కన్న తల్లిదండ్రులే హతమార్చి.. ఉరివేసుకున్నట్లు చిత్రించి.. | Girl Strangulated To Death By Parents In Jhansi Body Hanged To Portray As Suicide | Sakshi
Sakshi News home page

కన్న తల్లిదండ్రులే హతమార్చి.. ఉరివేసుకున్నట్లు చిత్రించి..

Published Sat, Jun 3 2023 9:18 PM | Last Updated on Sat, Jun 3 2023 9:26 PM

Girl Strangulated To Death By Parents In Jhansi Body Hanged To Portray As Suicide - Sakshi

ఉత‍్తరప్రదేశ్: కన్న తల్లిదండ్రులే కసాయిగా ప్రవర్తించారు. ఓ అబ్బాయిని ప్రేమించినందుకు సొంత బిడ్డనే గొంతు నులిమి హతమార్చారు. ఆ హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. 

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తన గ్రామంలోని ఓ అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను పలుమార్లు హెచ్చరించారు. బయటికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తల్లిదండ్రుల కళ్లుగప్పి బాలిక.. ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ‍్లింది. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ‍్యక్తం చేశారు. బాలికను చితకబాదారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వంటగదిలో బాలిక ఉరివేసుకున‍్నట్లు చిత్రీకరించారు. కానీ పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితులు నేరాన్ని అంగీకరించారు.

ఇదీ చదవండి: వివాహేతర సంబంధం: కలిసి ఉండలేక.. విడిగా బతకలేక!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement