మెటా,ఎక్స్, గూగుల్ సంస్థలకు భారత్ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో ఆయా సంస్థల నుంచి 18 శాతం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ విభాగం ఐజీఎస్టీ నుంచి ఓఐడీఏఆర్ సంస్థలకు ఇకపై మినహాయింపు ఇవ్వబోదని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అడ్వటైజింగ్, క్లౌడ్ సర్వీస్, మ్యూజిక్, సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సేవలందిస్తున్న ఆయా కంపెనీలు నుంచి ఐజీఎస్టీని వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైందంటూ ఈ అంశంలో ప్రమేయం ఉన్న ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
ప్రస్తుతం, ఓఐడీఏఆర్ సంస్థలు ఎలాంటి ట్యాక్స్ చెల్లించే పనిలేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు పన్ను నుంచి మినహాయింపులు ఇస్తున్నాయి. కేవలం, బిజినెస్ టూ బిజినెస్ సర్వీస్‌లు అందించే కంపెనీలు మాత్రమే ట్యాక్స్‌లు చెల్లిస్తున్నాయి. తాజాగా పన్నుల విభాగం తీసుకున్న నిర్ణయంతో ఓఐడీఏఆర్ సంస్థలైన మెటా,ఎక్స్, గూగుల్ వంటి సంస్థల మీద పన్ను భారం పడనుంది.
ఓడీఐఆర్ అంటే ఏమిటి?
ఓడీఐఆర్ ని ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీసెస్ అని పిలుస్తారు. ఈ విభాగంలో సేవలందించే సంస్థలు వ్యక్తులు లేదంటే కస్టమర్లుతో ఎలాంటి భౌతిక సంబంధం ఉండదు. ఆన్‌లైన్ ద్వారా వినియోగదారుల అవసరాల్ని తీర్చుతాయి. గూగుల్,మెటా,ఎక్స్ తో పాటు ఆన్‌లైన్ ద్వారా కస్టమర్ల అవసరాల్ని తీర్చే కంపెనీలు ఈ ఓఐడీఐఆర్ విభాగం కిందకే వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment