చావుకు కారణమైన అయిదుగురు నిందితులు (శివం త్రివేది, శుభం త్రివేది, హరి శంకర్ త్రివేది, రాంకిషోర్ త్రివేది, ఉమేశ్ బాజ్‌పాయ్)లను చంపేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం కోర్టు విచారణ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న యువతిని నిందితులు అపహరించి పెట్రోల్ పోసి నిప్పటించి పరారయ్యారు. తమపై కేసు పెట్టిందన్న అక్కసుతోనే నిందితులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. కాగా ఈ ఘటన అనంతరం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: అత్యాచారాలకు రాజధానిగా భారత్: రాహుల్ మరోవైపు బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ కుమార్తెను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఐదుగురినీ పోలీసులు కాల్చి చంపినప్పుడే ప్రశాంతంగా ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి నిందితుల నుంచి ప్రమాదం ఉందని, వారు అనేకసార్లు తమను బెదిరించారని చెప్పినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. గ్రామంలో వారిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదని ఆయన తెలిపారు. ఇక ఉన్నావ్ బాధితురాలు మరణించడం దురదృష్టమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులందరిని అరెస్టు చేశామని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టామని తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. దోషులను ఎన్కౌంటర్ చేయడమే సరైన మార్గమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళకు భద్రత లేదు : మాయావతి -
కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో 50పేర్లు
సాక్షి, ముంబై : ఓవైపు అప్పుల బాధ, మరోవైపు కూతురి మరణం వెరసి ఓ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ముంబైలోని కఫే పరేడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కఫే పరేడ్‌కు చెందిన ప్రవీణ్ పటేల్, భార్య వీణా పటేల్, కొడుకు ప్రభు పటేల్‌తో కలిసి మత్స్యకారుల కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రవీణ్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుండేవాడు. కొన్ని నెలల క్రితం అతని కూతురు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందింది. కూతురి మరణంతో పాటు అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా కొడుకును ఉరివేసి, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ప్రవీణ్ ఇంటి నుంచి దుర్వాసన రావటం గుర్తించిన పొరుగింటి వారు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరచిచూడగా ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటనా స్థలంలో లభించిన ఓ సూసైడ్ నోట్లో మృతులు దాదాపు 50 మంది పేర్లను ప్రస్తావించటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇంటి సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేదా... ఆత్మహత్య చేసుకునేలా ఎవరన్నా ప్రేరేపించారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.