Vijayawada Crime News: Suspicious Death Of A Young Man Who Fell In Love And Married With Hijra - Sakshi
Sakshi News home page

Love Marriage With Hijra: హిజ్రాను ప్రేమించి పెళ్లాడిన యువకుడు అనుమానాస్పద మృతి

Published Sun, Dec 19 2021 7:42 AM | Last Updated on Sun, Dec 19 2021 4:39 PM

Suspicious Death Of A Young Man Who Fell In Love  And Married With Hijra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): హిజ్రాను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూరాజరాజేశ్వరీపేటలో శనివారం చోటుచేసుకుంది. న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన వడ్డీ రమదేవి, రామారావు దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు వడ్డీ ప్రవీణ్‌కుమార్‌ (26) రెండేళ్ల క్రితం న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన అవ్వ మాధవి అనే హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అప్పటి నుంచి తన తల్లిదండ్రుల పక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నారు. వారిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ మళ్లీ సర్దుకొని జీవిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్‌లో తమ బంధువుల ఇంట్లో వేడుక ఉంటే వెళ్లగా హిజ్రా మాధవి శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో తమ కుమారుడు ఉరేసుకొని చనిపొయినట్లు ఫోను చేసి చెప్పింది. దీంతో వారు హూటాహూటిన నగరానికి చేరుకొని తమ కుమారుడి భౌతికకాయాన్ని చూసి కుమిలిపోయారు. తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. 

చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement