Girl death
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి
బద్వేలు అర్బన్/కడప కార్పొరేషన్/కడప రూరల్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రేమోన్మాది లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్యాయత్నం ఘటనలో తీవ్రగాయాలపాలై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు దస్తగిరమ్మ (16) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సాయంత్రం బద్వేలులో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు దస్తగిరమ్మ మృతదేహాన్ని కడసారి చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఒక్కగానొక్క కుమార్తె ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డుతొలగించుకోవాలనే హత్య: ఎస్పీఇక దస్తగిరమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమెను అడ్డుతొలగించుకోడానికే విఘ్నేష్ ఈ హత్యచేశాడని, అతను విచారణలో కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ హర్షవర్థన్‌రాజు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు కేసు పూర్వాపరాలు వివరించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సిఫారసు చేస్తామని తెలిపారు.నా బిడ్డను తగలబెట్టిన వాణ్ణి నాకు అప్పగించండి..‘నా బిడ్డ లేకలేక పుట్టింది. నిష్కారణంగా ఆమెను తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి’.. అని మృతురాలు దస్తగిరమ్మ తల్లి హుసేనమ్మ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీ వద్ద ఆమె మీడియా ఎదుట విలపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నానని.. ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాల్సిన ఆమెను అన్యాయంగా చంపేసిన వాడిని అలాగే తాను మట్టుబెడతానన్నారు. సీఎం చంద్రబాబుతోపాటు పోలీసులంతా నాకు న్యాయం చేయాలన్నారు. రేపు మీ బిడ్డలకు ఇదే పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకుంటారా?.. అమ్మాయిలను ఏడిపించే వారు బతకకూడదని ఆమె మండిపడ్డారు. -
కన్న తల్లిదండ్రులే హతమార్చి.. ఉరివేసుకున్నట్లు చిత్రించి..
ఉత్తరప్రదేశ్: కన్న తల్లిదండ్రులే కసాయిగా ప్రవర్తించారు. ఓ అబ్బాయిని ప్రేమించినందుకు సొంత బిడ్డనే గొంతు నులిమి హతమార్చారు. ఆ హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తన గ్రామంలోని ఓ అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను పలుమార్లు హెచ్చరించారు. బయటికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తల్లిదండ్రుల కళ్లుగప్పి బాలిక.. ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికను చితకబాదారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వంటగదిలో బాలిక ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారు. కానీ పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇదీ చదవండి: వివాహేతర సంబంధం: కలిసి ఉండలేక.. విడిగా బతకలేక! -
చిన్నారి మృతిపై వీడని మిస్టరీ.. తల్లిదండ్రుల ఫోన్లు స్వాధీనం!
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాప మృతికి గల కారణాలపై మిస్టరీ వీడలేదు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో విచారిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిన్నారి ఇందుకు ఇవాళ(శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాప మృతికి గల అసలు కారణాలను వెలికి తీసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తున్న క్రమంలో దమ్మాయిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా దమ్మాయిగూడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం చెరువు నీటిని సైతం పరీక్షలకు పంపించినట్లు సమాచారం. అలాగే.. గంజాయి సెవిస్తూ విచ్చలవిడిగా తిరిగే కొందరు అనుమానితులను సైతం జవహార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, సైంటిఫిక్ ఆధారాలతోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం -
దీప్తిశ్రీ మృతదేహం లభ్యం
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సవతి తల్లి చేతిలో హత్యకు గురైన చిన్నారి దీప్తిశ్రీ ఐసాని (7) మృత దేహాన్ని పోలీసులు సోమవారం పంట కాలువ నుంచి వెలికి తీశారు. ఇంద్రపాలెం పంట కాలువ, ఉప్పుటేరు కలిసే చోట గుర్రపుడెక్కలో మృతదేహాన్ని కనుగొని ప్రత్యేక నావలో ఓ మూటలో గట్టుపైకి తెచ్చారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ కె. కుమార్ మృత దేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అస్మి మాట్లాడుతూ సవతి తల్లి శాంతికుమారియే చిన్నారిని కిడ్నాప్ చేసి ఇంటిలో హత్య చేసి షేర్ ఆటోలో తీసుకొచ్చి ఇంద్రపాలెం ఉప్పుటేరులో కలిసే పంటకాలువలో పడేసిందని తెలిపారు. సోమవారం ఉదయం నుంచి ఇంద్రపాలెం వంతెన సమీపంలో పోలీసులు, ధర్మాడి సత్యం బృందం ప్రత్యేక గాలింపు చేయడంతో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. కూతురిపై ప్రేమతో తనకు పుట్టిన బిడ్డను భర్త నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతో శాంతికుమారి ఈ ఘాతుకానికి పాల్పడిందని ఎస్పీ వివరించారు. ఇందులో శాంతికుమారి మినహా మరొకరి ప్రమేయం లేదని తెలిపారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
వర్షిత హంతకుడు ఇతడే!
కురబలకోట (చిత్తూరు)/సాక్షి, అమరావతి: సంచలనం రేపిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఊహా చిత్రాన్ని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆదివారం విడుదల చేశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత ఇటీవల చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. కల్యాణ మండపం సీసీ ఫుటేజీలో నిందితుడి ఆకారం స్పష్టంగా కన్పించలేదని డీఎస్పీ చెప్పారు. పెళ్లిలో అతన్ని చూసిన వారు చెప్పిన ఆనవాళ్లతో పాటు ఫుటేజీలోని ఆకారం ఆధారంగా ఈ ఊహా చిత్రాన్ని రూపొందించామన్నారు. ఇలాంటి పోలికలున్న వ్యక్తి కనిపిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే, ఫుటేజీలో లభ్యమైన నిందితుడి ఫొటోను కూడా ఆదివారం పోలీసులు పత్రికలకు విడుదల చేశారు. కఠినశిక్ష పడేలా చూడండి చిన్నారి హత్య తీవ్రంగా కలచివేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని చెప్పారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్షపడేలా చూడాలని పోలీసులను సీఎం ఆదేశించారు. -
పసిమొగ్గ అసువులు తీసిన శునకం
రంపచోడవరం/విశాఖపట్నం: పిచ్చికుక్క దాడిలో తీవ్ర గాయాల పాలైన ఐదేళ్ల చిన్నారి 21 రోజుల అనంతరం ఆదివారం మరణించింది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డకు చెందిన పల్లి కృపారక్ష, నాగమణి దంపతుల నాలుగేళ్ల కుమార్తె గ్రేస్ పుష్ప ఆగస్టు 21వ తేదీన పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ బాలిక ఇంటి పక్కనే ఉన్న హోటల్ నుంచి ఇడ్లీ తీసుకొస్తుండగా పిచ్చికుక్క గాయపర్చింది. బాలికను కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అదే నెల 29వ తేదీ వరకు అక్కడ చికిత్స పొందింది. వైద్య చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకోవడంతో బాలికను ఇంటికి పంపించారు. తదుపరి వైద్యం నిమిత్తం ఈ నెల 9న బాలికను ఆమె తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి కుట్టు విప్పేందుకు తిరిగి ఈనెల 18న రావాలని సూచించారు. అయితే, ఈ నెల 14న పాపకు తీవ్రజ్వరం రావటంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంటికి చేరాక.. మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఎవరిని చూసినా భయపడటం, పెద్దగా కేకలు వేయడం చేసింది. తావీజు కట్టిస్తే మంచిదని భావించిన తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలోనే మరణించింది. -
దిక్కులేని దవాఖానా!
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయరహదారిలో అధికంగా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతోందని భావించి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నా«థ్‌రెడ్డి హయాంలో రాజంపేట పెద్దాసుపత్రికి ట్రామాకేర్‌సెంటర్ మంజూరు చేయించారు. దీనిని ఇటీవల సీఎం ప్రారంభించారు. అయితే అది క్షతగాత్రులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారికి సకాలంలో చికిత్స అందకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సంఘటన ఇలా.. ఆదివారం పెనగలూరు మండలంలోని ఈటమార్పురం గ్రామానికి చెందిన శివరాజు కుమార్తె భవ్యశ్రీ బంధవులతోకలిసి అవ్వగారి ఊరైన రాజంపేట మండలంలోని ఊటుకూరు వచ్చింది. గంగమ్మకు మొక్కులు తీర్చుకొని బంధువులతో కలిసి రోడ్డుపై వెళుతుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు బైకుమీద ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందుబాటులేకపోవడంతో డ్యూటీ వైద్యురాలు సుమతికి ఫోన్‌చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.ఇంటివద్దకు వెళ్లి ఆమెను తీసుకొచ్చేలోపే చిన్నారి మృత్యుఒడికి జారుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంవల్లే ఇలా జరిగిందని బంధువులు ఆగ్రహించారు. ఆందోళనకు దిగారు. ఆకేపాటి ఆందోళన వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పట్టణ కన్వీనరు పోలా శ్రీనువాసులరెడ్డి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నిర్వహణతీరుపై పెదవి విరిచారు. చిన్నారు మృతికి కారకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధానకార్యదర్శి ఈశ్వరయ్య, బీసీవిభాగం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్, నాయకులు గోవిందుబాలకృష్ణ, రేవరాజు శ్రీనువాసరాజు, జావిద్‌అలీ పాల్గొన్నారు. సీఐ సూర్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. సీఐతో ఆకేపాటి చర్చించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు మన్నూరు ఇన్చార్జి ఎస్ఐ వినోద్ తెలిపారు. దిగజారుతున్న పెద్దాసుపత్రి పరువు రాజంపేటలో ఉన్న వైద్య విధానపరిషత్ ఏరియా ఆసుపత్రి పరువు రోజురోజుకు దిగజారిపోతోంది. 50పడకల ఆసుపత్రిగా ఉన్న పెద్దాసుపత్రిలో ట్రామాకేర్‌సెంటర్, ఓపీబ్లాక్‌ను ఇటీవల జిల్లాకు సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. అయితే పూర్తి స్ధాయిలో పేదలకు వైద్యసేవలు అందించడంలో విఫలమైందన్న ఆరోపణలను మూటగట్టుకుంది. హెడ్‌క్యార్టర్స్‌లో లేని వైద్యులు.. ఈ ఆసుపత్రికి సంబంధించి వైద్యులు స్ధానికంగా లేకపోవడం వల్ల పేదలకు వైద్యసేవలు సరిగా అందడంలేదు. ఇన్చార్జి సూపరిండెంట్‌గా ఉన్న వైద్యుడు ఒకరు సమయపాలన పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ పనిచేయడంలేదు. కొందరు వైద్యులు రావల్సిన సమయంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలో ఈ ఆసుపత్రి ఉంది. అత్యవసర సమయంలో సరిగా చికిత్స అందడంలేదని బాధితులు వాపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం,నిర్వహణ అధ్వానం ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. -
యూపీ స్కూల్లో విద్యార్థిని మృతి.. అనుమానాలు
సాక్షి, డియోరియా: ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉదంతం మరిచిపోక ముందే ఉత్తర ప్రదేశ్ లో మరో విద్యార్థిని మరణం సంచలనంగా మారింది. డియోరియా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో అంతస్థు నుంచి పడి బాలిక మృతి చెందగా, అది హత్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడ్రన్ సిటీ మాంటిస్సోరీ స్కూల్లో నీతూ చౌహాన్(16) 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడో అంతస్థులోని టాయ్ లెట్‌కి వెళ్లింది. ఎంత సేపటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా.. రక్తపు మడగులో కింది ఫ్లోర్లో పడి ఉంది. వెంటనే విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లగా.. వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. అయితే ఆమెను హత్య చేశారని నీతూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ‘స్కూల్ యాజమాన్యం మాకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఘటన తర్వాత ప్రిన్సిపాల్ ఆద్య తివారీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. తోటి విద్యార్థినులు వచ్చి ఘటన గురించి మాకు తెలియజేశారు’ అని ఆమె తండ్రి పరమహంస్ చౌహాన్ చెబుతున్నారు. ఆస్పత్రికి తరలించే సమయంలో ఆమె తన సోదరుడితో ఎవరో వెనకాల నుంచి తనను తోసేసినట్లు చెప్పిందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇక స్కూల్ యాజమాన్యం మాత్రం తాము త్వరగానే స్పందించామని చెబుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ సిస్టమ్ గత కొంతకాలంగా పని చేయకపోవటంతో ఫుటేజీని స్వాధీనం చేసుకోలేకపోయామని సీనియర్ అధికారి రాజీవ్ మల్హోత్రా చెప్పారు. ఫోరెనిక్స్ బృందం ఘటనా స్థలి నుంచి ఆధారాలు సేకరించిందని, కేసును వీలైనంత త్వరగా చేధిస్తామని ఆయన అంటున్నారు. -
ఉసురు తీసిన గేటు..
చిన్నారి గాయత్రి మృతి చెల్లాయికి తీవ్ర గాయాలు వీఆర్‌పురం (రంపచోడవరం) : చేసే పని అడవిలోనే కదా అని అనుకున్నారో ఏమోగాని అటవీ శాఖ అధికారులు కనీస నిబంధనలను పాటించకుండా ఏర్పాటు చేసిన గేటు ఒక బాలిక మృతికి , మరో బాలిక శాశ్వతంగా అంగవైకల్యానికి కారణమైంది. మండలంలోని జీడిగుప్ప శివారు దారపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన విన్నెల సత్యనారాయణరెడ్డి, కనకమ్మల దంపతులకు ఐదుగురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో మూడో కుమారై గాయత్రీ (9), రెండో కుమారై సంగీత కొంతమంది పిల్లలతో పెదకొండ బంగ్లా సమీపంలో మామిడికాయలు కోసుకునేందుకు వెళ్లారు. ఇటీవల ఆ దారిలో అడవిలోని అక్రమ కలప రవాణా అరికట్టేందుకు వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఇనుప గేటును ఏర్పాటు చేశారు. ఆ గేటు అవతలి వైపు ఉన్న మామిడి చెట్ల వద్దకు వెళుతున్న పిల్లలు ఆ గేటును పట్టుకుని ఊగుతుంటే గేటు సిమెంటు దిమ్మెతో సహా విరిగి పడిపోయింది. దీంతో గాయత్రి, సంగీత ఆ గేటు దిమ్మ కింద ఇరుక్కుపోయారు. దీంతో మిగిలిన పిల్లలు భయపడి పరుగున గ్రామానికి చేరుకుని విషయాన్ని పెద్దలకు తెలియజేశారు. వారొచ్చి చూసేసరికి గాయత్రి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సంగీత కుడి కాలు విరిగి అపస్మారక స్థితిలోకి ఉంది. సంగీతను ఆటోలో రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించి మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి భద్రాచలం తీసుకువెళ్లారు. గాయత్రి మూడో తరగతి చదువుతూ మధ్యలో నిలిపివేసింది. సంగీత దారపల్లి గ్రామంలోని పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఒక కూతురు మృతి చెందడం, మరో కూతురు కాలు పోగొట్టుకొని ఆస్పత్రి పాలవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
యువతి అనుమానాస్పద మృతి
గట్టుప్పలలో కాలిన గాయాలతో చనిపోయిన సోని హత్యా.. ఆత్మహత్యా అని పోలీసుల దర్యాప్తు సోని మృతిపై అనుమానాలు తల్లిదండ్రులను విచారిస్తున్న పోలీసులు చండూరు: నల్లగొండ జిల్లా గట్టుప్పలలో బొడిగె సోని (19) అనే యువతి కిరోసిన్ మంటల గాయాలతో మృతి చెందిన ఘటన వివాదాస్పదమవుతోంది. ఇప్పటివరకు చండూరు మండలంలో ఉన్న గట్టుప్పలను మండల కేంద్రం చేయాలని స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అదే డిమాండ్‌తో సోని ఆత్మహత్య చేసుకుందని తొలుత ప్రచారం జరిగినా.. ఆ తర్వాత పలు అనుమానాలకు దారితీసింది. అనుమానంతో తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే.. సోని మృతి అనంతరం డీఐజీ అకున్ సబర్వాల్ గ్రామానికి రావడం, సోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లిన నల్లగొండ జిల్లా ఆసుపత్రికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు వచ్చి పరిశీలించడం, పోలీసులను మోహరించి, బాష్పవాయు గోళాల వాహనాలతో పోలీసులు బందోబస్తు పెట్టడం గమనార్హం. ఇదీ జరిగింది.. గట్టుప్పల గ్రామానికి చెందిన బొడిగె క్రిష్ణయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి కాగా, ఇద్దరు కుమార్తెలు ఇంటి దగ్గరే ఉంటున్నారు. చిన్న కుమార్తె సోని(19) మానసిక వికలాంగురాలు. ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందన్న వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది. ఆ సమయంలో సోని తల్లితండ్రులతో తోబుట్టువు స్వాతి.. గట్టుప్పలను మండల కేంద్రంగా చేయాలనే ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ తర్వాత సోని తల్లి, కూతురు ఇంటికి చేరుకోగా బాత్రూంలో కాలిన గాయాలతో సోని కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటుచేసి 108లో ఆమెను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే గ్రామంలో 144వ సెక్షన్ విధించారు. పోలీసుల రంగప్రవేశంతో.. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత కేసు కొత్త మలుపు తిరిగింది. సోని తలకు, వీపు మీద గాయాలుండడం, ఆమె పూర్తిగా కూడా కాలి లేకపోవడంతో హత్యచేసిన తర్వాతే కిరోసిన్ పోసి తగులబెట్టారని పోలీసులు అనుమానించారు. సోని చనిపోయిన ప్రదేశంలో కూడా ఆమె ఫోన్ ఉండడం, కిరోసిన్ పోసుకుని తగులబెట్టుకున్న ఆనవాళ్లు కనిపించకపోవడం, ఇంట్లోని మంచం వద్ద రక్తపు మరకలు కనిపించడం, బాత్రూం పక్కనే ఉన్న ఐదు లీటర్ల కిరోసిన్ డబ్బా, అక్కడే అగ్గిపెట్టె ఉండటం లాంటి అంశాలను పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనే సోని తల్లిదండ్రులిద్దరినీ అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోని తల్లిదండ్రులను విచారణ చేస్తున్నామని, హత్యా, ఆత్మహత్యా అనేది తేలలేదని, శవపరీక్ష ద్వారానే తెలుస్తుందని చండూరు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి చెప్పారు. సోని మృతదేహానికి నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాలేదు. నల్లగొండ ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. తలకు గాయాల వల్లే మృతి: ఎస్పీ సోని తలకు గాయం కావడం వల్లే మృతి చెందినట్లు ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోని మృతి చెందిన తర్వాతే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్.. సజీవ దహనం
నిందితులపై రేప్, హత్య, ‘నిర్భయ’ కేసు నమోదు పరకాల: బతుకుదెరువు కోసం వచ్చిన బాలిక కామాంధుల చేతిలో బలైపోయింది. కామాంధులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన అనంతరం హత్య చేసి మృతదేహంపై డీజిల్ పోసి దహనం చేశారు. వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లిలో బుధవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఇరుగుదిండ్ల కృష్ణవేణి(17)ది ముమ్మాటికి హత్యేనని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కి చెందిన ఇరుగుదిండ్ల వెంకటేశ్ కుటుంబం బతుకుదెరువు కోసం ఏడాది క్రితం పరకాల మండలం నర్సక్కపల్లికి వచ్చారు. ఓ ఇంట్లో అద్దెకు ఉం టూ క్రేన్ సహాయంతో బావుల పూడికతీత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతని పెద్ద కూతురు కృష్ణవేణి కూడా తండ్రి వెంట పనికి వెళ్తోం ది. అదే గ్రామానికి చెందిన వేముల రాజుతో కృష్ణవేణికి పరిచయం ఏర్పడింది. డబ్బులు బ్యాంకులో వేయడం కోసం అప్పుడప్పుడు పరకాలకు వచ్చే కృష్ణవేణిని రాజు కలిసేవాడు. ఈ నెల 26న తండ్రి వెంకటేశ్‌కు ఛాతీలో నొప్పిరావడంతో వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఇంట్లో ఉన్న కృష్ణవేణి వద్దకు బుధవారం మధ్యాహ్నం వేముల రాజు వచ్చాడు. అతని వెంట స్నేహితులైన కందికొండ కార్తీక్, బండి శ్రావణ్, గట్టు సాయిలు కూడా ఉన్నారు. కృష్ణవేణిపై వారంతా సామూహికంగా లైంగిక దాడికి పాల్పడా రు. ఈ విషయం బయటకు రాకుండా ఉండడం కోసం హత్యచేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి తలుపులు వేసి పరారయ్యారు. బుధవారం పరకాల డీఎస్పీ సంజీవరావు, సీఐ మల్లయ్య ఈ ఘాతుకంపై విచారణ చేపట్టగా విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కాగా, తన కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని, ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు దుర్మార్గులను ఉరితీయాలని కృష్ణవేణి తండ్రి వెంకటేశ్ పోలీసులను కోరారు. అయితే, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో తమకు న్యాయం జరిగే అవకాశం కన్పించడం లేదని ఆవేదన చెందాడు. మృతురాలు తండ్రి వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సక్కపల్లి గ్రామానికి చెందిన వేముల రాజు, కందికొండ కార్తీక్, బండి శ్రవణ్, గట్టు సాయిలపై రేప్, హత్య, నిర్భయ కేసులను నమోదు చేసినట్లు సీఐ మల్లయ్య తెలిపారు. -
వీధి కుక్కల దాడిలో బాలిక మృతి
వల్సాద్ (గుజరాత్): వీధి కుక్కల దాడిలో మరో బాలిక మృతి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఈ ఘోర ఘటన జరిగింది. శుక్రవారం వల్సాద్ జిల్లా కరాదివా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కెన్నీ పటేల్ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై ఎనిమిది నుంచి తొమ్మిది కుక్కలు దాడి చేశాయి. ఈ దాడితో భయకంపితురాలైన ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తర్వాత గ్రామస్థులు ఆమెను కుక్కల దాడి నుంచి కాపాడి తొలుత స్థానిక పీహెచ్సీ, అక్కడి నుంచి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికితరలించారు. అయితే ఆ రెండు చోట్ల యాంటీ రాబిస్ ఇంజక్షన్ లేకపోవడంతో ఆమెను వల్సాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలిక ఒంటిపై 20పైగా తీవ్రంగా కాట్లు ఉన్నాయని, ఆమెను తీసుకురావడంలో ఆలస్యం జరగడంతో కాపాడలేకపోయామని డాక్టర్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న బాలిక తల్లి మరుగుదొడ్డి కట్టుకోవడానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికీ అది పెండింగ్‌లో ఉండటం శోచనీయమని స్థానికులు పేర్కొన్నారు.