
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయణమనగానే ఎవరికైనా ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు లాంటి పెద్ద నగరాలు గుర్తుకువస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఇందుకోసం ఈ ఆయా నగరాలకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రాష్ట్రంలోని ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 487 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. ఇప్పుడు ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ విమానాశ్రయాలు యూపీలో ఎక్కడున్నాయనే వివరాల్లోకి వెళితే..
అయోధ్య
రామజన్మభూమి అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమైన దరిమిలా అక్కడ ‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో విదేశీ పర్యాటకులు నేరుగా అయోధ్యకు చేరుకోగులుగుతున్నారు.
నోయిడా
నోయిడాలోని జెవార్‌లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. 40.0919 హెక్టార్ల భూమిలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం సాగింది. ఇక్కడ ఐదు ఐదు రన్‌వేలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
కుషీనగర్
కుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
లక్నో -వారణాసి
యూపీలోని లక్నో, వారణాసిలో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో
Comments
Please login to add a commentAdd a comment