
పరీక్షలో ఫెయిల్.. మహిళా డాక్టర్ ఆత్మహత్య
ఎండీ పరీక్షలో ఫెయిలయ్యానన్న ఆవేదనతో.. ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. కృతిక (26) కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పీలమేడు ప్రాంతంలోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆమె మరణించారు.
ఉదయం ఎంతకూ తలుపు తీయకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఆమె శరీరం స్పందించలేదు. చివరకు ఆస్పత్రిలోనే ఆమె మరణించారు. ఇటీవలే కృతిక ఎండీ పరీక్షలు రాశారని, కానీ అందులో పాస్ కాకపోవడంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.