సోనీ - జీ ఒప్పందం రద్దు..! | Sony Calls Off Merger Of Zee Entertainment | Sakshi
Sakshi News home page

Zee-Sony Merger Deal: రద్దయిన సోనీ - జీ ఒప్పందం...!

Published Mon, Jan 22 2024 2:25 PM | Last Updated on Mon, Jan 22 2024 3:35 PM

Sony Calls Off Merger Of Zee Entertainment - Sakshi

జపనీస్ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా మధ్య ఒప్పందం రద్దయింది. దీంతో 10 బిలియన్ డాలర్ల (రూ. 8,31,32,55,00,000) ఒప్పదం నిలిచిపోయింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

సోనీ పిక్చర్స్ నెట్​వర్క్​ ఇండియా పేరును దాని మాతృ సంస్థ చాలా రోజుల కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్​టైన్​మెంట్​గా మార్చింది. నిజానికి జీ ఎంటర్​టైన్​మెంట్ లిమిటెడ్ కంపెనీను సోనీ తనలో విలీనం చేసుకోవాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, అది పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో ఒప్పందం పూర్తిగా రద్దయింది.

సోనీ & జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్​ పీరియడ్​తో కలుపుకొని, 2023 డిసెంబర్​ 21లోపు అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. అనుకున్న విధంగా జరగకపోతే.. ఇరుపార్టీలు కలిసి ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఆలా జరగకపోతే.. నోటీసు ఇచ్చి విలీనం నుంచి తప్పుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం - వీడియో వైరల్

సోనీ-జీ ఎంటర్​టైన్​మెంట్​ విలీనానికి ఇదివరకే ఫెయిర్​ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్​ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement