doctor suicide
-
జూబ్లీహిల్స్‌లో విషాదం.. తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ (60) తన లైసెన్స్డ్ పిస్టల్‌తో కాల్చుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన ఇంట్లోనే ఈ ఉదంతం జరిగింది. ఆర్థిక, కుటుంబ వివాదాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మజారుద్దీన్ ప్రస్తుతం ఒవైసీ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగం డీన్‌గా పనిచేస్తుండగా.. ఆయన కుమారుడు అబేద్ అలీఖాన్ అదే హాస్పిటల్లో పీడియాట్రిక్ సర్జన్‌గా ఉన్నారు. అబేద్‌కు అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె యాస్మిన్ ఒవైసీతో 2020 సెప్టెంబర్ 22న వివాహమైంది. మజారుద్దీన్ ఇంట్లో భార్య అఫియా రషీద్ అలీఖాన్, అబేద్, యాస్మిన్ ఉంటుండగా.. మజారుద్దీన్ కుమార్తె జైనా అలీఖాన్ అమెరికాలో నివసిస్తున్నారు. ఆర్థిక, కుటుంబ వివాదాల నేపథ్యంలో కొన్నాళ్లుగా మజారుద్దీన్, అఫియా మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో వారు ఒకే ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. రెండు రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం తన గదిలోకి వెళ్లిన మజారుద్దీన్ తలుపులు గడియపెట్టుకున్నారు. ఆపై తన వద్ద ఉన్న .32 క్యాలిబర్ లైసెన్స్డ్ పిస్టల్‌తో కుడివైపు చెవి పైభాగంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గది పూర్తిగా మూసి ఉండటంతో శబ్దం ఎవరికీ వినిపించలేదు. మజారుద్దీన్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్పత్రికి రాకపోవడంతో అబేద్ ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో తాజుద్దీన్‌కు ఫోన్ చేసి విషయం ఆరా తీయాలని సూచించారు. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో తాజుద్దీన్ వెళ్లి మజారుద్దీన్ గది తలుపు తట్టినా ఎంతకీ తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా మజారుద్దీన్ మంచంపై రక్తపు మడుగులో పడి ఉండటం గమనించాడు. వెంటనే మజారుద్దీన్ భార్య, పనిమనిషుల సాయంతో తలుపులు తీసి మజారుద్దీన్‌ను కారులో అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. తూటా మజారుద్దీన్ తల నుంచి బయటకు దూసుకెళ్లి గోడకు తలిగినట్లు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి తూటా, ఖాళీ క్యాట్రిడ్జ్‌ను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేశారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డాక్టర్ మజహర్ అలీ మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
జూబ్లీహిల్స్ లో డాక్టర్ ఆత్మహత్య
-
బెంగళూరులో దారుణం.. వేధింపులు తాళలేక వైద్యురాలు ప్రియాంశి మృతి
యశవంతపుర: శ్రద్ధగా చదివి దంత వైద్యురాలైంది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని తపిస్తే ఒక ప్రేమోన్మాది చర్యల వల్ల అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. సహచర వైద్యుని వేధింపులను తాళలేక దంత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన దంత వైద్యురాలు ప్రియాంశి త్రిపాఠి (28) మృతురాలిగా గుర్తించారు. ప్రేమించలేదని నిందలు వివరాల ప్రకారం.. ప్రియాంశి ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో దంతవైద్యురాలిగా పని చేసేది. అదే ఆస్పత్రిలో పనిచేసే సుమిత్ అనే వైద్యుడు ప్రేమ పేరుతో ఆమెను వేధించటం ప్రారంభించాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు డబ్బుల కోసం వెంటపడేవాడు. మద్యం, సిగరెట్ తాగాలని వేధించాడు. ఆమె అతన్ని పట్టించుకోకపోవడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ ఆస్పత్రిలో తప్పుడు ప్రచారం ప్రారంభించాడు. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని చెప్పేవాడు. తల్లిదండ్రులు హెచ్చరించినా.. అతని ఆగడాలను తట్టుకోలేక ప్రియాంశి తల్లిదండ్రులకు చెప్పి లక్నోకు వాపస్ వచ్చేస్తానని వేడుకొంది. దీంతో, ప్రియాంశి తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చి సుమిత్‌కు బుద్ధిమాటలు చెప్పారు. తరువాత కూడా అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి కొడుకు ప్రవర్తనను వివరించి తమ కూతుర్ని ఇబ్బందులకు గురిచేయవద్దని హెచ్చరించారు. ఇంత జరిగినా సుమిత్లో మార్పు రాలేదు. మళ్లీ ఉన్మాదిగా మారి ప్రియాంశిని వేధించటం ప్రారంభించాడు. దీంతో విరక్తి కలిగిన ప్రియాంశి జనవరి 24న ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ క్రమంలో లక్నో నుంచి తల్లిదండ్రులు అనేకసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి యజమానికి కాల్ చేశారు. వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బయటపడింది. ప్రియాంశి తండ్రి సుశీల్ త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుమిత్‌పై సంజయ్‌నగర పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురిని శారీరకంగా, మానసికంగా హింసించటంతోనే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్
యశవంతపుర (బెంగళూరు): గత ఆగస్ట్‌లో కెంగేరి వద్ద యువ వైద్యుడు సార్థిక్ రైలు కింద పడి ఆత్మహత్య కేసులో హనీట్రాప్ కుట్ర బయటపడింది. దీనిపై రైల్వే పోలీసులు ముఖ్య నిందితున్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎంబీబీఎస్ చదివిన సార్థిక్తో ఒక యువతి వాట్సప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఒక రోజు ఆమె నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్ ద్వారా మాట్లాడింది. ఆ కాల్స్‌ను రికార్డు చేసి సార్థిక్ను బెదిరించి రూ.67 వేల వరకూ వసూలు చేసింది. మరింత డబ్బు ఇవ్వాలని, లేదంటే ఇంటర్నెట్లో ఈ చిత్రాలను పెడతానని ఆమె బెదిరిస్తుండడంతో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం) -
ఉరివేసుకొని వైద్యుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్)/మెదక్ జోన్: బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని హోటల్ గదిలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడి నీట్ పరీక్ష కోసం ఇక్కడికి భార్యతో కలసి వచ్చి హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం కొడుకును నిజాంపేటలోని పరీక్షా కేంద్రం వద్ద దింపారు. భార్యను తిరిగి మెదక్‌లోని ఆసుపత్రికి పంపి హోటల్ గదికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ (50) ఆదివారం ఉదయం భార్య డాక్టర్ అనురాధ, కొడుకు సాయివెంకట రామకృష్ణప్పలతో కలసి కేపీహెచ్‌బీ కాలనీలోని సితార గ్రాండ్ హోటల్‌కు వచ్చారు. నిజాంపేట్‌లోని పరీక్ష కేంద్రంలో కొడుకు పరీక్ష రాసి.. తిరిగి వచ్చేవరకు వేచి ఉండటం కోసం ఉదయం 8 గంటలకు హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. 9 గంటలకు కొడుకును పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. అనురాధను మెదక్‌లోని ఆసుపత్రిలో రోగులను చూసేందుకు పంపించి.. 11 గంటల ప్రాంతంలో హోటల్ గదికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం 2.30 గం. సమయంలో అనురాధ.. చంద్రశేఖర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో హోటల్‌కు ఫోన్ చేసి ఆ గదికి వెళ్లి చూడాలని కోరారు. హోటల్ సిబ్బంది వెళ్లి కిటికీ ద్వారా గదిలోకి చూడగా చంద్రశేఖర్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించారు. విషయాన్ని పోలీసులకు తెలప డంతో వారు హోటల్ గది తలుపులు తెరిచి మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉండగా, గత నెల 9న మెదక్ జిల్లా మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్యకేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం లోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్ హత్యతో డాక్టర్‌కు ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ డీఎస్పీ తెలిపారు. చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే ఇక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకునేందుకు నైలాన్ తాడు వాడటంతోపాటు హోటల్ గదిలో నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడ్లు లభించడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒంటిపై దుస్తులు ఎందుకు లేవనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చి.... చంద్రశేఖర్ స్వస్థలం కర్ణాటక కాగా, ఇరవై ఏళ్ల క్రితం మెదక్ వచ్చి అజంపులలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అనురాధ కూడా ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె పేరుతోనే అనురాధ నర్సింగ్‌హోం నెలకొల్పారు. ఇద్దరూ మంచి డాక్టర్లుగా పేరు సంపాదించారు. కొంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ భాగస్వామ్యం ఉంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ స్థిరాస్తి కొనాలన్నా చంద్రశేఖర్ ముందుండేవారన్న పేరుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. చంద్రశేఖర్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. గదిలో 140 నుంచి 150 వరకు నిద్ర మాత్రలున్నాయి. మూడు సర్జికల్ బ్లేడ్లు కూడా లభించాయి. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆత్మహత్య వెనుక ఇతర కారణాలున్నాయా? అనేది ఆరా తీస్తున్నాం. వెల్దుర్తి పరిధిలో నమోదైన శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్‌ను పోలీసులు పిలిచి విచారించారు. – ఆకుల చంద్రశేఖర్, కూకట్పల్లి ఏసీపీ -
15వ అంతస్తు నుంచి దూకి వైద్యుని ఆత్మహత్య
బనశంకరి: నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ పై నుంచి దూకి ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వివేకనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివేక్ మధుసూదన్ (60) అనే వైద్యుడు అక్కడి నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్టుమెంటులో ఫ్లాటు కొంటానని వచ్చాడు. 15వ అంతస్తుకు వెళ్లి దూకడంతో ప్రాణాలు పోయాయి. ఈయన కుటుంబకలహాలతో భార్యకు విడాకులు ఇచ్చారు. కరోనా, లాక్‌డౌన్‌తో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానం ఉంది. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. -
ఏమైంది తల్లీ...
అందరికీ ప్రాణం పోసే తల్లివి నీవు.. ఏమైందమ్మా.. నవమాసాలు మోసి కన్న బిడ్డనే కాదనుకున్నావు.. ఆ బిడ్డతో నీవూ అనంత లోకాలకు వెళ్లిపోయావు.. ప్రాణం పోయే వారికీ మందులిచ్చి దేవుడిలా ఆదుకునే నువ్వే ఎందుకిలా చేశావో.. అంత కష్టం ఏమొచ్చిందో.. ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావంటూ ఆ తల్లీబిడ్డల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. రాజమహేంద్రవరంలోని ఓ వైద్యురాలు తన కుమారుడితో సహా బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది. వారిద్దరి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కలహాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి.. చివరికి ఆత్మహత్యకు పురిగొల్పాయి.. ఈ నేపథ్యంలో తన కుమారుడితో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దేవీచౌక్ ప్రాంతంలోని బుద్ధుడు ఆసుపత్రి వైద్యుడు డి.బుద్ధుడు కుమార్తె డాక్టర్ దొంతంశెట్టి లావణ్య (33) చర్మవ్యాధుల నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెకు కొన్నేళ్ల కిందట వరంగల్ ప్రాంతానికి చెందిన వైద్యుడు వంశీకృష్ణతో పెళ్లి జరిగింది. ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి భర్తతో లావణ్యకు విభేదాలు వచ్చాయి. దీంతో రెండు నెలల కిందట ఆమె రాజమహేంద్రవరంలో పుట్టింటికి వచ్చి ఉంటోంది. (చదవండి: అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!) ఈ నేపథ్యంలో ఇటీవల లావణ్యకు తన భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె శుక్రవారం రాత్రి తన కుమారుడు నిశాంత్ (7)కు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆ మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లీ బిడ్డలకు అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె భర్తే వేధింపులే హత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి బుద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ ఆత్మహత్య.. ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ డాక్టర్(52) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు డాక్టర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అలాగే ఎమ్మెల్యే అనుచరడైన కపిల్నగర్పై కూడా కేసు నమోదైంది. వీరిద్దరి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జర్వాల్ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని తండ్రి, సోదరుడిని విచారిస్తున్నారు. (చదవండి : సీనియర్ నేత మృతి.. విచారణకు కాంగ్రెస్ డిమాండ్) కాగా, తనకు ఈ ఆత్మహత్యతో సంబంధమే లేదని, గత 10 నెలల్లో డాక్టర్‌ను ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ చెప్పుకొచ్చారు.‘సూసైడ్ నోట్లో నా పేరు ఉందని మీడియా ద్వారా తెలిసింది. ఆయన నా పేరు ఎందుకు రాశాడో అర్థకావడం లేదు. గత 8-10 నెలల్లో నేను అతన్ని కలిసిన సందర్భాలు కూడా లేవు. గతంలో కూడా నన్ను చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. గతంలో నిర్దోషిని అని నిరూపించుకున్నట్లే, ఇప్పుడు కూడా రుజువు చేసుకుంటా. ఎలాంటి దర్యాప్తులోనైనా పోలీసులతో సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ అన్నారు. (చదవండి : ‘రైళ్లను అనుమతించడం లేదు.. ఇది అన్యాయం’) కాగా, 52 ఏళ్ల డాక్టర్ ఏప్రిల్ 18న ఉరేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆయన ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఎమెమ్యే ప్రకాశ్ జర్వాల్, ఆయన అనుచరుడు తనను డబ్బులు డిమాండ్ చేశాడని, దానికి నిరాకరించడంతో తన వ్యాపారాలు దెబ్బతీసేపనికి ఒడికట్టారని ఆరోపించారు. డాక్టర్‌కు ఢిల్లలో మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. 2007 నుంచి ఆయన ఈ బిజినెస్‌ను కొనసాగిస్తున్నారు. -
‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నిద్రపోతాను’
సాక్షి, రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : కష్టపడి చదివాడు..కన్నవారి కలలు నిజం చేశాడు. మామూలు వైద్యుడి కంటే ఏకంగా ‘గుండె’ డాక్టరే(కార్డియాలజిస్ట్) అయ్యాడు. కాలక్రమంలో అతనిలో ‘ప్రేమ’ అనే మరో కల మొగ్గలు తొడిగింది. చివరికి పెళ్లి దాకా వెళ్లింది. ఏ ప్రేమ కోసమైతే అతడు ఆరాటపడ్డాడో అదే ‘ప్రేమకల’ చెదిరిపోయింది. ఆ వైద్యుడి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. రామకృష్ణాపూర్లో విషాదం నింపిన ఘటన వివరాలివి.. పట్టణంలోని ఠాగూర్ స్టేడియం ఏరియాకు చెందిన దాసారాపు సుభాష్(34) గురువారం రాత్రి హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రిటైర్ కార్మికుడు ఆగయ్య కుమారుడైన సుభాష్ మెడిసిన్‌కు ఎంపికయ్యాడు. అరుదైన గుండె విభాగంలో స్పెషలైజేషన్ పూర్తిచేశాడు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే సుభాష్ హైదరాబాద్‌లో తానుంటున్న ఇంటిలోనే విషపు ఇంజక్షన్ వేసుకుని విగతజీవుడయ్యాడు. మనస్తాపంతోనే ఈ దారుణం మృతుడు సుభాష్ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే చెన్నైకి చెందిన నిత్య అనే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్లింది. 2017లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. సాఫీగా వీరి దాంపత్య జీవితం గడుస్తు న్నా నిత్య తల్లిదండ్రులకు మాత్రం వీరి ప్రేమ వివా హం మింగుడు పడలేదు. 15 రోజుల క్రితం నిత్య తల్లి దండ్రులు హైదరాబాద్ వచ్చి ఆమెను చెన్నైకి తీసుకువెళ్లారు. కాగా అక్కడే మరో వ్యక్తితో పెళ్లి సంబంధం చూస్తున్నారన్న సమాచారం సుభాష్‌కు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లై రెండు సంవత్సరాలు దాటిపోయాక మరో సంబంధం చూడటం జీర్ణించుకోలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. అమ్మా.. నిద్రపోతానమ్మా.. ‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నేను నిద్రపోతాను...’ అని చెప్పిన కొడుకు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవటం ఆ కన్నతల్లి పేగుల్ని పెకిలించివేసింది. గురువారం రాత్రి సుభాష్ నోట వచ్చిన పదాలే ఇక చివరి మాటలవుతాయని తల్లి మల్లమ్మ ఏ కోశాన ఆలోచించలేదు. ఉదయం పూట డ్యూటీకి టైం అవుతుందని లేపుదామని వెళ్లిన తల్లి కొడుకు విగతజీవుడయ్యాడని తెలిసి కుప్పకూలిపోయింది. ఎందరో పేషెంట్ల గుండెకు వైద్యం చేసిన తన కొడుకు నిజజీవితంలో ‘గుండె నిబ్బరాన్ని’ కోల్పోయాడని కన్నీరుమున్నీరైంది. ఆగయ్య–మల్లమ్మల సంతానంలో మూడోవాడైన సుభాష్ మృతి స్థానికంగా విషాదం నింపింది. శుక్రవారం ఉదయం ఈ వార్త తెలిసి ఠాగూర్‌స్టేడియం ఏరి యా వాసులు పెద్ద ఎత్తున వారింటికి తరలివచ్చారు. -
తొందరపడి రెండో పెళ్లి చేసుకున్నా..
అమీర్‌పేట: జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు. కాగా శ్రావణి గత నవంబర్ 1న శ్రీనివాస్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్ ఉద్యోగం చేసేందుకు తమిళనాడు వెళ్లగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. మంగళవారం ఉదయం ఆమె బాత్రూమ్లో కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఆమె తల్లి తలుపులు తట్టినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు విరగొట్టి చూడగా శ్రావణి ఉరికి వేలాడుతూ కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘తల్లి దండ్రులు తనను బాగా చూసుకున్నారని, తొందరపడి రెండో వివాహం చేసుకున్నానని, అతడు ఎలా చూసుకుంటాడో తెలియదని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అందులో పేర్కొంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
-
ప్రేమ లేదని..బతకలేనని..
-
ప్రేమ వ్యవహారంతో డాక్టర్ ఆత్మహత్య
-
ప్రేమ వ్యవహారంతో డాక్టర్ ఆత్మహత్య
గుంటూరు : ప్రేమ వ్యవహారం ఓ వైద్యుడి ప్రాణం తీసింది. మోతాదుకు మించి మత్తు ఎక్కించుకోవడం ద్వారా ఓ యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక పీపుల్స్ ట్రామా ఎమర్జెన్సీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న బండి చైతన్య శరత్చంద్ర(28) ఆదివారం నైట్ డ్యూటీ చేసి ఆస్పత్రిలోని తన చాంబర్లోనే ఉండిపోయాడు. సోమవారం మధ్యాహ్నం అయినా అతడు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర వైద్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా చైతన్య అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అతనికి అదే ఆస్పత్రిలో చికిత్స అందించడానికి యత్నించగా అప్పటికే మృతి చెందాడు. మరోవైపు కొడుకు మృతి వార్త విన్న చైతన్య తల్లి ఆస్పత్రిలో గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా.. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. వైద్యుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మనస్తాపంతో వైద్యురాలి ఆత్మహత్య
హైదరాబాద్: ఉన్నత చదువులకు అర్హత సాధించలేకపోతున్నానన్న మనస్తాపంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలానికి చెందిన రాజేశం సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమార్తె అనూష(26) ఎంబీబీఎస్ చదివి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేసేవారు. అల్వాల్ మంజీర కాలనీలో ఉంటున్న అనూష పీజీ ప్రవేశ పరీక్ష పలుమార్లు రాసినా అర్హత సాధించలేకపోయారు. ఇటీవల ఉద్యోగమూ మానేశారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బీహెచ్ఈఎల్లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి... తమ్ముడు సాగర్‌ను, అమ్మానాన్నలను మంచిగా చూసుకోమని కోరింది. అనుమానం వచ్చిన బంధువులు అనూష నివాసముండే ఇంటికి వచ్చి చూసే సరికి గది లో చున్నీతో ఉరి వేసుకుని మరణించి ఉంది. కష్టపడి ఉన్నత చదువు చదివించినా కూతురు ఆత్మహత్యకు పాల్పడడం తల్లిదండ్రులను విషాదంలో ముంచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పరీక్షలో ఫెయిల్.. మహిళా డాక్టర్ ఆత్మహత్య
ఎండీ పరీక్షలో ఫెయిలయ్యానన్న ఆవేదనతో.. ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. కృతిక (26) కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పీలమేడు ప్రాంతంలోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆమె మరణించారు. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఆమె శరీరం స్పందించలేదు. చివరకు ఆస్పత్రిలోనే ఆమె మరణించారు. ఇటీవలే కృతిక ఎండీ పరీక్షలు రాశారని, కానీ అందులో పాస్ కాకపోవడంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. -
కుటుంబ కలహాలతో వైద్యుడి ఆత్మహత్య
వరంగల్(వర్ధన్నపేట): వర్ధన్నపేట మండలానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రవీంద్రా రెడ్డి(50) సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబాల కలహాలతో పాయిజన్‌ను ఇంజక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఆయనను వరంగల్‌లోని మాక్స్‌కేర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
డాక్టర్ నవ్య అనుమానాస్పద మృతి
భర్త వేధింపులకు మరో మహిళ బలైంది. మంచిర్యాలకు చెందిన డాక్టర్ నవ్య సోమవారం ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతి మొత్తం అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. సోమవారం తెల్లవారుజామున బాత్రూంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, తన భార్య బాత్రూంలో పడిపోయిందని.. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లందని ఆమె భర్త, స్థానికంగా జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్ మనోజ్ కుమార్ పలువురు మిత్రులకు తెలిపారు. కాసేపటికే ఆమె చనిపోయిందని చెప్పి, నవ్య తండ్రి డాక్టర్ రాంబాబు ఇంటికి మృతదేహాన్ని తరలించారు. అక్కడ ఫ్రీజర్ బాక్సులో నవ్య మృతదేహాన్ని ఉంచారు. కాసేపటి తర్వాత విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపుల కారణంగానే డాక్టర్ నవ్య ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య మృతదేహం వద్ద మనోజ్ కుమార్ ఏడుస్తున్నా, అది ఏమాత్రం సహజంగా లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయన నిజంగానే తన భార్య మృతిపట్ల బాధపడుతున్నారని చెబుతున్నారు. నవ్య తండ్రి డాక్టర్ రాంబాబు మంచిర్యాలలో గత 20-30 ఏళ్లుగా ప్రసిద్ధి చెందిన రేడియాలజిస్టు. ఆయన స్కానింగ్ సెంటర్ అంటే ఈ ప్రాంతంలో చాలామందికి మంచి గురి ఉంది. అయితే, వైద్య విద్య పూర్తి చేసిన నవ్య మాత్రం ప్రస్తుతం ప్రాకట్ఈసు చేయకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.