న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది.
ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్‌ను ప్రారంభించినట్లు వివరించింది.
పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్‌లో పీఏసీఎల్‌తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్‌సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment