న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులు చట్టంతో ఆటలాడుకోవాలని చూస్తున్నారని బాధితురాలి తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిని ఉరితీస్తేనే వారికి చట్టం అంటే ఏంటో తెలిసి వస్తుందని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 1న నిర్భయ దోషులందరికీ ఉరిశిక్ష అమలైతేనే తనకు ఆత్మసంతృప్తి కలుగుతుందని ఉద్వేగానికి లోనయ్యారు. ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు( ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)) దాదాపు రెండున్నరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆనాటి నుంచి దోషులకు ఎప్పుడెప్పుడు శిక్ష అమలు చేస్తారా అని నిర్భయ తల్లి ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆనాటి నుంచి ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి చట్టపరమైన మార్గాలన్నింటినీ దోషులు ఉపయోగించుకుంటున్నారు.(నిర్భయ కేసు : పిటిషనర్‌కు సుప్రీం చురకలు)
ఈ నేపథ్యంలో పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన అనంతరం నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి వాళ్లు వేసిన ఎత్తుగడ మరోసారి చిత్తయింది. ఫిబ్రవరి 1న వాళ్లను ఉరితీయాల్సిందే. శిక్ష అమలును జాప్యం చేయడానికి ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్లను సైతం ఒక్కొక్కరిగానే ఉరితీయాలి. అప్పుడే చట్టంతో ఆడుకుంటే ఏమవుతుందో వారికి అర్థమవుతుంది’’అని పేర్కొన్నారు.(ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు )
నిర్భయ కేసు: సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి
నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment