వార్తా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలంటూ హుకుం
లేకుంటే భారీగా పన్ను భారం
ససేమిరా అంటున్న మెటా
కాన్‌బెర్రా: టెక్ దిగ్గజాలపై కొరడా ఝళిపించేందుకు ఆ్రస్టేలియా సిద్ధమైంది. వార్తలు ప్రచురించినందుకు స్థానిక మీడియాకు చెల్లింపులు చేసేందుకు ఉద్దేశించిన కఠిన చట్టం త్వరలో అమలవనుందని ప్రభుత్వం గురువారం తెలిపింది. 2025 జనవరి నుంచి ఇది అమలవుతుందని, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది.
మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలు తమ వేదికలపై ప్రచురించే వార్తలకుగాను ఫీజు చెల్లించాలంటూ 2021లో ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టం తీసుకువచ్చింది. తాజా నిర్ణయం ఈ చట్టానికి కొనసాగింపేనని చెబుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా వార్తా సంస్థలతో ఉన్న చెల్లింపు ఒప్పందాలను పునరుద్ధరించబోమని ఇటీవల ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల యాజమాన్య సంస్థ మెటా చేసిన ప్రకటన ఆ్రస్టేలియా పార్లమెంట్‌తో ప్రతిష్టంభనకు కారణమైంది.
గురువారం ఆ్రస్టేలియా ప్రభుత్వం ‘న్యూస్ బార్గెనింగ్ ఇన్సెంటివ్’పేరుతో ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.1,350 కోట్ల కలిగిన టెక్ కంపెనీలు మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పరిశ్రమకు సబ్సిడీ ఇచ్చేందుకు మరో పరిశ్రమపై భారం మోపుతోందని మెటా దీనిపై వ్యాఖ్యానించింది. ‘డిజిటల్ వేదికలు ఆ్రస్టేలియా నుంచి భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నాయి.
ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో నాణ్యమైన జర్నలిజం సేవలను పొందుతున్నందుకు తోడ్పాటు నివ్వాల్సిన సామాజిక, ఆర్థిక బాధ్యత వాటిపై ఉంది’అని ప్రభుత్వం అంటోంది. డిజిటల్ వేదికలు పెరిగిపోవడంతో సంప్రదాయ మీడియా సంస్థలు నష్టపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే పబ్లిషర్లు, టెక్ కంపెనీల మధ్య సమతూకం పాటించేందుకు నిబంధనలు తెచి్చనట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మెటా తదితర కంపెనీలు ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాల గడువు పూర్తి కావొచ్చింది.
ఫేస్‌బుక్ కంటెంట్‌లో వార్తలు, రాజకీయ సంబంధ అంశాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉంటుందని మెటా అంటోంది. అందుకే, తిరిగి ఒప్పందాలను కుదుర్చుకోబోమని, బదులుగా వార్తల ట్యాబ్‌లను తొలగిస్తామని చెబుతోంది. ఈ చర్యతో ఆ్రస్టేలియా మీడియా సంస్థలు సుమారు రూ.1,700 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. దీనిపై ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. ఆ్రస్టేలియా వినియోగదారుల పట్ల మెటా ప్రాథమిక బాధ్యతలను సైతం విస్మరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిబంధనలన్నీ కేవలం ఆ్రస్టేలియా జర్నలిజానికి సాయం పడేందుకే తప్ప తాము ఆదా యం పెంచుకునేందుకు కాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment