మీకు జీతం ముఖ్యమా? శాలరీ ముఖ్యమా? అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జాబ్ కంటే తీసుకునే జీతం ఎంత ఎక్కువైతే మంచిదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు మనలో చాలా మంది.
అందుకు మెటాలాంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తూ వందల కోట్లలో వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు అతీతులేం కాదు. గతంలో వాళ్లు కూడా జీతం తక్కువైందని పేరున్న కంపెనీలు పిలిచి ఉద్యోగం ఇస్తాంటే సున్నితంగా తిరస్కరిస్తున్న సందర్భాలున్నాయి. మరి మీరూ?
ట్యూరింగ్ అవార్డ్‌ను సొంతం చేసుకుని
మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ యాన్ లెకున్. ఏఐలో రంగంలో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారంతో సమానమైన ట్యూరింగ్ అవార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్‌గా ఉండే యాన్ లెకున్ తాజాగా ఎక్స్.కామ్‌లో తనకు గూగుల్ జాబ్ ఆఫర్ ఇస్తే దాన్ని ఎందుకు వదులుకున్నారో తెలిపారు.
అనేక కారణాల వల్ల 2002లో గూగుల్‌లో రీసెర్చ్ డైరెక్టర్ జాబ్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. వాటిల్లో ప్రధానంగా జీతం తక్కువ కావడమేనని అన్నారు.
జాబ్ కన్నా.. జీతం ముఖ్యం
‘‘జీతం తక్కువగా ఉంది. స్టాక్ ఆప్షన్ ఎక్కువే. కానీ నాకు కాలేజీ చదవాల్సిన టీనేజ్ కుమారులున్నారు. డబ్బులు అవసరం. న్యూజెర్సీలో కంటే సిలికాన్ వ్యాలీలో నివాసం ఖరీదైన వ్యవహారం’’ అని అన్నారు.
గూగుల్ ఆఫర్ తిరస్కరణ
‘‘ఆ సమయంలో గూగుల్‌కి 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నాయి. ఆదాయం లేదు. ఆ సమయంలో గూగుల్‌లో 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి సమయాల్లో గూగుల్‌లో చేరి కార్పొరేట్ వ్యూహం, సాంకేతికత అభివృద్ధి, ఉత్పత్తులు, నిర్వహణ మొదలైన వాటి మెషిన్ లెర్నింగ్, విజన్, రోబోటిక్స్ అండ్ కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ విభాగాల్లో రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టే గూగుల్ ఆఫర్‌ను తిరస్కరించా’’నని యాన్ లెకున్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment